ఏ దైవం సదా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడో
సర్వ కాల సర్వావస్థలయందు జ్ఞాన స్వరూపంగా ఉంటాడో
సదా ఆనంద సాగరమై ఉంటాడో
సదా మాయకు అతీతంగా ఉంటాడో
రెండవ వస్తువు లేకుండా ఏకాకిగా ద్వితీయంగా ఉంటాడో
ఆ దైవాన్ని సత్య స్వరూపుడని అంటారు. మరి ఈ లక్షణములున్న దైవం ఎవరు? అని ప్రశ్నిస్తే శివుడని జ్ఞానవంతులు, సర్వశాస్త్ర పారంగతులు చెప్పక తప్పదు. శివుడే సత్యము. శివుడికి భిన్నమైనదంతా అసత్యం. అందుకే జగద్గురువైన ఆదిశంకరులు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని అన్నారు. అందుకే శంకరోపనిషత్
"యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్టితః తస్య ప్రకృతి లీనస్య యః"
వేదాలకు ముందున్న దైవం, వేదాలలో ప్రతిష్టితుడైన దైవం, సర్వం లయమైన తరువాత నిలిచివున్న దైవం శివుడు మాత్రమేయని తెలిపినది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 13 February 2015
సర్వం లయమైన తరువాత నిలిచివున్న దైవం శివుడు మాత్రమేయని తెలిపినది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment