రుద్రాధ్యాయము - రుద్రాభిషేక విశిష్టత :
ఆది పురుషుడు సకల సృష్టి, స్థితి, లయ కారుడు
సర్వేశ్వరుడు సకల విశ్వానికి మూలపురుషుడు దేవాదిదేవుడు సదాశివుడు పరమేశ్వరుడే
రుద్రుడు ....
"శం కరోతితి శంకరః"
అనగా సుఖములను కలిగించువాడని
భోళాశంకరుడు భక్త సులభుడు
శివుని లింగాకారమునే పూజించదరు
అట్టి శివుడు అభిషేక ప్రియుడు
శివుని అభిషేకించు విదానమే రుద్రము
ఇది "కృష్ణ యజేర్వేద సంహిత" 4వ అధ్యాయం 5 వ ప్రపాఠకంలో వివరించెను
అదియే రుద్రాధ్యాయము అందురు
శివునకు అభిషేకమే ప్రియమైనది,
రుద్ర అభిషేకం విలువైనది
న్యాస పూర్వక శత రుద్రం అత్యంత విలువైనది
"రుద్రం ద్రావయతీతి రుద్రః"
మన ఐహికాముష్మిక బంధుముల వల్ల కలుగు దుఃఖ శోకములను పోగొట్టునది "రుద్రము"
అనంతమైన దేవతలను (రుద్ర రూపం) అది దేవతలుగా కలిగివున్నది కనుక రల"రుద్రము"
"యశ్శత రుద్రీ మధీతే సో అగ్నిపూతో భవతి"
ఎవరైతే శత రుద్రమును పఠించుదురో వారు "అగ్ని పూతులు" అగుదురు
అనగా బంగారమును కాల్చి శుద్ధి చేసినట్లు సమస్త పాపముల నుండి విముక్తులై అగ్ని వంటి తేజస్సు పవిత్రత పొందుదురు
"సర్వేషు గ్రహదోషేషు దుస్వప్నాద్భుత దర్శనే
జపాన్ రుద్రాన్ సకృద్విపః సర్వదోషై ప్రముచ్యతే"
ధర్మవిరోదులై కృతకత్యములను ఆచరింపకపోవుట
తనకు విహితములైన బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థ, ఆశ్రమ ధర్మముల నతిక్రమించి మహా పాపములను చేసినవారు
తెలిసి తెలియక రహస్యముగా స్వర్ణస్తేయ సురాపాన గుర్వంగణ గమన బ్రహ్మ హత్యాది మహా మహా పాతకాదులు
గురువాక్షేపణ వేద శాస్త్ర విమర్శ, నిషిద్ధ పదార్థ బోజనం, పరస్త్రీ సాంగత్యం, అభద్ధ సాక్షము, రత్న ఆభరణ ధాన్య వస్తు, స్త్రీ, శిశు, ఇత్యాదీ అపహరణ,
ఇత్యాది మహా మహా పాతక నివారణ రుద్రాధ్యాయ పారయనమే...
"రొగవాన్ పాపవాన్యస్తు రుద్రంజప్త్వా జితేంద్రియః
రోహాత్పాపాత్ర్పముక్తోసావతులం సుఖమశ్నతే"
గ్రహ చారము బాగుండకపోయిన, దుస్వప్నాది దోషములు కలిగిన, వివిద ఉత్పాతములు జరిగిన,
వివిధ ఉపద్రవ, శారీరక రుగ్మతలు కలిగినా పాపకర్మలచే ఇతరుల వల్ల అభిచారికాది ప్రయోగములు జరిగినా,
సమస్త దుఃఖ నివారణకై,
విద్య యందు ఆటంకము జరిగిన ఉన్నత విధ్యాధికారము పొందుట కొరకు,
ఉన్నత ఉద్యోగం పొందుట కొరకు,
వివాహ సంబంద దోషములకు,
సంతానం ప్రతి బంధకములు కలిగిన
(పిల్లలు కలగకపోయినా)
సమస్త ఆరోగ్య సమస్యలకు,
ఆయుఃవృద్ధి కొరకును
"అనపత్యాధి దోశేషు శాకిన్యాది గ్రహేషుచ
సర్వజ్వర వినాశాయ రుద్రజపో వినిశ్చితః"
వివిద శాకిని ఢాకిన్యాధి గ్రహ దోష నివారణకును
సమస్త విష జ్వర నివారణకును సమస్త దేహా పీడలకును
శ్రీ రుద్రా ధ్యాయమే నివారణ మార్గమైయున్నది
"ప్రథమో దైవ్యోభిషక్"
వైద్యుల కంటెను దేవ వైద్యులకంటెను దేవాది దేవుడు పరమేశ్వరుడు ప్రథమ వైద్యుడు
దయార్థ హృదయుడు శివుడు
పిలిచినంతనే పలికే దేవోత్తముడు
ఆ స్వామిని ఉపాసించిన సకల అభీష్టములు నిశ్చయముగా పొందగలరు
"వేదేషు శతరుద్రీయం, దేవేషుచ మహేశ్వరః
స్కాంద స్సర్వ పురాణేషు, సర్వ స్మృతిషు మానవం"
అనగా చతుర్వేదములలో రుద్రాధ్యాయమును కలిగి ఉన్న యజుర్వేద తైత్తిరీయ సంహిత శ్రేష్టమైనది
దేవతలలో దేవదేవుడు ఆ మహా దెవుడు "శివుడు"
పురాణములలో "స్కాంద" పురాణం
స్మృతుల్లో అనేక ధర్మములను వైదిక వాజ్మయములకు శిరోభూషనమైనది "మనుస్మృతి"
శ్రేష్టములైనవి అని తెలియుచున్నవి
"సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయ"
అన్ని ఉపనిషత్తుల సారమే రుద్రోపనిషత్తు
రుద్రాధ్యాయ పారాయణం మనషిని ఎల్లవేలలా రక్షించును సంసారమనే సాగరాన్ని తరింపగల్గును
సర్వ పాపముల నుండి విముక్తి కలుగును
ఇట్టి మానవుడికి దుర్లభమని ఎమివుండబోదు
"ఏతైర్హవా అమృతోభవతి" శత రుద్రియముచే అమృతత్వం కలుగును
అగ్ని వలనే పవిత్రుడగును, శివానుగ్రహమున ఇష్టకామ్యములు పొందును, జ్ణానోత్పత్తి పొందుదురు
"బ్రహ్మలోకే విదీయతే"
నిత్య పారాయణము చేయువారు తప్పక బ్రహ్మలోక(శివ సాయుజ్యం) మొందుదురు
దేవాది దేవుడైన శివుని
మార్కండేయుడు, రావణాసురుడు, రాముడు, కృష్ణుడు,
సకల దేవతలు రాక్షసులు సకల ఋషి గణాలు మానవులు రుద్రాధ్యాయ పారయణ అభిషేకాదులు నిర్వహించి పరమేశ్వరుని అనుగ్రహం పొందినవారైరి
శ్రీ కృష్ణుడు సంవత్సరకాలము భస్మోధ్ధూళిత సర్వాంగుడై రుద్రాధ్యాయ పారయణము చేసేనని కూర్మపురణమందలి వాక్యాణము
శ్రీ రాముడే బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోటాని శివలింగ ప్రతిష్ఠాపన చేసెను
కనుక
అంతటి మహత్తర "రుద్రాధ్యాయ" పారాయణ అభిషేక,జప,హోమ, తర్పణాదులను ఆచరించి తరించి ఇష్ట కామ్యములను పొందగలరని కొరుతున్నాను...
(దీనికి అనుసంధానంగా మహన్యాస పుర్వక రుద్రాభిషేక విధానం తెలిపెదను)

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment