ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 27 February 2015

ఋగ్వేదం - ప్రథమ సూక్తం (౩)ఋగ్వేదం - ప్రథమ సూక్తం (౩)

ఓం యదజ్ఞ దాశుషే త్వ మగ్నే భద్రం కరిష్యసి !
తవేత్తత్ సత్యమజ్ఞిర: !!


అంగ అగ్నే! అంగిర: = చూడు అగ్ని! (దావాగ్ని అంగారాల్లాగా కోరికలను కాల్చిశమింపజేసే) అంగిరుడా!; త్వం = నువ్వు; దాశుషే = తాను చేసే కర్మలనన్నింటినీ భగవత్సమర్పణం చేసేవాడికి; యత్ భద్రం కరిష్యసి = ఏ సుఖ కల్యాణాలను కలిగిస్తావో; తత్ తవ ఇత్ = అది నీదే, నీకు తగినదే; తత్ సత్యం = ఇది ముమ్మాటికీ నిజం.

చూడా అగ్ని! అంగారాల్లాగా, ఆసక్తులను అంటించి దహించి, శమింపజేసే అంగిరుడా! తాను చేసే సర్వ కర్మలనూ, భగదర్పణం చేసే సాధకుడికి నువ్వు కలుగజేసే భ్రదతను నువ్వే ఇవ్వగలవు. అది నీకే చెల్లును. ఇది ముమ్మాటికీ సత్యం.

ప్రియతమైన అగ్ని! ద్రవ్య హవిస్సులనూ క్రియా హవిస్సులను నీకు సమర్పించి నీలో వేల్చే సాధన యజమానికి నువ్వు ప్రసాదించే పరమసుఖం... అదే, నీ సత్యమైన రూపు.... అదే నీ ప్రధనమైన ప్రదీప్త స్వరూపం... అదే నీ విలక్షణమైన లక్షణం.

7. ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ ధియా వయం !
నమ భరన్త ఏమసి !!

అగ్నే = హే అగ్నీ; వయం = సాధకులమైన మేము; దివే దిదే దోషావస్త: = ప్రతీరోజూ రాత్రీ పగలూ; ధియా = బుద్ధిపూర్వకంగా చేసే కర్మలను; నమో భరన్త: = నమస్సులతో నింపుతూ (కర్మలను అణుకువతో చేస్తూ); ఉప, త్వా, ఆ ఇమపి = నీ దగ్గరకు చేరుతున్నాము.

అగ్నీ! మేము అహరహమూ రాత్రీ, పగలూ (అనే భేదం లేకుండా) మనసా బుద్ధ్యా వినయ పూర్వకంగా కర్మలను చేస్తూ నమస్సులనర్పిస్తూ నీ దరికి చేరుతున్నాం.

8. రాజన్త మధ్వరాణాం గోపామృతస్యదీదివిమ్ !
వర్ధమానంస్వే దమే !!

రాజన్తం = దేదీప్యమానంగా వెలుగుతున్న; అధ్వరాణాం = ఫలాసక్తి అన్న హింసను బహిష్కరించిన యజ్ఞ మార్గాలను; గోపాం = సంరక్షిచేవాడివీ; ఋతస్య = విశ్వనియమాన్ని; దీదివిం = బాగా ప్రకాశింపజేసేవాడివీ; స్వే, దమే, వర్ధమానం = నిగృహీతమైన, క్రమశిక్షణాయుక్తమైన, సాక్షాత్తూ తనదే అయిన సాధన శరీర గృహంలో వర్ధిల్లుతున్నవాడివీ; స: త్వం అగ్నే = అటువంటి నువ్వు; ఓ అగ్ని మానవే = కొడుకుకు.

ఫలాసక్తి వల్ల కలిగే హృదయ సంకటాలను ఉద్వేగాలనూ పోగొట్టుకుని దివ్యసాధనాపథాలను అనుసరించే సాధకుడిని సంరక్షిస్తూ, విశ్వనియమాన్ని (భగవదిచ్ఛను) అతనికి గోచరమయ్యేలాగా ప్రకాశింపజేస్తూ అతని సంయమిత శరీర గృహంలో సంవర్థమానమవుతున్న.

అగ్నీ! పలాసంగమనే బంధకారక పీడను విడిచిన మార్గాలను సంరక్షిస్తూ విరాజిల్లుతున్నావు నువ్వు. ప్రచండ తేజస్సుతో విశ్వధర్మసేతువులను కాపాడుతున్నావు.

నిగ్రహ ప్రకాశితమైన వ్యక్తిగత దేహగేహాల్లోనూ.. విశ్వకాయ మహా గృహంలోనూ ప్రదీప్తంగా వర్ధిల్లుతున్నావు. ఆ నీకు చేరువై, సన్నిహితమై ప్రతిరోజూ, రాత్రింబవళ్లు ఎడతెరిపిలేకుండా నిరంతరమూ కాయేన, మనసా, బుద్ధ్యా కర్మణా నీ సన్నిధినే కల్పించుకుంటూ మేము సర్వ సమర్పణా పూర్వక నిర్భర భావంతో నిన్ను ధ్యానం చేస్తూ వుంటాం.

9. స న: పితేవ సూనవేఁ గ్నే గోపాయనోభవ !
సచస్వా న: స్వస్తయే !!

పితా ఇవ = తండ్రివలె (సులువుగా చేరదగిన వాడయినట్టు); సు ఉపాయనోభవ = సులువుగా దరిచేరనిచ్చే వాడివికా; న: = మేము, మమ్మల్ని; స్వస్తయేసచస్వ = భద్రంగా వుండేలాగా మాతో కలిసి వుండు.

ఆ నువ్వు అగ్నీ! కొడుకు తండ్రిని చేరగలిగినంత చనువుగా మమ్మల్ని నీ వద్దకు చేరనివ్వు. మేము అవ్యయంగా సుభద్రంగా వుండేలాగా మాతో ఎప్పుడూ సమ్మిళితమై వుండు.

అగ్ని! తండ్రి ఒడిలోనికి కొడుకు చేరుకునేంత సులువుగా మేమే నిన్ను చేరుకోగలిగేలాగా, నీ సాన్నిహిత్యాన్ని మాకు ప్రసాదించు.
మేము స్వస్తిమంతులమై పరమభద్రాన్ని పొందేలాగ నువ్వెప్పుడూ మాతో కూడి వుండు.

ఇంతటితో ప్రథమం సమాప్తం...

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML