ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 11 February 2015

నాన్న గారూ మనం నివసిస్తున్న భూమి దేనిపై నిలిచియున్నది... అన్నది ఓ చిన్న తల్లి ప్రశ్న. ఈ ప్రశ్నకూడా 1500 సంవత్సరాలక్రితం లీలావతి అనే చిన్న అమ్మాయి తన తండ్రి భాస్కరాచార్యులనే ఖగోళ శాస్త్ర సూర్యుణ్ణి అడిగింది.

నాన్న గారూ మనం నివసిస్తున్న భూమి దేనిపై
నిలిచియున్నది... అన్నది ఓ చిన్న తల్లి
ప్రశ్న. ఈ ప్రశ్నకూడా 1500 సంవత్సరాలక్రితం
లీలావతి అనే చిన్న అమ్మాయి తన తండ్రి
భాస్కరాచార్యులనే ఖగోళ శాస్త్ర
సూర్యుణ్ణి అడిగింది.
అమ్మాయ్ కొందరు ఈ భూమి ఆదిశేషునిపైన,
తాబేలుపైన లేదా ఏనుగుపైన లేదా ఏదోఒక
దానిపైన ఆధరపడి నిలచిఉన్నదని తప్పుగా
చెబుతున్నారు. ఒక వేళ ఈ సమాధానాన్ని
సమ్మతించి భూమి ఏదో ఒక వస్తువుపైన నిలచి
ఉన్నది అనుకుంటే, మరి ఆ వస్తువు దేనిపై
నిలచి ఉన్నది అనే ప్రశ్న ఉదయిస్తుందికదా.
ఇలా కారణానికి కారణము, ఆ కారణానికి మరో
కారణము ఇలా క్రమం కొనసాగుతుంది. దీన్ని
న్యాయశాస్త్రంలో అనవస్థాన దోషం అంటారు.
ఆ చిన్న అమ్మాయి మరలా తన ప్రశ్నను తిరిగి
సంధించింది. మీరు ఇన్ని చెప్పినా ఈ భూమి ఏ
వస్తువుపై నిలచిఉన్నదనే ప్రశ్న మిగిలే
ఉంటుంది కాదా అని.
భూమి ఏ వస్తువుపై ఆధారపడి
నిలిచిలేదు అనేది మనం ఎందుకు అంగీకరించలేక
పోతున్నాము. భూమి తన శక్తిపైననే
తాను నిలచిఉన్నది. దీనిని ధరణాత్మిక శక్తి
అంటారు అని భాస్కరాచార్యులు చెప్పారు.
అదెలాసంభవం అని మరలా లీలావతి ప్రశ్న
మరుచ్చలో భూరచలా స్వభావతోయతో
విచిత్రావతవస్తు శక్త్యః – భువనకోశం – 5
ఆకృష్టి శక్తిశ్చ మహీ తయాయతే
స్వస్థం గురుస్వాభిముఖం స్వశక్య్తా
ఆకృష్యతే తత్ పతతీవభాతి సమే సమన్తాత్
క్వ పతత్వియం భే. – భువనకోశం – 6
అనగా భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమి తన
ఆకర్షణ శక్తితో బరువైన
పదార్థాలను తనవైపు ఆకర్షించుకొంటుంది. ఆ
ఆకర్షణ వలననే అది భూమిపై పడుతుంది.
ఆకాశంలో ఎప్పుడైతే నాలుగువైపులా సమాన
శక్తులు లాగి పట్టినప్పుడు ఏదైనా ఎలా
క్రింద పడుతుంది. అనగా ఆకాశంలో
గ్రహాలు ఎలాంటి ఆలంబనం లేకుండానే ఎలా
నిలిచి ఉన్నాయంటే ఇదే కారణం. గ్రహముల
యొక్క గురుత్వాకర్షణ శక్తి సంతులనాన్ని
నిల్పి ఉంచుతూ ఒకదానినొనటి లాగిపట్టి
ఉంటాయి.
న్యూటన్ మహాశయుడు ఆపిల్ క్రింద పడగానే
ఆయనకు భూమ్యాకర్షణ
సిద్దాంతం స్పురణకు వచ్చింది. కానీ
ఆయనకంటే దాదాపు 550
సంవత్సరాలముందు భాస్కరాచార్యులనే ఆయన
తనకూతురుకు ఈ సిద్దాంతాన్ని ఇంకా
అద్భుతంగా చెప్పాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML