ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 17 February 2015

విష్ణు సహస్ర నామాలలో 37వ నామం స్వయంభూః

విష్ణు సహస్ర నామాలలో 37వ నామం స్వయంభూః
౧. కవిర్మనీషీ పరిభూః స్వయంభూః - అని యజుర్వేదం పేర్కొంది.
స ఎవ స్వయముద్బభౌ - మనుస్మృతి.
తనకు తానుగా ఉన్నవాడు, కలిగిన వాడు. స్వయంసత్తా స్వరూపుడు. సృష్టిలో దేనికైనా ఒక కారణముండాలన్నది ప్రకృతి నియం. ప్రకృతి కంటే అతీతుడైన పురుషోత్తమునకు ఈ కార్యకారణ నియమం వర్తించదు.
సర్వమునకు తానూ కారణమై తనకు కారణము లేని వాడు స్వయంభువు. అంతటనూ ఉన్నది ఆ స్వయంభువే. 'స్వయంభూః బ్రహ్మ పరమం కవీనాం' - అని వేదోక్తి.
2. అవతారాది కృత్యములను కూడా తన దయతో తానే దాల్చినవాడు.
3. సృష్టిలో స్వయంచాలక శక్తిని కలిగించిన వాడు స్వయంభువు. నదులు తమంత తాము కడులుతున్నవి. గాలి తనంత తానే వీస్తున్నది. సూర్యాదులు తమంత తామే వర్తిస్తున్నారు. సముద్రాదులు స్వయంగా ఉత్తుంగ తరంగాలతో వర్ధిల్లుతున్నాయి. జీవకోటిలో స్త్రీ పురుషాదుల్లో సహజంగా, స్వయంగా వర్తిల్లే చైతన్యం స్వామి స్వరూపమే. ఆ స్వయం చైతన్య స్వరూపుడు - స్వయంభువు.
స్వతంత్రతా లక్షణమైన తన చైతన్యంతో సర్వమునకు శుభమును, సుఖమును కలిగించు వాడు కనుక శంభుః.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML