గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 27 February 2015

మార్కండేయ పురాణం -2వ భాగంమార్కండేయ పురాణం -2వ భాగం

ఒకనాడు ప్రభాతవేళ శమీకుడు అనే ఒక మహాముని..
ఆ కురుక్షేత్రం మీదుగా వెళ్తుంటాడు. గంటకింద వున్న గుడ్లు పిల్లలుగా మారి, కిచకిచలాడుతుంటాయి.


అలా ధ్వని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి నాలుగు పక్షి పిల్లలు కనిపిస్తాయి.

శమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ పక్షులు..

‘‘ఓ మహానుభావా! తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ ఋణము మేమెలా తీర్చుకోవాలి? మేము ఏ విధంగా నీకు సేవ చేయగలం చెప్పు’’ అని అడిగాయి.

పక్షులు మానవభాషలో మాట్లాడుతున్నందువల్ల శమీకుడు ఆశ్చర్యపడి, ‘‘ఓ పక్షి పిల్లల్లారా! మీరు మానవభాషలో మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా వింతగా వుంది. అసలు మీరెవ్వరు?
ఎందుకు ఈ పక్షీ జన్మం ఎత్తారు?

నాకు దయచేసి తెలపండి’’ అని అడగగా... ఆ పక్షిపిల్లలు ఈ విధంగా సమాధానం చెబుతాయి.

‘‘ఓ ఋషీశ్వరా! పూర్వం సుకృతి అనే మహామునికి మేము నలుగురం పుత్రులుగా జన్మించాం.

వేదశాస్త్రాలను చదువుకుంటూ... మా తల్లిదండ్రులను సేవిస్తూ.. కాలాన్ని గడిపేవాళ్లం.

ఇలా వుండగా.. ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రిసత్యాన్ని పరీక్షించడానికి గ్రద్దరూపంలో వచ్చి నరమాంసాన్ని ఆహారంగా పెట్టమని కోరాడు.
అప్పుడు మా తండ్రి..

‘‘మీలో ఎవరైనా ఇంద్రునికి ఆహారం అవ్వండి’’ అని ఆజ్ఞాపించారు.
అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞాన్ని పాలించకుండా అలాగే వుండిపోయాం.

అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షలుగా పుట్టాలని శపించి, తన శరీరాన్ని ఇంద్రునికి ఆహారంగా సమర్పించుకున్నారు.

ఇంద్రుడు మా తండ్రి త్యాగబుద్ధిని సంతోషించి, మమ్మల్ని చూసి...

‘‘మీరు వింధ్యపర్వత గుహలలో నివసించండి. జైమిని అనే వ్యాసశిష్యుడు మీ దగ్గరకు వచ్చి, కొన్ని సందేహాలు అడుగుతాడు.

ఆ సందేహాలను తీర్చి మీరు శాపవిముక్తి పొందండి. మీరు పక్షులైనా..
సర్వవేదాలను పొంది ధర్మపక్షులు, జ్ఞానపక్షులుగా పేరు పొందుతారు’’
అని మమ్మల్ని అనుగ్రహంచి వెళ్లిపోయాడు’’ అని ఆ పక్షులు తమ వృత్తాంతం గురించి శమీకునికి చెబుతాయి.

అప్పుడు శమీకుడు... ‘‘మీరు నాకోసం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యపర్వతాలకు వెళ్లండి’’ అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపివేశాడు’’
కాబట్టి..

ఓ జైమినీ! నువ్వు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి నీ ధర్మసందేహాలను తీర్చుకో’’ అని జైమినికి చెప్పి.. మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళతాడు.

జైమిని వింధ్యపర్వతంలో జ్ఞానపక్షులను వెదకడానికి వెళతాడు. అలా కొద్దిసేపు తరువాత అతనికి ఆ పక్షులు కనిపిస్తాయి.

ఆ పక్షులు ఆ సమయంలో వేదాధ్యాయనం చేస్తున్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి..
‘‘ఓ పక్షులారా! నేను వ్యాసుని శిష్యుడిని.
నన్ను జైమిని అంటారు.

మార్కండేయుడు చెప్పిన విధంగా నేను మీ దగ్గర కొన్ని ధర్మసందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను
నా సందేహాలను తీర్చండి’’ అని చెప్పగా...

ఆ పక్షులు ‘‘నీకున్న సందేహాలేంటో అడుగు.. మా చేతనైంతవరకు సమాధానాలు చెబుతాం’’ అని సమాధానం ఇస్తాయి.

Continues...

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML