గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 11 February 2015

విష్ణువు వేయి నామములు 410-1000

విష్ణువు వేయి నామములు 410-1000
410) పృథు: - ప్రపంచరూపమున
విస్తరించినవాడు.
411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని
పుట్టుకకు కారణమైనవాడు.
412) శత్రుఘ్న: -
శత్రువులను సంహరించువాడు.
413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
414) వాయు: - వాయురూపమున యుండి
సకలమును పోషించువాడు.
415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి
ఎన్నడును జాఱనివాడు.
416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై
భాసించువాడు.
417) సుదర్శన: -
భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.
418) కాల: - శతృవులను మృత్యురూపమున
త్రోయువాడు.
419) పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే
ప్రకాశించువాడు.
420) పరిగ్రహ: - గ్రహించువాడు.
421) ఉగ్ర: - ఉగ్రరూపధారి
422) సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.
423) దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో
నిర్వర్తించువాడు.
424) విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి
స్థానము అయినవాడు.
425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా
ఇచ్చినవాడు.
426) విస్తార: - సమస్త లోకములు తనయందే
విస్తరించి ఉన్నవాడు.
427) స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.
428) ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.
429) బీజమవ్యయం - క్షయము కాని బీజము.
430) అర్థ: - అందరిచే కోరబడినవాడు.
431) అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.
432) మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే
ఆవరించినవాడు.
433) మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.
434) మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.
435) అనిర్విణ్ణ: - వేదన లేనివాడు.
436) స్థవిష్ఠ: - విరాడ్రూపమై భాసించువాడు.
437) అభూ: - పుట్టుక లేనివాడు.
438) ధర్మయూప: - ధర్మము లన్నియు తనయందే
ఉన్నవాడు.
439) మహామఖ: - యజ్ఞస్వరూపుడు.
440) నక్షత్రనేమి: - జ్యోతిష
చక్రమును ప్రవర్తింపచేయువాడు.
441) నక్షత్రీ - చంద్ర రూపమున భాసించువాడు.
442) క్షమ: - సహనశీలుడు.
443) క్షామ: - సర్వము నశించినను తాను క్షయ
మెరుగక మిగిలియుండువాడు.
444) సమీహన: - సర్వ భూతహితమును కోరువాడు.
445) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
446) ఇజ్య: - యజ్ఞములచే ఆరాధించుబడువాడు.
447) మహేజ్య: - గొప్పగా పూజింపదగినవాడు.
448) క్రతు: - యజ్ఞముగా నున్నవాడు.
449) సత్రమ్ - సజ్జనులను రక్షించువాడు.
450) సతాంగతి: - సజ్జనులకు పరమాశ్రయ
స్థానమైనవాడు.
451) సర్వదర్శీ - సకలమును దర్శించువాడు.
452) విముక్తాత్మా - స్వరూపత: ముక్తి నొందినవాడు.
453) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
454) జ్ఞానముత్తమమ్ - ఉత్తమమైన
జ్ఞానము కలవాడు భగవానుడు.
455) సువ్రత: - చక్కని వ్రతదీక్ష కలవాడు.
456) సుముఖ: - ప్రసన్న వదనుడు.
457) సూక్ష్మ: - సర్వవ్యాపి.
458) సుఘోష: - చక్కటి ధ్వని గలవాడు.
459) సుఖద: - సుఖమును అనుగ్రహించువాడు.
460) సుహృత్ - ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే
సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.
461) మనోహర: - మనస్సులను హరించువాడు.
462) జితక్రోధ: - క్రోధమును జయించినవాడు.
463) వీరబాహు: - పరాక్రమముగల
బాహువులు కలవాడు.
464) విదారణ: - దుష్టులను చీల్చి చెండాడువాడు.
465) స్వాపన: - తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన
రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.
466) స్వవశ: - సర్వ స్వతంత్రమైనవాడు.
467) వ్యాపీ - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
468) నైకాత్మా - అనేక రూపములలో విరాజిల్లువాడు.
469) నైక కర్మకృత్ - సృష్టి, స్థితి,
లయము మున్నగు అనేక
కార్యములు చేయువాడు.
470) వత్సర: - సర్వులకు వాసమైనవాడు.
471) వత్సల: - భక్తులపై అపరిమిత
వాత్సల్యము కలవాడు.
472) వత్సీ - తండ్రి వంటివాడు.
473) రత్నగర్భ: - సాగరము వలె తన గర్భమున
రత్నములు గలవాడు.
474) ధనేశ్వర: - ధనములకు ప్రభువు.
475) ధర్మగుప్ - ధర్మమును రక్షించువాడు.
476) ధర్మకృత్ - ధర్మము నాచరించువాడు.
477) ధర్మీ - ధర్మమునకు ఆధారమైనవాడు.
478) సత్ - మూడు కాలములలో పరిణామ రహితుడై,
నిత్యుడై ఉన్నవాడు.
479) అసత్ - పరిణామయుతమైన జగద్రూపమున
గోచరించువాడు.
480) క్షర: - వ్యయమగు విశ్వరూపమున
తెలియబడువాడు.
481) అక్షర: - క్షరమగు ప్రపంచమున అవినాశియై
భాసిల్లువాడు.
482) అవిజ్ఞాతా - తెలుసుకొనువాని
కంటెను విలక్షణమైనవాడు.
483) సహస్రాంశు: - అనంత కిరణములు గలవాడు.
484) విధాతా - సర్వమునకు ఆధారమైనవాడు.
485) కృతలక్షణ: - వేదశాస్త్రములను
వెలువరించినవాడు.
486) గభస్తినేమి: - మయూఖ
చక్రమునకు కేంద్రమైనవాడు.
487) సత్వస్థ: - అందరిలో నుండువాడు.
488) సింహ: - సింహమువలె పరాక్రమశాలియైనవాడు.
489) భూతమహేశ్వర: - సర్వ
భూతములకు ప్రభువైనవాడు.
490) ఆదిదేవ: - తొలి దేవుడు.
491) మహాదేవ: - గొప్ప దేవుడు.
492) దేవేశ: - దేవదేవుడు.
493) దేవభృద్గురు: - దేవతల ప్రభువైన
మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.
494) ఉత్తర: - అందరికంటెను అధికుడై,
ఉత్తముడైనవాడు.
495) గోపతి: - గోవులను పాలించువాడు.
496) గోప్తా - సర్వులను సంరక్షించువాడు.
497) జ్ఞానగమ్య: - జ్ఞానము చేతనే తెలియబడినవాడు.
498) పురాతన: - సృష్టికి పూర్వమే వున్నవాడు.
499) శరీరభూతభృత్ - శరీరముల
నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.
500) భోక్తా - అనుభవించువాడు.
501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.
502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా
దక్షిణ లిచ్చువాడు.
503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన
దేవతలరూపముతో
సోమరసమును పానము చేయువాడు.
504) అమృతప: -
ఆత్మానందరసమును అనుభవించువాడు.
505) సోమ: - చంద్రరూపమున
ఓషధులను పోషించువాడు.
506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి,
జయించగల్గినవాడు.
507) పురుసత్తమ: - ఉత్తములలో
ఉత్తముడైనవాడు.
508) వినయ: - దుష్టులను దండించి,
వినయము కల్గించువాడు.
509) జయ: - సర్వులను జయించి
వశపరుచుకొనువాడు.
510) సత్యసంధ: - సత్యసంకల్పములు,
సత్యవాక్కులు గలవాడు.
511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున
పుట్టినవాడు.
512) సాత్వతాంపతి: -
యదుకులమునకు ప్రభువు.
513) జీవ: - జీవుడు.
514) వినయితా సాక్షీ - భక్తుల యందలి
వినయమును గాంచువాడు.
515) ముకుంద: - ముక్తి నొసగువాడు.
516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.
517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు,
పితరులు, అసురులు ఈ
నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు,
అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.
518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.
519) మహోదధిశయ: -
వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై
శయనించువాడు.
520) అంతక: - ప్రళయకాలమున
సర్వమును అంతము చేయువాడు.
521) అజ: - పుట్టుకలేనివాడు.
522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.
523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో
విరాజిల్లువాడు.
524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.
525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువా
డు.
526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా
గలవాడు.
527) నందన: -
సర్వులకు ఆనందము నొసగువాడు.
528) నంద: - విషయ సంబంధమైన
సుఖమునకు దూరుడు.
529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.
530) త్రివిక్రమ: - మూడడుగులచే
ముల్లోకములు వ్యాపించినవాడు.
531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా
అవతరించినవాడు.
532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త
రెండును తానైనవాడు.
533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.
534) త్రిపద: - మూడు పాదములతో
సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత,
స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.
536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని
నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి
సత్యవ్రతుని ఆయన అనుచరులైన
ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.
537) కృతాంతకృత్ - మృత్యువుని
ఖండించినవాడు.
538) మహావరాహ: - మహిమగల వరాహమూర్తి.
539) గోవింద: - గోవులకు ఆనందాన్నిచ్చువాడు.
భూమికి ఆధారభూతమైనవాడు.
540) సుషేణ: - శోభనమైన సేన గలవాడు.
541) కనకాంగదీ - సువర్ణమయములైన
భుజకీర్తులు కలవాడు.
542) గుహ్య: - హృదయగుహలో దర్శించదగినవాడు.
543) గభీర: - జ్ఞానము, ఐశ్వర్యము, బలము,
వీర్యము మొదలగువానిచే గంభీరముగా
నుండువాడు.
544) గహన: - సులభముగా
గ్రహించుటకు వీలుకానివాడు.
545) గుప్త: - నిగూఢమైన ఉనికి గలవాడు.
546) చక్రగదాధర: - సుదర్శనమను చక్రమును, కౌమోదకీ
యను గదను ధరించినవాడు.
547) వేధా: - సృష్టి చేయువాడు.
548) స్వాంగ: - సృష్టి
కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన
సామాగ్రి కూడా తానే అయినవాడు.
549) అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.
550) కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.
551) దృఢ: - చలించని స్వభావము కలవాడు.
552) సంకర్షణోచ్యుత: -
విశ్వమంతయు ప్రళయకాలములో
కదిలిపోయినను తానూ ఏ విధమైన
పరిణామము చెందనివాడు.
553) వరుణ: - తన
కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల
సూర్యుడు.
554) వారుణ: - వరుణుని కుమారులైన
వశిష్ఠుడు మరియు అగస్త్యులుగా
వ్యక్తమైనవాడు.
555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ
నందించువాడు.
556) పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.
557) మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.
558) భగవాన్ -
భగమను ఆరు లక్షణములు సమగ్రముగా
యున్నవాడు.
559) భగహా - ప్రళయ సమయమున తన
విభూతులను పోగొట్టువాడు.
560) ఆనందీ - ఆనందము నొసంగువాడు.
561) వనమాలీ - వైజయంతి
అను వనమాలను ధరించినవాడు.
562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.
563) ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు.
వామనుడు.
564) జ్యోతిరాదిత్య: -
సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.
565) సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.
566) గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.
567) సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప
ధనువును ధరించినవాడు.
568) ఖండ పరశు: -
శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని
ధరించినవాడు.
569) దారుణ: - దుష్టులైన వారికి
భయమును కలిగించువాడు.
570) ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన
సంపదలను ఇచ్చువాడు.
571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.
572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన
జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి,
మరియు మాతృగర్భమున జన్మించనివాడు.
574) త్రిసామా - మూడు సామ మంత్రములచే
స్తుతించబడువాడు.
575) సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడ తానే
అయినవాడు.
576) సామ - సామవేదము తానైనవాడు.
577) నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద
స్వరూపుడు.
578) భేషజం -
భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.
579) భిషక్ -
భవరోగమును నిర్మూలించు వైద్యుడు.
580) సంన్యాసకృత్ - సన్యాస
వ్యవస్థను ఏర్పరచినవాడు.
581) శమ: - శాంత స్వరూపమైనవాడు.
582) శాంత: - శాంతి స్వరూపుడు.
583) నిష్ఠా - ప్రళయ కాలమున
సర్వజీవులకు లయస్థానమైనవాడు.
584) శాంతి: - శాంతి స్వరూపుడు.
585) పరాయణమ్ - పరమోత్కృష్ట స్థానము.
586) శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.
587) శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.
588) స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని
ఉత్పత్తి చేసినవాడు.
589) కుముద: - కు అనగా భూమి, ముద అనగా
సంతోషము. భూమి యందు సంతోషించువాడు.
590) కువలేశయ: - భూమిని చుట్టియున్న
సముద్రమునందు శయనించువాడు.
591) గోహిత: - భూమికి హితము చేయువాడు.
592) గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.
593) గోప్తా - జగత్తును రక్షించువాడు.
594) వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.
595) వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.
596) అనివర్తీ - ధర్మ మార్గమున
ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.
597) నివృత్తాత్మా - నియమింపబడిన మనసు గలవాడు.
598) సంక్షేప్తా - జగత్తును ప్రళయకాలమున
సూక్షము గావించువాడు.
599) క్షేమకృత్ - క్షేమమును గూర్చువాడు.
600) శివ: -
తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.
601) శ్రీవత్సవక్షా - శ్రీ వత్సమనెడి
చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.
602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.
603) శ్రీపతి: - లక్ష్మీదేవికి భర్తయైనవాడు.
604) శ్రీమతాంవరా: - శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.
605) శ్రీ ద: - భక్తులకు సిరిని గ్రహించువాడు.
606) శ్రీ శ: - శ్రీ దేవికి నాథుడైనవాడు.
607) శ్రీనివాస: - ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి
హృదయముల యందు వసించువాడు.
608) శ్రీ నిధి: - ఐశ్వర్య నిధి.
609) శ్రీ విభావన: - సిరులను పంచువాడు.
610) శ్రీ ధర: - శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.
611) శ్రీ కర: - శుభముల నొసగువాడు.
612) శ్రేయ: - మోక్ష స్వరూపుడు.
613) శ్రీమాన్ - సర్వ విధములైన
ఐశ్వర్యములు గలవాడు.
614) లోకత్రయాశ్రయ: -
ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.
615) స్వక్ష: - చక్కని కన్నులు కలవాడు.
616) స్వంగ: - చక్కని అంగములు కలవాడు.
617) శతానంద: - అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా
ఆనందించువాడు.
618) నంది: - పరమానంద స్వరూపుడు.
619) జ్యోతిర్గణేశ్వర: - జ్యోతిర్గణములకు
ప్రభువు.
620) విజితాత్మ - మనస్సును జయించువాడు.
621) విధేయాత్మా - సదా భక్తులకు విధేయుడు.
622) సత్కీర్తి: - సత్యమైన యశస్సు గలవాడు.
623) ఛిన్నసంశయ: - సంశయములు లేనివాడు.
624) ఉదీర్ణ: - సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.
625) సర్వతశ్చక్షు: -
అంతటను నేత్రములు గలవాడు.
626) అనీశ: - తనకు ప్రభువు గాని, నియామకుడు గాని
లేనివాడు.
627) శాశ్వతస్థిర: - శాశ్వతుడు స్థిరుడు.
628) భూశయ: - భూమిపై శయనించువాడు.
629) భూషణ: - తానే ఆభరణము,
అలంకారము అయినవాడు.
630) భూతి: - సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.
631) విశోక: - శోకము లేనివాడు.
632) శోకనాశన: - భక్తుల
శోకములను నశింపచేయువాడు.
633) అర్చిష్మాన్ - తేజోరూపుడు.
634) అర్చిత: - సమస్త లోకములచే
పూజింపబడువాడు.
635) కుంభ: - సర్వము తనయందుండువాడు.
636) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన ఆత్మ
స్వరూపుడు.
637) విశోధనః - తనను స్మరించు వారి
పాపములను నశింపచేయువాడు
638) అనిరుద్ధః - శత్రువులచే అడ్డగింపబడనివాడ
ు.
639) అప్రతిరథ: - తన నెదుర్కొను ప్రతిపక్షము లేని
పరాక్రమవంతుడు.
640) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు.
641) అమిత విక్రమ: - విశేష పరాక్రమము గలవాడు.
642) కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని
వధించినవాడు.
643) వీర: - వీరత్వము గలవాడు.
644) శౌరి: - శూరుడను వాడి వంశమున
పుట్టినవాడు.
645) శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.
646) త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.
647) త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.
648) కేశవ: - పొడవైన కేశములు గలవాడు.
649) కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.
650) హరి: - అజ్ఞాన జనిత సంసార
దు:ఖమును సమూలముగా
అంతమొందించువాడు.
651) కామదేవ: - చతుర్విధ
పురుషార్థములను కోరువారిచే
పూజింపబడువాడు.
652) కామపాల: - భక్తులు తననుండి పొందిన
పురుషార్థములను చక్కగా
ఉపయోగపడునట్లు చూచువాడు.
653) కామీ - సకల కోరికలు సిద్ధించినవాడు.
654) కాంత: - రమణీయ రూపధారియైన వాడు.
655) కృతాగమ: - శ్రుతి, స్తృతి ఇత్యాది
శాస్త్రములు రచించినవాడు.
656) అనిర్దేశ్యవపు: - నిర్దేశించి,
నిర్వచించుటకు వీలుకానివాడు.
657) విష్ణు: - భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.
658) వీర: - వీ ధాతువుచే సూచించు కర్మలచే
నిండియున్నవాడు.
659) అనంత: - సర్వత్రా,
సర్వకాలములందు ఉండువాడు.
660) ధనంజయ: - ధనమును జయించినవాడు.
661) బ్రహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు.
662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా
తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.
663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి
చేయువాడు.
664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.
665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి
నొందించువాడు.
666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.
667) బ్రాహ్మణ: -
వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.
668) బ్రహ్మీ - తపస్యాది
బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.
669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన
వాడు.
670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని
ప్రేమించువాడు.
671) మహాక్రమ: - గొప్ప పధ్ధతి గలవాడు.
672) మహాకర్మా - గొప్ప కర్మను ఆచరించువాడు.
673) మహాతేజా: - గొప్ప తేజస్సు గలవాడు.
674) మహోరగ: - గొప్ప సర్ప స్వరూపుడు.
675) మహాక్రతు: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
676) మహాయజ్వా - విశ్వ శ్రేయమునకై అనేక
యజ్ఞములు నిర్వహించినవాడు.
677) మహాయజ్ఞ: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
678) మహాహవి: - యజ్ఞమునందలి హోమసాధనములు,
హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.
679) స్తవ్య: - సర్వులచే స్తుతించబడువాడు.
680) స్తవప్రియ: - స్తోత్రములయందు ప్రీతి
కలవాడు.
681) స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు.
682) స్తుతి: - స్తవనక్రియ కూడా తానే అయినవాడు.
683) స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే
అయినవాడు.
684) రణప్రియ: - యుద్ధమునందు ప్రీతి కలవాడు.
685) పూర్ణ: - సర్వము తనయందే గలవాడు.
686) పూరయితా - తన నాశ్రయించిన
భక్తులను శుభములతో నింపువాడు.
687) పుణ్య: - పుణ్య స్వరూపుడు.
688) పుణ్యకీర్తి: - పవిత్రమైన కీర్తి గలవాడు.
689) అనామయ: - ఏవిధమైన భౌతిక, మానసిక
వ్యాధులు దరిచేరనివాడు.
690) మనోజవ: - మనసు వలె అమిత వేగము కలవాడు.
691) తీర్థకర: - సకల విద్యలను రచించినవాడు.
692) వసురేతా: - బంగారము వంటి
వీర్యము గలవాడు.
693) వసుప్రద: - ధనమును ఇచ్చువాడు.
694) వసుప్రద: - మోక్షప్రదాత
695) వాసుదేవ: - వాసుదేవునకు కుమారుడు.
696) వసు: - సర్వులకు శరణ్యమైనవాడు.
697) వసుమనా: - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.
698) హవి: - తానే హవిస్వరూపుడైనవాడు.
699) సద్గతి: - సజ్జనులకు పరమగతియైన వాడు.
700) సత్కృతి: - జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము.
701) సత్తా - సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన
అనుభవ స్వరూపము.
702) సద్భూతి: - పరమోత్కృష్టమైన మేధా
స్వరూపుడు.
703) సత్పరాయణ: - సజ్జనులకు పరమగతి అయినవాడు.
704) శూరసేన: - శూరత్వము గల
సైనికులు గలవాడు.
705) యదుశ్రేష్ఠ: - యాదవులలో గొప్పవాడు.
706) సన్నివాస: - సజ్జనులకు నిలయమైనవాడు.
707) సుయామున: - యమునా తీర
వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు.
708) భూతవాస: - సర్వ
భూతములకు నిలయమైనవాడు.
709) వాసుదేవ: - తన మాయాశక్తిచే
సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని
కుమారుడు.
710) సర్వాసు నిలయ: - సమస్త జీవులకు,
ప్రాణులకు నిలయమైనవాడు.
711) అనల: - అపరిమిత శక్తి, సంపద గలవాడు.
712) దర్పహా - దుష్టచిత్తుల గర్వమణుచు వాడు.
713) దర్పద: - ధర్మమార్గమున చరించువారికి
దర్పము నొసంగువాడు.
714) దృప్త: - సదా ఆత్మానందామృత రసపాన
చిత్తుడు.
715) దుర్థర: - ధ్యానించుటకు,
బంధించుటకు సులభసాధ్యము కానివాడు.
716) అపరాజిత: - అపజయము పొందనివాడు.
717) విశ్వమూర్తి: - విశ్వమే తన మూర్తిగా గలవాడు.
718) మహామూర్తి: - గొప్ప మూర్తి గలవాడు.
719) దీప్తమూర్తి: - సంపూర్ణ జ్ఞానముతో
ప్రకాశించువాడు.
720) అమూర్తివాన్ - కర్మాధీనమైన దేహమే లేనివాడు.
721) అనేకమూర్తి: - అనేక
మూర్తులు ధరించినవాడు.
722) అవ్యక్త: - అగోచరుడు.
723) శతమూర్తి: - అనేక
మూర్తులు ధరించినవాడు.
724) శతానన: - అనంత ముఖములు గలవాడు.
725) ఏక: - ఒక్కడే అయినవాడు.
726) నైక: - అనేక రూపములు గలవాడు.
727) సవ: - సోమయాగ రూపమున ఉండువాడు.
ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత
తాను పూర్ణరూపుడు.
728) క: - సుఖ స్వరూపుడు.
729) కిమ్ - అతడెవరు? అని విచారణ చేయదగినవాడు.
730) యత్ - దేనినుండి
సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ
బ్రహ్మము.
731) తత్ - ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు.
732) పదం-అనుత్తమం -
ముముక్షువులు కోరు ఉత్తమస్థితి
తాను అయినవాడు.
733) లోకబంధు: - లోకమునకు బంధువైనవాడు.
734) లోకనాధ: - లోకములకు ప్రభువు
735) మాధవ: - మౌన, ధ్యాన, యోగాదుల వలన
గ్రహించుటకు శక్యమైనవాడు.
736) భక్తవత్సల: - భక్తుల
యందు వాత్సల్యము గలవాడు.
737) సువర్ణవర్ణ: - బంగారు వంటి
వర్ణము గలవాడు.
738) హేమాంగ: - బంగారు వన్నెగల
అవయువములు గలవాడు.
739) వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.
740) చందనాంగదీ - ఆహ్లాదకరమైన
చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు.
741) వీరహా - వీరులను వధించినవాడు.
742) విషమ: - సాటిలేనివాడు.
743) శూన్య: - శూన్యము తానైనవాడు.
744) ఘృతాశీ: - సమస్త కోరికలనుండి విడువడినవాడు.
745) అచల: - కదలిక లేనివాడు.
746) చల: - కదులువాడు.
747) అమానీ - నిగర్వి, నిరహంకారుడు.
748) మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.
749) మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.
750) లోకస్వామీ -
పదునాలుగు భువనములకు ప్రభువు.
751) త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన
భగవానుడు.
752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.
753) మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.
754) ధన్య: - కృతార్థుడైనట్టివాడు.
755) సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.
756) ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.
757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని
వర్షించువాడు.
758) ద్యుతిధర: - కాంతివంతమైన
శరీరమును ధరించినవాడు.
759) సర్వ శస్త్ర భృతాంవర: -
శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.
760) ప్రగ్రహ: - ఇంద్రియములనెడి అశ్వములను తన
అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.
761) నిగ్రహ: - సమస్తమును నిగ్రహించువాడు.
762) వ్యగ్ర: - భక్తులను తృప్తి పరుచుటలో సదా
నిమగ్నమై ఉండువాడు.
763) నైకశృంగ: - అనేక కొమ్ములు గలవాడు,
భగవానుడు.
764) గదాగ్రజ: - గదుడను వానికి అన్న.
765) చతుర్మూర్తి: -
నాలుగు రూపములు గలవాడు.
766) చతుర్బాహు: -
నాలుగు బాహువులు గలవాడు.
767) చతుర్వ్యూహ: - శరీర, వేద, ఛందో
మహద్రూపుడైన పురుషుడు. ఈ
నలుగురు పురుషులు వ్యూహములుగా
కలవాడు.
768) చతుర్గతి: - నాలుగు విధములైన వారికి ఆశ్రయ
స్థానము.
769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.
770) చతుర్భావ: - చతుర్విద
పురుషార్థములకు మూలమైనవాడు.
771) చతుర్వేదవిత్ -
నాలుగు వేదములను తెలిసినవాడు.
772) ఏకపాత్ - జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.
773) సమావర్త: - సంసార చక్రమును సమర్థతతో
త్రిప్పువాడు.
774) అనివృత్తాత్మా - అంతయు తానైయున్నందున
దేనినుండియు విడివడినవాడు.
775) దుర్జయ: - జయింప శక్యము గానివాడు.
776) దురతిక్రమ: - అతిక్రమింపరాని
విధమును సాసించువాడు.
777) దుర్లభ: - తేలికగా లభించనివాడు.
778) దుర్గమ: - మిక్కిలి కష్టముతో మాత్రమే
పొందబడినవాడు.
779) దుర్గ: - సులభముగా లభించనివాడు.
780) దురావాస: - యోగులకు కూడా మనస్సున
నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.
781) దురారిహా: - దుర్మార్గులను వధించువాడు.
782) శుభాంగ: - దివ్యములైన, సుందరములైన
అవయువములు గలవాడు.
783) లోకసారంగ: - లోకములోని
సారమును గ్రహించువాడు.
784) సుతంతు: - జగద్రూపమున అందమైన
తంతువువలె విస్తరించినవాడు.
785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు,
నాశనము చేయువాడు.
786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి
శుభప్రధమైన కర్మ నాచరించువాడు.
787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.
788) కృతకర్మా - ఆచరించదగిన
కార్యములన్నియు ఆచరించినవాడు.
789) కృతాగమ: - వేదముల నందించువాడు.
790) ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.
791) సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.
792) సుంద: - కరుణా స్వరూపుడు.
793) రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి
గలవాడు.
794) సులోచన: - అందమైన నేత్రములు కలిగిన
భగవానుడు.
795) అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల
చేతను అర్చించబడువాడు.
796) వాజసన: -
అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.
797) శృంగీ - శృంగము గలవాడు.
798) జయంత: - సర్వ విధములైన
విజయములకు ఆధారభూతుడు.
799) సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.
800) సువర్ణబిందు: - బంగారము వంటి
అవయువములు గలవాడు.
801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.
802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన
బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు.
803) మహాహ్రద: - గొప్ప జలాశయము.
804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.
805) మహాభూత: -
పంచభూతములకు అతీతమైనవాడు.
806) మహానిధి: - సమస్త
భూతములు తనయందు ఉన్నవాడు.
807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి
యొక్క భారమును తొలగించి
మోదమును కూర్చువాడు.
808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.
809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.
810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని
చల్లబరుచునట్లు జీవుల
తాపత్రయములను తొలగించి,వారి
మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.
811) పావన: - పవిత్రీకరించువాడు.
812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.
813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.
814) అమృతవపు: -
అమృతస్వరూపుడు శాశ్వతుడు.
815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
816) సర్వతోముఖ: - ఏకకాలమున
సర్వమును వీక్షించగలవాడు.
817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి
సులభముగా లభ్యమగువాడు.
818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.
819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై
భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.
820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.
821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులక
ు విరోధులైన వారిని తపింప చేయువాడు.
822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే
ఆవరించి ఉన్నవాడు.
823) ఉదుంబర: - అన్నముచేత
విశ్వమును పోషించువాడు.
824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష
స్వరూపుడు.
825) చాణూరాంధ్ర నిషూదన: -
చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.
826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.
827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల
అగ్నిస్వరూపుడు.
828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.
829) సప్తవాహన: -
ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.
830) అమూర్తి: - రూపము లేనివాడు.
831) అనఘ: - పాపరహితుడు.
832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.
833) భయకృత్ - దుర్జనులకు భీతిని
కలిగించువాడు.
834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.
835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.
836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన
బ్రహ్మము స్వరూపము.
837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.
838) స్థూల: - స్థూల
స్వరూపము కలిగియున్నవాడు.
839) గుణభృత్ - సత్వరజోస్తమో
గుణములకు ఆధారమైనవాడు.
840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.
841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.
842) అధృత: - సర్వము తానే ధరించియుండి,
తనను ధరించునది మరియొక

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML