ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 2 February 2015

సమాహిత చిత్తుడవై కర్మ చేయుము.

నాలుగు విధములైన పుణ్యాత్ములగు పురుషులు నన్ను భజింతురు. ఆ నలుగురు భక్తులలో ముందువారి కంటే తరువాత వారు శ్రేష్ఠులు. వారిలో మొదటివారు ఆర్తులు, రెండవ వారు జిజ్ఞాసువులు, మూడవవారు అర్థము నర్థించువారు, నాలుగవ శ్రేణికి చెందినవారు జ్ఞానులు. మొదటి మూడు తరగతులకు చెందినా వారు సామాన్య శ్రేణికి చెందిన భక్తులు. కానీ నాలుగవ శ్రేణికి చెందినవారు విశేష మహాత్మ్యమును కలిగిన వారు. ఆ భక్తులందరిలో నాలుగవ వారైన జ్ఞానులే నాకు మిక్కిలి ప్రియమైన వారు. వారు ణా రూపముగనే అంగీకరింపబడుదురు. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకేవ్వరును లేరు. ఇది సత్యము సత్యము. నేను ఆత్మజ్ఞుడను. వేదవేదాంతములందు పారంగతులైన వారు, విద్వాంసులు, జ్ఞానము ద్వారా నన్ను తెలుసుకొనగలరు. మంద బుద్ధులైన వారు జ్ఞానము లేకుండా నన్ను పొందుటకు ప్రయత్నించెదరు. కర్మాధీనులైన మూఢ మానవులు నన్ను వేదముల, యజ్ఞముల, దానముల, తపస్సు ద్వారా కూడా ఎప్పుడును నన్ను పొందలేరు. కనుక బుద్ధి ద్వారా పరమేశ్వరుడనగు నన్ను తెలుసుకొని జ్ఞానము నాశ్రయింపుము. సమాహిత చిత్తుడవై కర్మ చేయుము.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML