న్యూటన్1500 ఏళ్ల తర్వాత చెప్పాడు
చంద్రుడిపై నీటిమాట వేదాల్లోనే ఉంది
ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: గురుత్వాకర్షణను కనిపెట్టిందెవరంటే చటుక్కున ఇజాక్ న్యూటన్ అని చెప్పేస్తాం. వెంటనే ‘నెత్తిమీద యాపిల్ పడిన’ కథా గుర్తుకొచ్చేస్తుంది! కానీ, ఈ సంగతి భారత పరిశోధకుడు ఆర్యభట్టకు అంతకన్నా 1500ఏళ్లకు ముందే తెలుసట! ఈ విషయాన్ని ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ శనివారం చెప్పారు. వేదాల్లోని కొన్ని శ్లోకాల్లో చంద్రుడిపై నీటి జాడల ప్రస్తావన ఉందనీ తెలిపారు. దాన్నిబట్టి చూస్తే ఆర్యభట్టలాంటి ఖగోళ నిపుణులకు గురుత్వబలం గురించి ముందే తెలుసునని తేలుతోందన్నారు. అంతేగాక పాశ్చాత్య ప్రపంచానికన్నా ముందే వేదాలు, పురాతన శాసనాల్లో లోహశాస్త్రం, బీజగణితం, ఖగోళశాస్త్రం, గణితం, నిర్మాణం, జ్యోతిష శాస్త్రాల సమాచారమూ ఉందన్నారు. వేదాలపై అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. వేదాలు సంగ్రహ రూపంలో ఉండడంతో ఆధునిక శాస్త్రాలుగా వాటిని ఒప్పుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. చంద్రుడిపై నీరుందని వేదాల్లో ముందే చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు. వేదాలు సంస్కృతంలో ఉండడంతో వాటి పరమార్థం ఎవరికీ అర్థం కాలేదని.. కాదని కూడా చెప్పారు. గ్రహపరిశోధనకు ఖగోళ, గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, భాస్కర కృషి అమోఘమన్నారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment