
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 13 February 2015
సంపదలు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఎందరివల్ల భయం వస్తుందంటే
సంపదలు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఎందరివల్ల భయం వస్తుందంటే
రాజతః చోరతః శత్రోః స్వజనాత్ పశుపక్షితః!
అర్థిభ్యః కాలతః అనీహః పరితుష్టాత్మా!!
రాజతః – ప్రభుత్వ భయం ముందుంటుంది. ఎప్పుడు riding జరుగుతుందో తెలియదు.
రెండవది చోరతః – దొంగల వల్ల భయం ఉంటుంది.
శత్రోః – వాళ్ళు ఉంటారండీ భలే కాచుకు కూర్చుంటారు.
స్వజనాత్ – తనవాళ్ళ వల్లే ప్రమాదము. ఇది లోకంలో అందరికీ ఉన్న అనుభవమే. పురాణాలు తిరగేయక్కరలేదు.
పశుపక్షితః – వాటివల్ల కూడా ప్రమాదమే. నువ్వు చక్కగా పంట అనే సంపద దాచుకుంటే అవి మింగేయడానికి అవి వస్తూ ఉంటాయి.
అర్థిభ్యః – అడుక్కునే వాళ్ళు వచ్చి దోచుకుంటారు. కాస్త ఉంటే చాలు గుమ్మం దగ్గర వచ్చి నిలబడతాడు ఒక్కొక్కడు.
కాలతః – ఇంకో పెద్ద దొంగ కాలమండీ. ఇవాళ ఉంది అని ధైర్యంగా ఉండడానికి లేదు.
సిరితా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
వచ్చినప్పుడు కొబ్బరికాయలో నీరు ఎలావచ్చిందో తెలియకుండా వచ్చినట్లుగా వస్తుందిట. పోయినప్పుడు
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ! అన్నారు కదా సుమతీకారుడు. అందుకు సుఖం ఎవడికయ్యా అంటే కోరిక లేని వాడికి సుఖము.
అనీహః పరితుష్టాత్మా – కోరిక లేని వాడు మాత్రమే పరితుష్టుడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment