గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 February 2015

వేదాంత ప్రతిపాద్యమైన పరతత్త్వమేదో అది శివమ్ అని మాండుక్యోపనిషత్ స్పష్టంగా చెప్తున్నది.

వేదాంత ప్రతిపాద్యమైన పరతత్త్వమేదో అది శివమ్ అని మాండుక్యోపనిషత్ స్పష్టంగా చెప్తున్నది. "అశబ్దం, అస్పర్శం" ఏది శబ్దాతీతమో, స్పర్శాతీతమో, దృశ్యాతీతమో అలాంటి వస్తువొకటి ఉన్నది. అది తురీయం. తురీయం అంటే త్రిగుణాలకి(సత్త్వరజస్తమో గుణములు) అతీతం. త్రి అవస్థలకీ అతీతం. తురీయం అనగా నాలుగవది. త్రిగుణాలతో మనం పొందే అవస్థలు మూడు(జాగృత్, స్వప్న, సుషుప్తులు). ఈ మూడు అవస్థలకీ అతీతమైనది తురీయావస్థ. అక్కడ చెప్పబడేది శివం. "చతుర్థం మన్యంతే శివమ్ అద్వైతం" అని మాండుక్యోపనిషత్తులో కనపడుతున్నది. కనుక పరవస్తు గీతం శివమ్. మూడింటికీ మూలమై, మూడింటికీ అతీతమైన వాడు శివుడు. "త్రిగుణాతీతశ్శివః". అందుకే పుష్పదంతుల వారు "నిస్త్రై గుణ్యై శివాయ నమో నమః" అన్నారు. సత్వరజస్తమో గుణాలను నియమించేవాడు ఆయన. సృష్టిస్థితిలయలు వాటితో చేస్తూ వాటికి అతీతంగా ఉంటాడు. అందుకే "బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః. ప్రబల తమసే తత్సంహారే హరాయ నమోనమః. జన సుఖక్రుతే సత్త్వోద్రేకే మ్రుదాయ నమోనమః. ప్రమహసిపదే నిశ్రైగున్యే శివాయ నమోనమః." త్రిగుణాతీతమైనది శివతత్త్వం. అది అత్యంత ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML