గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 February 2015

లయకారకుడైన మహాకాలుని వలన సర్వబంధాలు సమ్హారమై తిరోహితమై, కేవల లీనమైన " కైవల్యం" లభిస్తుంది.

లయకారకుడైన మహాకాలుని వలన సర్వబంధాలు సమ్హారమై తిరోహితమై, కేవల లీనమైన " కైవల్యం" లభిస్తుంది. మాసాంతానికి సంధ్యగా ఉండే బహుళ చతుర్దశి" మాస శివరాత్రిగా" సంవత్సరాంతానికి సంధిగా ఉండే " మాఘ బహుళ చతుర్దశి" మహా సశివరాత్రిగా" గ వ్యవహరింపబడుతున్నాయి.
కాలిఫోర్నియాకి చెందిన ఆర్నాల్డ్ లీబెర్ అనే శాస్త్రవెత్త " సౌరకళలు, చంద్రకళల ఆధారంగా జరిగే విశ్వ చలనంలో వాటి మార్పుల ప్రభావం, స్పందన ప్రతిప్రాణిపై, ప్రతి అణువుపై ఉంటుందని" అని తెలియచేసారు. ఆ కళల మార్పులనుగమనించి, వాటికి అనుగుణంగా తమ చైతన్యాన్ని పునీతం చేసుకుని, శివచైతన్యాన్ని ఆవిష్కరించుకునేందుకు తగినవిధంగా పర్వదినాలను ఏర్పరిచారు మన మహర్షులు.
యోగభూమిలో చైతన్యం స్పందించి, మన యోగసాధనలను విశ్వచైతన్యంలో అనుసంధానం చేసే ఒక మహాయొగ తరుణం - మహా శివరాత్రి. మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయం.
యోగసాధనకు ఇది సువర్ణావకాసం." లోకమ్ములు లోకేశులు ,లోకస్థులు తెగిన, తుదినల్లెకబగు పెంజీకటి. రాత్రికి ఆవల ఆవిష్కృతమయ్యే కాంతి పరమాత్మ మహాంధకారాన్ని ఛేదిస్తూ ఆవిష్కరించిన శాశ్వత జ్యోతి శివుడు.
సచ్చిదానందమయమైన శివజ్యోతిని సాక్షాత్కరించుకునేందుకు జాగారూకులై యోగసాధన చేసే మహా శివరాత్రి పర్వదినం నాడు - నిద్రమాని - అనగా తమోగుణాన్ని విడచి - ఎకగ్రంగా శివధ్యానమగ్నులై తరించడమే జీవన పరమార్ధం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML