గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 February 2015

గాయత్రి మంత్ర ప్రాధాన్యత.గాయత్రి మంత్ర ప్రాధాన్యత.


“ఓం భూర్భువస్సువః
తత్సత్వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్”
ఇదీ గాయత్రీ మంత్రం. మన పూజల్లో గాయత్రీ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. ఆది శంకరాచార్యులవారు “గాయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అన్నారు. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్ధం.
చాలామంది గాయత్రీ మంత్రాన్ని పదేపదే స్మరిస్తుంటారు. ఉచ్చరించ లేనివారు సీడీ పెట్టుకుని వింటారు. కానీ దీనికి అర్ధం ఎందరికి తెలుసు? పెద్దలు చెప్పినట్లు ‘చేతిలో జపమాల, నోట్లో రామనామం కదలాడినా మనసు కనుక చంచలమైతే ఫలితం లేనట్లే’, గాయత్రీ మంత్రానికి అర్ధం, పరమార్ధం తెలీనప్పుడు లక్షసార్లు విన్నా, స్మరించినా ప్రయోజనమే లేదు. అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.
గాయత్రీ మంత్రంలో ప్రతి అక్షరానికీ అర్ధం ఉంది. స్థూలంగా - “లోకంలో సమస్తాన్నీ సృష్టించే, సర్వ విశిష్ట గుణాలతో, ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో, అటువంటి పరబ్రహ్మ స్వరూపుని, శ్రేష్టుని, జ్ఞాన ప్రకాశములు కలవానిని, పూర్తి రూపం ఉన్నవానిని ధ్యానిస్తాను” అని గాయత్రీ మంత్రానికి అర్ధం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – “ప్రణవ స్వరూపుడు, అన్నిటికీ ఆధారమైనవాడు, అంతటా నిండి ఉన్నవాడు, సర్వేంద్రియాలను ప్రకాశింపచేసేవాడు, సృష్టి, స్థితి, లయకారుడు, సమస్త దుఃఖాలను పోగొట్టి సర్వ సుఖాలను ఇచ్చే స్వయం ప్రకాశకుడైన పరమాత్మునికి నా నమస్కారాలు” అని అర్ధం.
క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పుకుంటే, “అన్ని లోకాల నుండి అన్నిటినీ నడిపించే మహాశక్తీ! మా బుద్ధులను ప్రక్షాళన చేసి, మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించు” అని గాయత్రీ మంత్ర అర్ధం. ఈ మంత్రంలో ఉద్దేశించిన శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే, ఇంకొందరు ఆది పరాశక్తిగా ధ్యానిస్తారు. మరికొందరు నిరాకార, నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు.
రోజుకు వేయిసార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రీ మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలూ హరిస్తాయని ఉద్ఘాటించాడు మనువు.
ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.
గాయత్రీ మంత్ర జపం చేయాలనుకునేవారు -
1. మూడుసార్లు ప్రాణాయామం ఆచరించి, ఆపైన గాయత్రీ జపం చేయాలి.
2. జపం చేసే సమయాన్ని బట్టి భిన్న నామ రూపాలతో ప్రార్ధించాలి.
3. ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా స్మరించాలి.
4. ప్రాతఃకాల వేళ తూర్పు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యేవరకు ప్రార్ధించాలి.
5. సాయంకాలం పడమటి దిశగా కూర్చుని, నక్షత్రాలు కనిపించేవరకూ ప్రార్ధించాలి.
6. గాయత్రీ మంత్రాన్ని పైకి వినిపించేట్లు కాకుండా మనసులోనే జపించాలని గుర్తుంచుకోవాలి.
7. గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, పునర్జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఏవిధంగా చూసినా గాయత్రీ మంత్రాన్ని మించింది లేదు. కనుక ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి.
శ్రీ గాయత్రీదేవి దివ్యశక్తి
ఓం శ్రీ గణేశాయనమః
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః
ఓం గాయత్రీ మహామంత్రము
ఓం భూర్భువ స్వః
త త్సవితు ర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ !!
సర్వవిజ్ఞాన, శబ్దశాస్త్రముల రహస్యమయాధారముపై గాయత్రీ మహా మంత్రాక్షరముల సంపుటి జరిగింది. ఈ మహామంత్రోచ్ఛారణ మాత్రముచే సూక్ష్మ దేహము నందున్న శక్తికేంద్రములు అనేకములైనవి. స్వయముగా మేలుకొనుచుండును. సూక్ష్మ దేహములోని అంగప్రత్యంగములలో అనేక చక్రోపచక్రాలూ, గ్రంధులూ, మాతృకలూ - ఉపత్యక, మేరుభ్రమరాదిగాగల రహస్య సంస్థానములున్నవి. వీటి వికాసమాత్రముచే సాధారణుడు సైతము అగణిత శక్తులకు అధినేత కాగలుగును. గాయత్రీ పవిత్ర మంత్రోచ్ఛారణా క్రమమును అనుసరించు కంఠము, జిహ్వ, దంతములు, తాలువులు, ఓష్ఠములు, మూర్థము మొదలైన వాటి నుండి గుప్తస్పందనము విశేషముగా జరుగుచుండును. ఏతత్ స్పందనము అనేక శక్తి కేంద్రములను స్మృశించి, వాటి నిద్రావస్థను రూపుమాపి చైతన్యమును కలుగజేయుచుండును. యోగీశ్వరులు, మునీశ్వరులు మొదలైన మహాత్ములు తపస్సు ద్వారా దీర్ఘకాలమున సాధించునట్టి మహా కార్యములను గాయత్రీ మహా మంత్రోపాసకులైన వారు అనతికాల వ్యవధిలోనే సాధించగలుగుచున్నారు.
భగవత్యాధకుల మధ్యగల విశేష దూరమును దూరమొనర్చుటకు చతుర్వింశత్యక్షరయుక్త మగు ఈ గాయత్రీ మహామంత్రమే మహత్తరమైన దివ్యాధారమైయున్నది. భూతములపై నున్నవారు మెట్ల సహకారముతో మహోన్నత సౌధము నధిరోహించ గలుగునట్లు గాయత్రీ మహా మంత్రోపాసకుడు 24 బీజాక్షరముల సహకారముతో భూమికలను క్రమక్రమముగా దాటుచూ గాయత్రీ మహామాతృ చరణారవింద సన్నిధిని చేరుకొనగలుగును. మహోత్తమమై పరమ పవిత్రమైన గాయత్రీ మహామంత్రములోని ప్రత్యేక బీజాక్షరము ఒక్కొక్క మంత్రసమమై మహత్తర శక్తి సంపన్నమైయున్నది. ఇందు ధర్మశాస్త్రము తేజరిల్లు చున్నది. ఇయ్యక్షరముల వ్యాఖ్యాన మూర్తి అయిన బ్రహ్మదేవుడు వేదచతుష్టయ ప్రచారార్థము మహత్తర తపస్సు చేసెను. ఆ బీజాక్షరముల మహత్తరార్థములను వ్యక్తము చేయవలెనని మహర్షులు ధర్మశాస్త్ర గ్రంథములును ప్రాదుర్భవింప జేసినారు. విశ్వవ్యాప్తమై యున్న విజ్ఞాన సర్వస్వము ఈ 24 బీజాక్షరములలో నిక్షిప్తమై యున్నది.
గాయత్రీదేవి ధ్యాన శ్లోకములు
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !
గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం
శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే !!
గాయత్రీం వేదధాత్రీం శతమఖఫలదాం వేదశాస్త్రైకవేద్యాం
చిచ్ఛక్తిం బ్రహ్మవిద్యాం పరమ శివపదాం శ్రీపదవ్యైకకోతి !
సర్వోత్కృష్టపదం తత్స వితురనుపదంతేవరేణ్యం శరణ్యం
భర్గోదేవస్యధీమహ్యభి దధతి ధియోయోనః ప్రచోదయాత్ !!
గాయత్రీం సకలాగమార్థ ఫలదాం సూర్యశ్య జీవేశ్వరం
సర్వామ్నాయ సమస్త మంత్రజననీం సర్వజ్ఞధామేశ్వరీం !
బ్రహ్మాదిత్రయ సంపుటార్ధ కరణీం సంసార పారాయణీం
సంధ్యాసర్వసమానతంత్రపరయా బ్రహ్మానుసంధాయినీం !!
సర్వే సర్వవసే సమస్త సమయే సత్యాత్మికే సాత్త్వికే
సావిత్రీ సవితాత్మికే శశియుతే సాంఖ్యాయనీ గోత్రజే !
సంఖ్యాత్రీణ్యు వకల్ప్య సంగ్రహవిధిః నంధ్యాభిదానా శివా
గాయత్రీ ప్రణవాది మంత్ర గురుణా సంప్రాప్యాతస్మై నమః !!
సౌమ్యం సౌభాగ్యహేతుం సకలసుఖదం సర్వసౌఖ్యం సమస్తం
సత్యంసద్భోగనిత్యం సుఖజన సుహృదయం సుందరం శ్రీసమస్తం !
సౌమంగల్యం సమగ్రం సకల సుఖకరం స్వస్తివాచం సమస్తం
సర్వాద్యం సద్వివేకం త్రిపద పదయుగం ప్రాప్ను మస్త్వత్సమస్తం !!
సహస్రపరమాందేవీం శతమధ్యాం దశావరా
సహస్రనేత్రాం శరణమహం ప్రపద్యే !!
గాయత్రీం ప్రణమామి వేదవపుషా యోంకార రూపావరాం
సావిత్రీం ప్రతిపాదితా మఘపరాం పద్మాసనే సంస్థితాం !
నాదనూపుర భూషితాంఘ్రియుగలాం లాక్షారసౌరంజితాం
యోగాంగైః సముపాసితా మణుతరాం విప్రస్య మోక్షప్రదాం !!
ధ్యేయా బ్రహ్మరమేశ రుద్ర గురుభిభ్రూపాక్షి ధీహేతుభిః
శశ్వద్వైవిక సంప్రదాయ కధనే విద్వద్వ రాగ్రేసదా!
సాపాయాన్ని జసేవకాన్ సృతజనాన్ శక్తాన్ ప్రియాన్వైద్విజాన్
ఫాలే భస్మత్రిపుండ్ర కాంతిలసితాన్ రుద్రాక్ష మాలాధరాన్ !!
రక్తశ్వేత హిరణ్య నీలధవళై ర్యుక్తాం త్రినేత్రోజ్జ్వలాం
రక్తాం రక్తానవ స్రజం మణిగణై ర్యుక్తాం కుమీరీమీయాం !
గాయత్రీం కమలాసనాం కరతలవ్యానద్ధం కుండాం బుజాం
పద్మాక్షీం ఛ వర సన్రజంచ దధతీం సంహాధి రూఢాం భజే !!
బ్రహ్మాణీ చతురా ననాక్షవలయా కుంభంకరైస్స్రుక్సువం
బిబ్రారుణ కాంతి బిందు వదనా ఋగ్రూపిణీ బాలికా !
హంసారోహణ కేళికాంబర మణిర్బింబాం చితా భూషితా
గాయత్రీహృది భావితా భవతు నస్సంపత్సమృద్ధిస్సదా !!
గాయత్రీదేవి అష్టకమ్
సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ
మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం
శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం
గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
విశుద్ధాం సత్వాస్థామఖిల దుఃఖ దోష నిర్హరణీమ్
నిరాకారం సారాం సువిమల తపోమూర్తిమతులాం
జగజ్వేష్ఠా శ్రేష్ఠా మసురసుర పూజ్యాం శ్రుతినుతాం
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీం !!
తపో నిష్ఠామభీష్టామంబ జనమత సంతాపశమనీమ్
దయామూర్తిం స్పూర్తిం యతియతి ప్రసాదైక సులభామ్
వరేణ్యాం పుణ్యాం తాం నిఖిల భవబంధాపహరణీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
సదారాధ్యాం సాధ్యాం సుమతిమతి విస్తార కరణీమ్
విశోకామాలోకాం హృదయగతమోహాంధ హరణీమ్
పరాం దివ్యాం భవ్యామగమ భవసింధ్వేక తరణీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
అజాం ద్వైతా త్రైతాం త్రివిధగుణరూపాం సువిమలామ్
తమోహంత్రీం తంతుం శ్రుతిమధురనాదాం రసమయిమ్
మహా మాన్యాం ధన్యాం సతత కరుణశీల విభవామ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
జగద్ధాత్రీ పాత్రీం సకల భావ సంసారకరణీమ్
సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశి సరణీమ్
అనేకామేకాం వైత్రయ జగదదిష్ఠాన పదవీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనయతి జాడ్యాపహరణీమ్
హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజనగీతాం సునిపుణామ్
సువిద్యా నిరవద్యాం కథగుణగాథాం భగవతీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
అనంతాం శాంతాం యాం భజిత బుధవృంద శృతిమయీమ్
సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృదినిత్యం సురపతిః
సదా భక్త్యా శక్త్యా ప్రణతి యతిభిః ప్రీతివశగః
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
శ్రీ గాయత్రీదేవి అష్టకమ్, ఫలం
శుద్ధ చిత్తః పఠేద్యస్తు గాయత్రి అష్టకం శుభం
అహో భాగ్యో భవేల్లోకే తస్యా మాతా ప్రసీదతి

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML