ఒక యువకుడు మానేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళాడు
అతడి మార్కులు అన్నీ చూసిన డైరెక్టర్ అతడిని అడిగిన మొదటి ప్రశ్న
నీకు స్కాలర్షిప్ వచ్చిందా ?
లేదండి .
నీ చదువుకు డబ్బు ఎలా వచ్చింది?
నా " తల్లి తండ్రులు " పెట్టారు .
ఏమిచేస్తారు ?
బట్టలు ఉతుకుతారు .
" నువ్వూ ఉతుకుతావా"
"ఎప్పుడూ ఉతకలేదండి . నువ్వు చదువుకో చాలు అన్నారండి "
"నీ చేతులు చూపించు ".
సున్నితంగా ఉన్న ఆ చేతులను చూసి " నీ తల్లి తండ్రుల చేతులు చూశావా ?"
లేదండి
ఈ రోజు చూసి వాళ్ళ చేతులను శుభ్రంగా కడిగి రేపు రా .
..
యువకుడు ఇంటికి వెళ్ళాడు
భోజనాలు అయ్యాక అమ్మా నాన్నల చేతులు చూశాడు తానే కడుగుతా అన్నాడు
వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యం ఆనందం అయోమయం అన్నీ కలగలిపిన ఒక భావం
. తెల్లగా గుంటలు పడి, చర్మం దళసరిగా ఉంది . కడుగుతూ ఉంటె మండింది . బాధను ఒర్చుకున్తున్నారు
అతడి కళ్ళ నుండి కన్నీటి చుక్కలు వాళ్ళ చేతుల మీద పడుతున్నాయి .
' ఈ చేతులే నాకు ఇంత అన్నం పెడుతున్నాయి నన్ను ఈ స్థితికి తెచ్చాయి .'
ఆ రాత్రి మిగిలిన బట్టలు తానే ఉతికాడు.
మర్నాడు వెళ్ళాడు
.
. డైరెక్టర్ అతడి ముఖాన్ని గమనించాడు . ఎర్రబడిన కళ్ళు రాత్రి అతడు నిద్రపోలేదనీ , ఏడుస్తూనే ఉన్నాడనీ తెలిసిపోతోంది
ఏమి గమనించావు ?
" నేను ఈ స్థితికి ఈ రోజు వచ్చాను అంటే నా తల్లి తండ్రులు ఎన్ని శ్రమలకు ఓర్చారో అన్న విషయం తెలుసుకున్నాను . నా ప్రయోజకత్వానికి కారణం వారు అని తెలుసుకున్నాను . ఒక కుటుంబం లో ఇతరులకు సహాయ పడటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను . కుటుంబం అంటే ఏమిటో తెలుసుకున్నాను "
డైరెక్టర్ " ఇదీ నేను నా మేనేజర్ లో కావాలనుకున్నది . ఇతరుల సహాయం ఎంత అవుసరమో గుర్తించినవాడు , ఒక విజయం వెనుక ఎటువంటి త్యాగాలు ఉన్నాయో గుర్తించ గలిగినవాడు , డబ్బు మాత్రమె జీవిత లక్ష్యం కాదు అనుకునేవాడు మాకు కావాలి "
.
యు ఆర్ సెలెక్టెడ్

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 17 February 2015
ఒక యువకుడు మానేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళాడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment