గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 12 February 2015

రుద్రాధ్యాయము - మహాన్యాసము వివరణ

రుద్రాధ్యాయము - మహాన్యాసము వివరణ

శివుని అభిషేకించి స్వామి అనుగ్రహం పొందుటకు మహాన్యాస పూర్వక రుద్ర అభిషేకమే శ్రేష్టమైనది అని తెలుసుకున్నాము...
కనుక అట్టి మహాన్యాస పూర్వక రుద్ర అభిషేకాన్ని ఆచరించే విదానాన్ని తెలుప ప్రయత్నించెదను...

"నారుద్రో రుద్ర మర్చయేత్"

ఆ పరమేశ్వరుడిని పూజించుటకు
మానవుడే తననే రుద్రునిగా రౌద్రీకరణ మొనర్చుకొని అభిషేకించవలెను

"న్యాస పూర్వకం జపహోమార్చనాభిషేకం విధిం వ్యాఖ్యాస్యామః"
అనగా
పాంచ భౌతిక శరీరమందు సర్వ దేవాత్మకుడగు రుద్రుడిని ఆవాహన చేసుకొని తాను రుద్ర స్వరూపముగా పొందియే శ్రీ రుద్రనర్చింపవలెను

హంసోహం
"హ కారః పురుషః ప్రోక్తః స ఇతి ప్రకృతిర్మతా"
హకారము పురుష రూపము, సకారము ప్రకృతి రూపము, ప్రకృతి పురుషాత్మకమైనది

అహం అనగా నేను(జీవుడు)
సః అనగా పరమేశ్వరుడు అని అర్థము
నేనే పరమేశ్వర స్వరూపుడను అని భావించాలి

"దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవా్సనాతనః
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్"
అనగా దేహము(శరీరము) దేవాలయము గాను శరీరములోని చైతన్యము(జీవుడు) పరమేశ్వరునిగాను భావించి, మనోబుద్ధి, చిత్తహంకారములగు అంతఃకరణము నందుగల దుర్భావములను విపరీతమైన కోర్కెలు, ఈర్షా, అసూయ, మాలిన్యాదులను తొలగించి
"నేనే పరమాత్మను" అను భావమున పూజించవలెను

వివిధ మంత్రాదులచే న్యాసపూర్వకముగా మంత్రక్రియ అనుష్ఠానములచే రౌద్రీకరణ విధానమున రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకములను చేయవలయునని "బోదాయన మహర్షి" తెలిపెను
శివ భక్త్రాగ్రగణ్యుడు రావణుడు రచించిన "మహాన్యాసకారికలు" కూడా కలవు

మహన్యాస విధానము :

౧) పంచముఖ ధ్యానం: తూర్పు తత్పుషుడనియు, దక్షిణ అఘోరమనియు, పశ్చిమ సద్యోజాతమనియు, ఉత్తర వామదేవమనియు, ఊర్థ్వ ఈశాన దైవమనియు
శివుని పంచ ముఖములను ధ్యాన పూర్వకంగా అర్చింపవలెను

౨)ప్రథమన్యాసము: రక్షణ పొందుటకై 33 శరీర భాగములలో ఆయా మంత్రములతో మంత్రోక్త దేవతలని స్థాపించుకొని అర్చింపవలెను

౩)ద్వితీయ న్యాసము: ఓం నమో భగవతే రుద్రాయ అను మహా మంత్రముచే ఒక్కక్క అక్రమునకు అనుస్వారము పఠిస్తు స్పృశింపవలెను

౪) తృతియ న్యాసము: సద్యోజాతాది పంచ మంత్రములచే స్పృసించుటచే శివ తేజమును ఆయా స్థానములందు పొందగలరు

౫)హంస మంత్రం:తను దైవము ఒకటేయని ఏక భావమున హంసోహం అను మంత్రమును అనుష్ఠించుట

౬)సంపుటీకరణం : అంజలిని నమస్కరించుచు అష్ట దిక్కులు భూమి ఆకాశ్యాది దశ దిక్కులను
ప్రార్థించి వివిధ మంత్రాదులచే పూజించుట

౭)దశాంగ రౌద్రీకరణము: పది అవయవ స్థానములలో రుద్ర స్వరూపమును పొందుటయే దశంగ రౌద్రీకరణ, రుద్రత్వ మాపాదించుట వలన ప్రకాశమైన తేజస్సు గలవాడే గాక సమస్త ఉపద్రవములు దరిచేరవు

౮)షోడషాంగ రౌద్రీకరణ: పదహారు అవయవములలో బీజాక్షరములచే అభిమంత్రికరణ మొనర్చి అయా అవయవాలకు రుద్రత్వమెర్పడుట
ఇది తనను తన కుటుంబమును తన వంశమును రక్షించును

౯)ఆత్మ రక్ష: వివిధ మంత్రములచే వివిధ అవయవాలను సృజించి తన రూపములో యున్నది బ్రహ్మయని వారిని "ఆత్మన్" అని భావింపవలెను

౧౦)శివ సంకల్పం: శివ సంకల్పం అనగా మంగళకరమైన, శుభమైన సంకల్పం అని అర్థం
శుభకరముగా ఉండవలెనని ప్రార్థించుట మరియు ఇది సమస్త పామపములను పొగొట్టును

౧౧)పురుషసూక్తం: విరాట్పురుషుని వర్ణన మరియు ఇది శ్రేష్టమైన సంపద, చక్కని దేహము, దీర్ఘాయువు, అష్ట సిద్దులు, పొంది మాహా పాపముల నుండి విముక్తి పొందుదురు

౧౨)పంచమన్యాసము: ముప్పై మూడు కోట్ల దేవతలను ప్రార్థించుట

౧౩)అష్టాంగం ప్రణమ్య: వక్షస్థలము, నేత్రములు,మనస్సు, నోరు,పాదములు,చేతులు,చెవులు అను ఎనిమిది అవయవములచే శివునికి సాష్టాంగ నమస్కారం చేయుట

౧౪)రుద్ర ధ్యానం: తెల్లని శరీరము, మూడు నేత్రాలు, పంచముఖాలు, పదిచేతులు, సమస్త ఆభరణాలు, నల్లని కంఠం, జటాజూటము, చంద్రవంఖ,సర్పము, యజ్ఞోపవీతం,పులిచర్మం, కమండలం, రుద్రాక్షలు, శూలము వరధ అభయ ముద్రలు కలిగి
సకల దేవతలు రాక్షసాదులచే పూజింపబడుతున్న విశ్వరూపుడైన రుద్రుని ధ్యానింపవలెను

"అగ్నిర్మే వాచి శ్రితః" అనే మంత్రముతో అవయవములను హృదయమును స్పృశించుకుంటు ఆరాధింపవలెను

"ఆరాధతో మనుషరవస్త్వం శుద్ధైః దేవ సురాదిభిః
ఆరాధయామి భక్త్యాత్వాం మాంగృహాణ మహేశ్వరః"
హే మహేశ్వరా! దేవాసుర మనుష్యులతో నీవారాదింపబడుదువు నిన్ను నేను భక్తితో ఆరాదిస్తున్నాను
నీ పాద సేవ భాగ్యము నేను జన్మ జన్మలకు పొందునట్లు అనుగ్రహింపుము

స్వామిని షోడషోపచార పూజ జరిపి వివిధ పుష్పాలచే అర్చించి యదాశక్తి రుద్ర గాయత్రి జపించవలెను
తదుపరి స్వామిని పంచామృత వివిధ ఫల రసాలచే సుగంద పుష్ప బిల్వ శుద్దోదకాలచే అభిషెకింపవలెను

రద్రాధ్యాయముచే అభిషేకించవలెను
౧)ఆవర్తనం ౨)రౌద్రీ ౩)లఘు రుద్రం ౪)మహా రౌద్రీ
౫)అతి రుద్రము అనే అయిదు విదాలలో వారి శక్త్యానుసారం ఆచరింపవలెను

ఇటుల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వలన పాప పరిహారము, వ్యాది నివృత్తి, జీవిత్తేచ్చ కలుగుట, వివాహ యోగ్యత,సంతాన ప్రాప్తి, ధన కనక వస్తు ప్రాప్తి, శాంతి కలుగును ధైర్య స్థైర్య సంతోషాలు ప్రజ్ఞా,జ్జాపక శక్తి, ఆయుఃర్థాయము,ఆరోగ్యము,కలుగును
తప్పక ఇష్ఠ కామ్యములు నెరవేరును
మంత్ర అనుష్టానం కష్టతరం కనుక ఒక ఆచార్యునిచే జరిపింపవలెను

ఇటుల జరిపిన రుద్రాభిషేక అర్చన వలన
"నూరు అశ్వమేథ యాగములు" జరిపిన ఫలితం కలుగునని భోదాయన మహర్షి చెప్పియుండెను..

ఆచరించి సత్ఫలితాలను పొందగలరని కోరుతు..

మీ..
మోహన కృష్ణ భార్గవాచార్య.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML