
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 3 February 2015
హిందూ ధర్మం - 134 (వైదిక సంస్కృతి - మహాభారతం)
హిందూ ధర్మం - 134 (వైదిక సంస్కృతి - మహాభారతం)
#ద్వాపరయుగాంతం వరకు ప్రపంచమంతా సనాతనధర్మమే వర్ధిల్లింది. వేదప్రచారం నిత్యం జరిగింది. ఎక్కడ చూసిన వేదం గురించి చర్చలే, ప్రజలు కూడా వేదంలో ఉన్న విజ్ఞానం గురించే కాలక్షేపం చేసేవారు. అందరూ రోజు రెండుపుటలా నిత్యాగ్నిహోత్రం చేసేవారు. వైదికసంస్కృతి 3 పూవులు, 6 కాయలుగా వర్ధిల్లింది. కానీ విధినిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు. ఇంతలోనే మహాభారత యుద్ధం మొదలైంది. సరిగ్గా ఇప్పటికి (2015 జనవరికి) 5152 సంవత్సరాల క్రితం ఉత్తరభారతదేశంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కాలగతిలో కొన్నేళ్ళు అభివృద్ధి చెందితే, మరికొన్నేళ్ళు కష్టాలు పడవలసి వస్తుంది. జీవుల కర్మను అనుసరించి, వారి జన్మకు అనుగుణమైన పరిస్థితులు ఏర్పడవలసి వస్తుంది.
ప్రపంచమంతా వ్యాపించిన సనాతన ధర్మానికి మహాభారత యుద్ధంతో కష్టాలు మొదలయ్యాయి. మహాభారతం కావ్యం కాదు, పురాణం కాదు, మహాభారతం ఇతిహాసం.#ఇతిహాసం అంటే ఇలాగే జరిగిందని అర్దం. మహాభారతం విశేషాలను సంస్కృతంలో వ్యాసమహర్షి చెప్పగా, గణపతి రచించాడు. మహాభారత యుద్ధం క్రీ.పూ. 3139 లో జరిగింది. యుద్ధం గెలిచాకా, పాండవులు హస్తినాపురాన్ని (నేటి ఢిల్లీ) రాజధానిగా చేసుకుని 36 ఏళ్ళ 8 నెలలు పాలించారు. క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17,18 నాటికి ద్వాపరయుగం అంతమై కలియుగం మొదలైంది. వీటిని జ్యోతిష్య శాస్త్రమూ, ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట, అతన ఆర్యభట్టీయం అనే గ్రంధంలో పొందుపరిచారు.
ఏదో పుస్తకంలో ఉన్నది మెము ఎట్లా అంగీకరించాలి అనవచ్చు. దానికి తగిన శాసనాలు ఉన్నాయి, అవే సంవత్సరాలని చెప్పటానికి అన్నిటికంటే ముఖ్యమైన ఖగోళ, అంతరిక్షానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. #వ్యాసమహర్షి ప్రజ్ఞ గురించి వర్ణించటం అసాధ్యం. కాలక్రమంలో పుస్తకాలు చినిగిపోతాయి, శాసనాలు కొంత రూపు పోవచ్చు, లేకపోతే విజ్ఞానశాస్త్ర గ్రంధాలు చౌర్యానికి గురై ప్రజలకు అందుబాటులో లేకుండా పోవచ్చు. కానీ ఈ జగత్తులు ఎవరు మార్చలేనిది, ఎప్పటికి సాక్ష్యంగా నిలిచేవి అంతరిక్షంలో గ్రహాల కదలికలు, గ్రహస్థితులు (planetary positions). గ్రహాల మధ్య దూరం, కోణము, ఆ సమయంలో వాటి స్థానం, ఇవన్నీ తరుచుగా ఏర్పడే అంశాలు కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పడే ఈ ఖగోళ శాస్త్ర అద్భుతాలను వ్యాసమహర్షి గుర్తించి, సేకరించి, మహాభారతంలో పొందుపరిచారు, అనగా record చేశారు.. ఈ ఖగోళ అంశాలను ఈ రోజు ఆధునిక సాఫ్ట్వేర్ల ద్వారా astronomical dating ద్వారా పరీశీలించినప్పుడు పైన చెప్పుకున్న సంవత్సరాలే వస్తున్నాయి. వాటికి శాసనమైన ఆధారలు ఎన్ని ఉన్నాయో, ఖగోళ, జ్యోతిష్యశాస్త్ర ఆధారాలు అన్నే ఉన్నాయి. Astronomical dating అంటే ఇప్పుడున్న గ్రహస్థితుల నుంచి వెనక్కు లెక్కించుకుంటూ వెళ్ళడం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment