శక్తి ఒక్కరే. ఆమె జగన్మాత. ఆ జగన్మాతను ఏపేరుతొ పిలిచినా పలుకుతుంది. ముగురమ్మలూ ఆ తల్లే. అనంత రూపాలతో భాసిస్తున్న జగదంబ ఒక్కతే.
'అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం' అని వేదం ఆ ఆద్యాశక్తిని కీర్తించింది. పుట్టుకలేని, ఏక స్వరూపిణి - రజోగుణ, సత్త్వగుణ, తమో గుణాలను నియమిస్తూ మూడు వర్ణాల రూపంతో కనిపించింది. అమ్మ రూపాలలో ఏ రూపాన్ని ప్రీతిగా ఆరాధిస్తే, ఆ రూపమే అన్ని రూపాల మూలరూపంగా భావించాలి.
లక్ష్మీ ఆరాధకులకు లక్ష్మియే ముగురమ్మల మూలపుటమ్మ. అలాగే సరస్వతీ ఆరాధకులకు ఆ దేవియే సర్వ స్వరూపిణి. అలా అభీష్టం మేరకు ఏ రూపాన్ని ఆరాధించినా ఆ రూపంగా కనబడే ఒకే జగజ్జనని ముగురమ్మలుగా ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులతో అనుగ్రహిస్తుంది. సరస్వతీ ప్రాధాన్యం శృతి స్మృతులలో, మంత్రశాస్త్రంలో పుష్కలంగా ఉంది. ఋగ్వేదం సరస్వతీ సూక్తాలను బహుళంగా అందించింది. మంత్రశాస్త్రం శుక్ల సరస్వతీ, నీల సరస్వతీ, వాగ్వాదినీ, నకులీ సరస్వతీ వంటి అనేక శారదా మూర్తులను అందించింది.
దేవీ మహాత్మ్యం - బ్రహ్మ జ్ఞాన స్వరూపగా, సర్వాభీష్ట ప్రదాయినిగా, మూడు శక్తులలో పరాకాష్టగా వర్ణించింది. శుంభనిశుంభులను సంహరించిన శక్తియే మహాసరస్వతి.
నవరాత్రులలో మహాసరస్వతి ఆది. అలాగే లక్ష్మీ, కాళీలకు కూడా ఒక్కొక్క రోజు ఉన్నాయి. కానీ మొత్తంగా ఆరాధింపబడే శక్తి ఒక్కటే. నవరాత్రులూ మనకిష్టమైన అమ్మరూపాన్ని ఆరాధిస్తున్నా ఆ తల్లి "మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ స్వరూపిణీ" అని భావించి ఆరాధించాలని శాస్త్రం.
అసలు ముఖ్యమైన నవరాత్రుల పేరే 'శారదా నవరాత్రులు'. జ్ఞానమే గొప్ప సిద్ధి. ఆ సిద్ధినిచ్చే గొప్ప శక్తి సరస్వతి. ఆ తల్లి కృప లేకపోతె చదువు మాత్రమే కాదు, సంపదలు కూడా లభించవు. సంపదను, ఆహారాన్ని ఆర్జిన్చాలనే బుద్ధి, ఆర్జించే విజ్ఞానం, వినియోగించే తెలివి ఇవన్నీ సరస్వతి ఇవ్వవలసిందే.
ఋగ్వేదం ఈ తల్లిని 'అన్న ప్రదాయిని'గా కీర్తించింది. ప్రాణశక్తిగా అభివర్ణించింది. ఇంత ప్రాధాన్యమున్న దేవి సరస్వతి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment