గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 27 February 2015

మత్స్య మహా పురాణం -3వ భాగం నారాయణుడి మత్స్యవతారం :మత్స్య మహా పురాణం -3వ భాగం

నారాయణుడి మత్స్యవతారం :

శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవ్వగానే అతనిని చూసి..


‘‘ఓ మహానుభావా! నీకు తెలియంది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి, పెరిగి చివరకు నశిస్తున్నాయి.

నీ మహిమను గ్రహించడానికి మేమెంతటివాళ్లం? సృష్టిని నిర్మించినవాడివైన నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అయినా నీకు విన్నవించుకుంటున్నాను...

నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్ద వున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపవడం వల్ల సృష్టిన తయారుచేసే సామర్థ్యం నాలో తగ్గిపోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి, నాకు నుగ్రహించండి’’ అని ప్రార్థించుకుంటాడు.

అప్పుడు శ్రీహరి పదియోజనాల పొడవుగల చేప రూపాన్ని దాల్చి, బ్రహ్మతో..

‘‘ఓ బ్రహ్మదేవా! విచారించకు. నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ వున్నా ఆ సోమకుడిని వెతికి పట్టుకుని చంపి, వేదాలను నీకు అప్పగిస్తాను’’ అని మాటిచ్చి.. సముద్రంలోకి వెళ్లిపోతాడు.

సోమకాసురుడు అపహరించుకుని తీసుకుపోయిన వేదాలను.. తినే పదార్థాలు అనుకొని వాటిని మింగేస్తాడు.

కాని అవి అతని ఆకలి తీర్చలేదు. దీంతో అతను ఆకలి తీర్చుకోవడం కోసం ఆహారాన్ని వెదకడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మత్స్యరూపమెత్తిన శ్రీమన్నారాయణుడు కూడా అతనిని వెతుక్కుంటూ, అతను వున్న ప్రాంతానికి చేరుకుంటాడు. సోమకాసురుడు..

‘‘ఈ చేప ఎంత బాగుంది. దీనిని నా ఆహారంగా మలచుకుంటాను’’ అని తలచుకుని, దానిని మింగడానికి ప్రయత్నిస్తాడు.
కానీ ఆ చేప అతనిని ఎదుర్కుంటుంది. సోమకాసురుడు మహా బలవంతుడే కాబట్టి వారిద్దరి మధ్య యుద్ధం ఏర్పడుతుంది. ఇలా వారిమధ్య యుద్ధం కొన్ని కాలాలపాటు మహాసంగ్రామంలా జరుగుతుంది.

దానవుడు, మత్స్యాన్ని నొప్పించడానికి అనేక రకాల పథకాలు రచిస్తాడు. తన దగ్గరున్న గదాఘాతంతో కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే విష్ణువు ఆ దెబ్బ నుంచి తప్పించుకుని తోకతో నీటిని బాదుతాడు. ఆ దెబ్బతో నీరు ఒక యోజనం పైకి ఎగరగా..

సోమకాసురుడు కూడా అలాగే పైకి ఎగురుతాడు. దాంతో సోమకుడు కోపాద్రిక్తుడై మత్స్యాన్ని తన రెండు చేతులతో బట్టి పీడించడం మొదలుపెట్టాడు. అయితే మత్స్యం రాక్షసుని పట్టునుంచి
విడిపించుకుని, తన కోరలతో చీల్చి చెండాడుతుంది. అనంతరం అతని కడుపులో వున్న వేదాలను, ఒక దక్షిణావర్త శంఖమును తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు.

శ్రీ విష్ణువు, బ్రహ్మకు వేదాలు ఇస్తూ.. ‘‘నాయనా! సోమకుడు ఈ వేదాలను మింగడం వల్ల కొన్ని శిథిలమయిపోయాయి.

నీకు జ్ఞాపకమున్నంతవరకు వీటిని శిథిల పురాణం చేసి, స్ఫురించిన చోట ప్రణవంతో పూరించి, సమగ్రంగా పూర్తి చేయు’’ అని చెప్పి అదృశ్యమవుతాడు.

Continues...

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML