శ్రీ విష్ణు సహస్రనామము – అర్థము
శ్లోకము – 68
=================================
68. అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః ||
.
633. అర్చిష్మాన్ : ప్రకాశ స్వరూపుడు.
634. అర్చితః : అర్చింపబడువాడు.
635. కుంభః : సమస్త బ్రహ్మాండాన్నీ కుంభం (కుండ) వలే తనయందు నిలుపుకున్నవాడు.
636. విశుద్ధాత్మా : అత్యంత పవిత్రాత్ముడు.
637. విశోధనః : పాపాలను నశింపజేసి విశుద్ధులనుగా జేయువాడు.
638. అనిరుద్ధః : భగవంతుని చతుర్వ్యూహాలలో ఒకటి. లేదా శత్రువుల చేత నిరోధింపబడని వాడు.
639. అప్రతిరథః : తనను ఎదుర్కొనే శక్తిమంతుడైన ప్రతిపక్షం (విరోధిపక్షం) ఎవరూ లేనివాడు.
640. ప్రద్యుమ్నః : శ్రేష్ఠమైన సంపదలు గలవాడు.
641. అమితవిక్రమః : మహాపరాక్రమవంతుడు. లేదా ఎవ్వరూ అడ్డుకోలేని విక్రమవంతుడు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 10 February 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment