
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 13 February 2015
తలచుకుంటే ధన్యులమవుతాం. కలియుగంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకునేవారికి...కలియుగంబున నరునకు గంగ దిక్కు" అన్నారు.
తలచుకుంటే ధన్యులమవుతాం. కలియుగంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకునేవారికి...కలియుగంబున నరునకు గంగ దిక్కు" అన్నారు. మన పాపాలన్నీ కడగడానికి ఆ తల్లి ఈ రూపంలో వచ్చింది. ఆ దివ్యనది విష్ణుపదం నుండి వచ్చింది. అలా వస్తూ వ్యోమకేశం అంటే శివుని జటాజూటం నుంచి దుమికి కదిలింది. అలా ఆనది మన కంటికి కనపడనటువంటి ఊర్ధ్వలోకాలనుంచి వచ్చిన నది.
గంగ ఎక్కడైనా పవిత్రమే కానీ కాశీదగ్గర ఉన్న గంగ అత్యంత పవిత్రం. ’విష్ణు విగ్రహ సంభూతా ద్రవరూపా సనాతనీ...అది సాక్షాత్తూ విష్ణు స్వరూపం, నీటి రూపం ధరించిన విష్ణు శక్తి’. గంగాజలంలో ప్రతిబిందువూ గోవిందుడే అని ఒక నానుడి ఉంది. శ్రీరామకృష్ణ పరమహంస "గంగాజలం సాక్షాత్తూ విష్ణువు" అన్నారు. గంగ నీరు కాదు, నిప్పు అన్నారు. పాపాలన్నిటినీ దగ్థం చేసే నిప్పు నీరు రూపంలో ఉన్నది. ’సుఖస్పర్శా స్నానపానే నిర్వాణపదదాయినీ’ - గంగాజల స్నానం చేసినా, గంగాజల పానం చేసినా నిర్వాణ పదం లభిస్తుంది. గంగాతీరంలోనారాయణుణ్ణి తలచుకొని ఆ నీటిని పానం చేస్తే రోగాలన్నీ పోతాయట. అదే "ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణోహరిః" అన్న మాటలోని ఆంతర్యం.
గంగానది గురించి శంకరభగవత్పాదులు....
దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరతరంగే!
శంకరమౌళి నివాసిని విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే!!
భాగీరథి సుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః!
నాహం జానే తవ మహిమానాం త్రాహి కృపామయి మామజ్ఞానమ్!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment