ఈ రోజు ప్రపంచ అగ్నిహోత్ర దినము !
ప్రపంచము అంతా భౌతిక కాలుష్యమును అరికట్టడానికి పరిష్కారము వెతుకుతుంది. కానీ మన యజుర్వేద సంహిత (11:7:9) మరియు శతపథ బ్రాహ్మణ(12:4:1)లో కాలుష్యాన్ని తగ్గించే మరియు వాతావరణాన్ని శుద్ధి చేయుటకు అగ్ని హోమమును కనుగొన్నారు. ఈ అగ్ని హోత్రము ప్రజల ఒత్తిడిని తగ్గించి, బుద్ధి క్షమతను, శక్తిని , ఆరోగ్యమును పెంచుతుంది. మనస్సు కూడా ప్రశాంతము అవుతుంది. మద్య పానమును మానేయాలని అనుకొనే వారికి ఇది ఒక్క మంచి ఔషధముగా ఉపయోగ పడుతుంది. నీటి వనరులు శుభ్రపర్చడానికి ఉపయోగించవచ్చు. ఇది అణుధార్మికత దుష్పరిణామాలను కూడా తగ్గిస్తుంది. హానికరమైన రేడియేషన్ మరియు వ్యాధికారక బ్యాక్టీరియాలను స్తంభింపజేస్తుంది. అగ్ని హోమము చేయుట వలన వాతావరణములో రజ-తమ ప్రమాణము తగ్గి సాత్త్విక ప్రమాణము పెరుగుతుంది.
No comments:
Post a Comment