
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 2 February 2015
శని దోషం ఉన్నవారు
శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం నాడు నల్లటి వస్త్రం ధరించి, నల్లటి వత్తితో దీపారాధన చేయడం వలన ప్రాణం పోయేటంత ప్రారబ్ధం ఉంటే గోరుతో సరిపెడతాడు. లేదా అది కూడా లేకుండా చూస్తాడు. శనిదోషాలు తొలగిపోతాయి..
దీపారాధన అనంతరం ఈ స్తోత్రాన్ని పఠించాలి.
కోణం నీలాంజనప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం
ఛాయా మార్తాండ సంభూతం నమాస్యామి శనైశ్చరం
అయిన తరువాత శివాలయం లో ఐతే 3 ప్రదక్షిణలు, వైష్ణవ ఆలయంలో ఐతే నాలుగు ప్రదక్షిణాలు చేసి, శివాలయంలోకి వెళ్ళేటప్పుడు గడపకి నమస్కరించి లోపలి వెళ్ళాలి. గడపకి దండం పెట్టేటప్పుడు ముందుగ కుడిచేతితో ఎడమ చేతివైపు, ఎడమ చేతిని కుడిచేతి వైపు అంటే ''X'' ఆకారంలో పెట్టాలి. ఇంకా అర్థం కావాలంటే గురువులకి నమస్కరించే తప్పుడు మన కుడిచేతిని గురువు కుడికాలిని, ఎడమ చేతితో ఎడమ కాలిని తాకి నమస్కరించాలి.. ఇదే పద్దతిలో గడపకి నమస్కరించాలి.. ఇలా వెళ్లి దైవ దర్శనం చేసుకొని నామ జపం చేయడం వలన మీకు తప్పకుండ శుభం కలుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరతాయి. అంటే పనికిమాలినవి కాకుండా, మనసుకు నచ్చిన అడ్డమైన కోరికలు కోరకుండా కుటుంబం కోసం, సమాజం కోసం చేస్తే మంచి జరుగుతుంది. అదే ప్రపంచం కోసం చేస్తే వేయి రెట్లు ఫలితం లభిస్తుంది. నీకు ఎప్పుడు ఏమి అవసరమో అవి నువ్వు అడగకుండానే వచ్చి చేరతాయి.. ఇంకో విశేషం ఏంటంటే! శివాలయంలో శివుడికి పూలు సమర్పించిన తరువాత ఆ పుష్పం నంది మీద పెట్టాలి. అప్పుడే దర్శన ఫలం లబిస్తుంది. అలాగే వైష్ణవాలయంలో అయితే దేవుడికి సమర్పించిన పువ్వు మన శిరస్సు మీద మాత్రమే పెట్టుకోవాలి, తులసి అయితే పొరపాటున కూడా నెత్తిన పెట్టుకోకూడదు. పెట్టుకుంటే బ్రష్టుడైపోతాడు. కాబట్టి ఇవన్ని జాగ్రత్తగా పాటించండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment