గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 February 2015

బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం అంతా విష్ణుమాయ.బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం అంతా విష్ణుమాయ. విష్ణుమాయ చేత కప్పబడ్డాడు కనుక బ్రహ్మకు ఏమి గుర్తు రావడం లేదు. ఇద్దరు యుద్ధంలో మునిగియున్న సమయంలో కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో, పెళపెళ శబ్దం చేసుకుంటూ విద్యుత్ స్థభం/మహాతేజో లింగం ఒకటి ప్రత్యక్షమైంది. దానికి ఆది, అంతాలు లేవు. అది అలా వేగంగా పెరుగుపోతూనే ఉంది. అది వ్యక్తావ్యక్తస్వరూపం. సమస్త విశ్వానికి మూలమైనది. విష్ణువు వేసిన మహేశ్వరాస్త్రమూ, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రమూ ఆ మహాకాంతి స్థంభంలో కలిసిపోయాయి.

ఆ లింగాన్ని చూసిన విష్ణువు మోహితుడయ్యాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ లింగం నుండి 'మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు' అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో 'ఈ యుద్ధం ఇక్కడితో చాలిద్దాం. ఇప్పుడు మనమిద్దరం కాకుండా మూడవ శక్తి ఇక్కడ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను' అన్నాడు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు.


‪#‎విష్ణువు‬ కొన్ని కోట్ల సంవత్సరాల పాటు పయనించినా, ఆ లింగం యొక్క ప్రారంభ స్థానం కనుగినలేకపోయాడు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్య కాదని శ్రీ మన్నారాయణుడు, యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాడు.

బ్రహ్మదేవుడు ఎంతో కాలం పైకి ప్రయాణించినా, ఆ లింగం చివరి భాగం అంతుబట్టడం లేదు. అది ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో ‪#‎బ్రహ్మకు‬ అర్ధం కావడంలేదు. తన అధిపత్యాన్ని నిరూపించుకోవాలని, విష్ణువుకంటే తనకే అధిక గౌరవం దక్కాలని బ్రహ్మ భావించాడు.

ఇంతలో పై నుంచి కేతకీ పుష్పం క్రిందకు వస్తోంది. ఆ పుష్పాన్ని ఆపి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. నేను ఈ మహాలింగాన్ని అర్చించి క్రిందకు వస్తున్నా అంటుంది, అయితే నీకు దీని అగ్రభాగం తెలుసా? నువ్వు చూశావా? అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. చూశానండీ! కానీ ఈ లింగం పెరిగిపోతూనే ఉన్నది. నేను దీని అగ్రభాగాన్ని తాకి, కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి క్రిందకు పడుతూనే ఉన్నాను. ఈ లింగం చాలా పెద్దది. ఇది ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీని అగ్రభాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటుంది కేతకీ పుష్పం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML