
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 13 February 2015
అష్టాదశ పురాణాలలో గణ్యమైన 'స్కాందపురాణం' శివుని నుంచి స్కందుడు విన్నది కనుక ఆయన (స్కంద) పేరునే ఈ పురాణం పేరు పొందింది.
అష్టాదశ పురాణాలలో గణ్యమైన 'స్కాందపురాణం' శివుని నుంచి స్కందుడు విన్నది కనుక ఆయన (స్కంద) పేరునే ఈ పురాణం పేరు పొందింది. తంత్రశాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.
బాల సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖ సుబ్రహ్మణ్యుడు,వల్లీదేవసేనాసమేతుడు....ఇలా అనేక రూపాలు!ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుని 'సర్ప'రూపాన ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యుని శక్తులు -కుండలినీ శక్తి చలనానికి, ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక 'వల్లీ' (తీగ). ఇంద్రియశక్తులే 'దేవసేన'. ఈమె ఇంద్రకుమార్తె. ఈరెండూ చైతన్యానికి పత్నీస్థానాలు.
ఈవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పరబ్రహ్మగా ఉపాసించారు.
"నీవంటి దైవమును షడానన!
నేనెందు కాననురా!
మారకోటులందు గల శృంగారము
ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!!
అని స్కందుని కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజస్వామి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment