
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 13 February 2015
విష్ణు సహస్రనామాలలో 36వ నామం ఈశ్వరః
విష్ణు సహస్రనామాలలో 36వ నామం ఈశ్వరః
1. ఒకరి ఆధారం అవసరం లేని అనంత సహజ ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు. జగన్నిర్వహణకు అవసరమైన ఐశ్వర్యమంతా స్వామి స్వరూపము.
2. పరమాత్మ సృష్టి స్థితి లయాది కృత్యాలు నిర్వహించేటప్పుడు 'ఈశ్వర' అని పిలువబడతాడు.
జగమంతా నిండిన వాడే ఈశ్వరుడు.
'ఈశావాస్య మిదం సర్వం' అని శ్రుతి వచనం.
'ఏష సర్వేశ్వరః' అని కూడా శ్రుతి మాట కీర్తిస్తూ 'తమీశానం జగతస్త స్థుషస్పతిం ధియం జిన్వమవసే హూమహేవయమ్' అని శరణు వేడింది.
3. 'ఈష్టే ఇతి ఈశ్వరః' - సమస్త కార్యములు నెరవేర్చి పాలిచే పాలకుడు. మహాశక్తి సంపన్నుడని అర్థం. ఈ ఈశ్వరుడే సృష్టిలో అన్నిటికీ 'ఆది' అంటూ ఆయనను వర్ణించాం. మరి ఆయనకు ఆది వున్నదా? లేదు - తనకు తానె ఆది. తన ఉనికికీ, అవతారానికీ తానే కర్త. అందుకే ఆయన స్వయంభూః.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment