గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 2 February 2015

చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః!!చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః!!

చతురాత్మా - సృష్టి, సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు తానేయైన వాడు. నాలుగు విభూతులకు కర్త పరమ పురుషుడైన విష్ణువు. ఆత్మయొక్క విభూతి తత్వము చతుర్విధములని విష్ణుపురానములో చెప్పబడినది. తురీయాతీతుడు, చతురాత్ముడగు విష్ణువుకు నమస్కరిస్తున్నాము.
చతుర్వ్యూహః - సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధులుగా అవతరించినవాడు. సర్వవ్యాపియైన విష్ణువు విశ్వ సృష్టి కొరకు నాలుగు వ్యూహాలుగా అవతరించాడు. ఈ నాలుగు వ్యూహాలు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని పిలువబడుచున్నవి. చతుర్వ్యూహునిగా పిలువబడు విష్ణువుకు నమస్కరిస్తున్నాము.
చతుర్ద్రంష్ట్రః - ఐరావత, నారసింహ రూపాలలో పదునైన నాలుగు కోరలు కలిగినవాడు. దంష్ట్రములు అనగా వాడియైన కోరలు. వేదాంత పరంగా నాలుగు దంష్ట్రములు నాలుగు పాదులని అంటారు. పరమాత్మ నరసింహస్వామిగా, ఐరావతమ్గా దంష్ట్రములను కలిగియున్నాడు. చతుర్ద్రంష్ట్రుడగు విష్ణువుకు నమస్కరిస్తున్నాము.
చతుర్భుజః - శంఖచక్ర గదా పద్మములు ధరించు నాలుగు భుజములు కలవాడు. చతుర్భుజుడైన విష్ణువు శంఖచక్రగదా పద్మములు ధరించి ధర్మరక్షనను గావిస్తుంటాడు. చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడు దుష్టశిక్షణ, శిష్టరక్షన చేస్తాడు. చతుర్భుజుడైన విష్ణువకు నమస్కరిస్తున్నాము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML