పరీక్షిత్ మహారాజు క్రీ.పూ.3041 లో మరణించగా, ఆయన కుమారుడు జనమేజయుడు సింహాసనాన్ని అధిష్టించాడు. # జనమేజయ మహారాజు పరిపాలనలో
29 వ సంవత్సరంలో అంటే క్రీ.పూ.3013-3012 లో, అనగా కలియుగం మొదలై 89 ఏళ్ళు గడిచిన తర్వాత ప్లవంగ నామ
సంవత్సరం, సోమవారం, చైత్ర అమావాస్య నాడు రెండు గ్రామాలను దానం చేశారు, రెండు దానశాసనాలు వేయించారు. ఇది ఐహోల్ దగ్గర ఉన్నది. మొదటి
శాసనం Indian Antiquary లో 333,334 పేజీలలో ప్రచురితమైంది.జయాభ్యుదయ యుధిష్ఠర శకం 89
అనగా, కలియుగం 89 వ సంవత్సరంలో (క్రీ.పూ.3012) లో శ్రీ సీతారామస్వామి పూజాదికాల కోసం భూమి దానం చేసినట్టుగా
స్పష్టం అవుతోంది.
రెండవ # శాసనం ఈ రోజు వరకు హిమాలయాల దగ్గర కేదార క్షేత్రంలో రక్షించబడుతూ వస్తోంది. అది రాగిరేకుల మీద వేయించబడ్డ శాసనం. కేదారనాధ
స్వామి పూజాదికాల కోసం జనమేజయుడు కొంత భూమి దానం చేశాడనేది దాని సారాంశం.
మూడవశాసనం దార్వడ్ జిల్లాలో ఐబల్లి అనే గ్రామంలో శివాలయం గోడలపై పులికేశి - 2 రాజు వేయించిన శాసనం.
నాల్గవ శాసనం గుజరాత్‌ను పరిపాలించిన # సుధన్వ మహారాజుకు చెదిన తామ్రశాసనం. యుదిష్ఠర శకం 2663 లో ఆదిశంకరులకు గుర్తుగా రాగి
రేకులపై శాసనం రాయించి ఇచ్చినట్టుగా ఇది తెలియజేస్తోంది. ఇది ఆదిశంకరుల కాలాన్ని కూడా ఋజువు చేయటానికి ఒక సాక్ష్యం. ఆదిశంకరులు యుధిష్టర
శకం 2663 ప్రాంతంలో నివసించారు. యుదిష్ఠరశకం క్రీ.పూ.3138 లో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మొదలైంది. అక్కడి నుంచి
2662 సంవత్సరాలు కూడితే, ఆదిశంకరులు క్రీ.పూ.476-77 నుంచి 509 వరకు జీవించారని ఋజువు అవుతోంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment