గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 February 2015

శ్రీ ఆంజనేయ మహత్మ్యం -6శ్రీ ఆంజనేయ మహత్మ్యం -6

లంకకు చేరిన నీలుడు కొంత కాలం తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు .తనలో తాను ఇలా వితర్కించు కొన్నాడు ”రాజు పని వున్నా లేక పోయిన రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయ పెట్టాలి .శత్రు మర్దనుడు అనే బిరుదుపొందాలి .ఇలా చేయక పొతే ,శత్రువులకు తేలికై పోతాడు .మా జాతికి శత్రువు స్వర్గ లోకాది పతి ఇంద్రుడే.అతని వద్ద నుండి చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు నేను గ్రహించటం రాజ ధర్మం .నెమ్మదిగా నయం తో సాధించ టానికి ప్రయత్నిస్తా .ఇవ్వ క పొతే యుద్ధం చేసి అయినా వాటిని దక్కించు కుంటాను .ఒక దూతను రాయ బారి గా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదని తోస్తోంది .అతని వల్ల సమా చారం తెలుసు కోని ,అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలో చిస్తా”అని దీర్ఘా లోచన చేశాడు .సమర్ధుడైన దూతను పిల్చాడు .అతని తో తన మనసు లోని మాట ఇలా తెలియ జేశాడు .”నా రాయ బారి గా ఇంద్ర లోకం వెళ్లి ,నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు .ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని ,మనకు కావాల్సిన చింతామణి వగైరా లను మర్యాద గా అప్ప గించి ,సంతోషం కలుగ జేయ మని చెప్పు .లేక పొతే యుద్ధానికి సిద్ధం గా ఉండ మని తెలియ జేయి ”అని వివరం గా చెప్పి పంపాడు దూతను .దూత ,నీలుడి మాటలను మననం చేసు కొంటు, స్వర్గ లోకం చేరాడు .అక్కడ దేవ సభ లో మహేన్ద్రుని సభకు చేరాడు ..ఇంద్రుడు, భార్య అయిన శచీదేవి తో సింహాసనం పై అధివసించి వున్నాడు .దేవగురు బృహస్పతి ,దేవ లోక మహర్షులు అందరు ఉచిత ఆసనాలపై ఉపవిస్టు లైనారు .అప్సరసలు నృత్యాలు చేస్తుంటే గంధర్వులు కమ్మ గా గానం చేస్తున్నారు .రాక్షస రాజ కుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి ,మహేన్ద్రునికి నమస్కరించాడు .ఆయనా మర్యాద పూర్వ కం గా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు .దూత నీలుడు చెప్పమన్న మాటలను ”సురాదిపా దేవేంద్రా !నేను లంకా రాజ్య పరి పాలకుడు విభీషణ మహా రాజు గారి సేవకుడిని .ఆయన కుమారుడు ,యువ రాజు నీలుని దూతను .శ్రీ మంతుడు ,సర్వ శస్త్రాస్త్ర సంపన్నుడు ,ధర్మాత్ముడు ,భగవద్ భక్తుడు అయిన నీల మహా రాజు మీకు ఒక సందేశాన్ని ,నా ద్వారా పంపించారు .సావదానం గా విని ప్రత్యుత్తరం ఇవ్వ వలసినది గా కోరు తున్నాను ”అని చెప్పి ,నీలుడు చెప్పి పంపిన విష యాలనన్నిటినీ ఏకరువు పెట్టాడు .

అన్నీ విన్న సహస్రాక్షుడు కోపోద్రేకం తో ”నీలుడు అంతటి వాడు అయ్యాడా ?మా వజ్రాయుధం సంగతి మరిచాడా ?మహా బల సంపన్ను లైన పాకాసుర ,జమ్బాసురాది రాక్ష సుల కన్నా పోటు గాడా ?అతని పరాక్రమం ఏమిటో చూద్దాం .అతను అడిగిన వేవీ ఇవ్వం అని చెప్పు” ‘అని చెప్పి దూతను చంప రాదు కనుక ,శిఖ ను కత్తిరింప జేసి ,బయటికి వెడల గొట్టాడు ఇంద్రుడు .ఇంతలో సభలో అశుభ శకునాలు కని పించాయి ,విని పించాయి .ఏదో ప్రమాదం జరుగ బోతోంది అనే నేసూచన గమనించాడు ఇంద్రుడు .సభ చాలించి ,అంతః పురం చేరాడు .

ఇంద్ర సభ లో జరిగిన పరాభవాన్ని మూట గట్టు కోని ,దూత నీలుని చేరి విషయం అంతా వివ రించి చెప్పాడు .నీలుడు దూత కు జరిగిన పరాభవం తనకే జరిగి నట్లు గా భావించాడు .తండ్రి విభీషణుని తో మంత్రా లోచన చేశాడు .సైన్యాన్ని సమ కూర్చుకొని స్వర్గాన్ని ముట్ట డించ టానికి సన్నద్ధు డై బయల్దేరాడు .కొద్ది కాలమ్ లోనే స్వర్గం చేరి దేవ సైన్యం తో యుద్ధం ప్రకటించాడు .ఇంద్రుడు కూడా సమయా సమయాలు తెలీకుండా ,అహంకార బల గర్వితుడై ,మద మత్స రాలతో ఊగి పోతూ పోరు కు తల పడ్డాడు .భయంకర యుద్ధం సాగింది .ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడి పై ప్రయోగించాడు .నీలుడు దాన్ని చేదించి నిర్వీర్యం చేశాడు .పరాభవం తో రగిలిన దేవేంద్రుడు నీలుడి తో ద్వంద్వ యద్ధానికి దిగాడు .ఇంద్ర నీలు లిద్దరూ బాహా బాహి ముస్టా ముష్టి యుద్ధం చేశారు .కుప్పించి తన్ను కొన్నారు ,కాళ్ళ తో కొట్టు కొంటున్నారు .యెగిరి మాటి మాటికీ బాదు కొన్నారు .క్రమం గా ఇంద్ర బలం క్షీణించి ,రాక్షసుడు అయిన నీలుని బలంపెరిగింది . .ఇంద్రుడు కుస్తీ పోటీలో పీటీ దెబ్బ తిని నేల మీద కూలి పోయాడు .నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదు నైనఖడ్గం ఇంద్రుని గుండెలు చీల్చ టానికి పైకి ఎత్తాడు .ఈ ఘోరం చూడ లేక అందరు భయ కంపితు లైనారు .అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై నీలున్ని ఆపు చేశాడు .ఇద్దరికీ సంధి చేయ టానికి తాను వచ్చానని బ్రహ్మ వారిద్దరికీ చెప్పాడు .నీలుడు ఇంద్రుని గుండెల మీద నుంచి లేచాడు .ఇంద్రుడు నీలుడు ఇద్దరు బ్రహ్మ దేవునికి నమస్క రించారు .భక్తీ తో కీర్తించారు .నీలుడు చేసిన బ్రహ్మ స్తవానికి నాలుగు ముఖాల బ్రహ్మ సంతోషించాడు .దేవేంద్రునితో బ్రహ్మ ”పాక శాసనా !నీకు బుద్ధి ఇంకా రాలేదా ?ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాది పత్యం ,విభీషణుడి రాజాదికారం అంతా శ్రీ రాముడి దయ చేతనే ననే సంగతి మార్చి పోయావా?నీలుడు కోరిన కోరికలు అతి సాధారణ మైనవే .వాటిని మన్నించి ,అతనికి వాటిని ఇచ్చి వేస్తె మంచిది ”అని చెప్పాడు .

బ్రహ్మ ఇంద్రునికి హితోప దేశం చేస్తూ ”నీలుడు హనుమ భక్తుడు .హనుమద్దాసులకు అప జయం లోకంలోవుండదు .చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు లను ఈనీలునికి సమర్పించించు .అతని క్షమాపణ కోరి సుఖం గా వుండు .”అని బోధించాడు .బ్రహ్మ వాక్కు లకు సిగ్గు పడి నీలున్న్ని క్షమాపణ కోరి నీలునికి చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువులను ఒసగి ,సభక్తికంగా నిలబడ్డాడు .అప్పుడు బ్రహ్మ నీలుని చూసి ”శ్రీ మంతా నీలా !నువ్వు మాకు ఇష్టుడ వైన భక్తుడవు .నా సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వా లను కొంటున్నాను.స్వీకరించు .నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి ”నీలా చలం ”అని నీ పేర పిలువ బడుతుంది .దీన్నే ”పురుషోత్తమ క్షేత్రం ”అనీ పిలుస్తారు .నీకు ”వనసుందరి ”అనే దేవతా స్త్రీ ని ఇస్తున్నాను .ఆమెను వివాహం చేసు కోని ,సర్వ సుఖాలు అనుభవించు .కాలాంతరం లో నువ్వే ఇక్కడ ”నీలా చలేశ్వరుడు ”అనే పేరు మీద ఈ నీలా చలం లో వెలసి భక్తుల కర్కె లను తీరుస్తావు .”అని చెప్పి వన సుందరిని ఇచ్చి యుద్ధం , చని పోయిన వారందరినీ బ్రతికించిబ్రహ్మ లోకం చేరాడు బ్రహ్మ .ఇంద్ర ,నీలాదులు పరమ సంతోషం పొందారు .ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభం అయిందో ,అంత త్వరగా సమసి పోవటం ఉభయులకు ఆనంద దాయకం అయింది . .కాలం ఎంతటి వారినైనా కలుపు తుంది విడదీస్తుంది .కాల మహిమ ఎవరు తెలుసు కో లేరు .ఈ కధలను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నాడని మనం ముందే తెలుసు కొన్నాం కదా .నీలుడి కధ సమాప్తం. మరో కధ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను .
(సశేషం)

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML