గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 28 February 2015

" వేంకటేశ్వర అవతారానికి 3 ప్రధానమైన కారణాలు " ?....

" వేంకటేశ్వర అవతారానికి 3 ప్రధానమైన కారణాలు " ?....
1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు. తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని పద్మావతి అమ్మవారు పరిణయమాడతనన్నాడు.
Read More

అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు.అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. నిసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు.

జ్వాలా నరసింహ క్షేత్రము

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీ మన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.

అహోబిల నరసింహ స్వామి

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు.

మాలోల నరసింహ స్వామి

వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.

వరాహ నరసింహస్వామి (క్రోడా)

వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.

కారంజ నరసింహస్వామి

కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు.

భార్గవ నరసింహస్వామి

పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.

యోగానంద నరసింహస్వామి

యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

చత్రవట నారసింహస్వామి

పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు.

పావన నరసింహ స్వామి

పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.


Read More

హిందూమతంలో పధానమయినది ఏకేశ్వరభావాన. ఏ దేవుని పూజించినా ఆ పూజలన్నీ ఏకేశ్వరునికే చెండుతాయన్నది ప్రతి ఒక్క హిందువు అపార నమ్మకం!ఉత్తమం సహజావస్థా ద్వితీయం ధ్యానధారణా
తృతీయాప్రతిమా పూజా హోమయాత్రాచతుర్థికా – శివపురాణం

అంటే, భగవంతుని తనలో ప్రత్యక్షం (ఆత్మదర్శనం)చేసుకోవడం ఉత్తమమయినది. భగవంతుని గురించిన జ్ఞానము, ధారణ దాని తరువాతవి. మూడవది భగవంతుని ప్రతిమలను పూజించడం. నాలుగవది పుణ్యక్షేత్రాలను దర్శించడం. చివరి రెండూ సామాన్య భక్తుల కోసం ఉద్దేశించినవి. పరామాత్మ అనుగ్రహం పొందడానికి విగ్రహారాధన ఒక మెట్టు వంటిది.

అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాః పరికల్పితాః – ధర్మనోపనిషత్

సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్థమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది.

ఈ విధంగా ఏర్పడిన విగ్రహారాధన డవార్యదోర్వీర్యంబుఆ మోక్షాన్ని పొందవచ్చు. దీనికి భక్తి ప్రధానం.

భక్త్యా వీణా బ్రహ్మజ్ఞానం న కదా చిదపి జాయతే – మహానారాయణోపనిషత్

పరిపూర్ణమైన భక్తి లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని (ఆత్మజ్ఞానాన్ని) ఏవిధంగానూ పొందలేము.

ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సాధనంగా వారికి ఇష్టమైన దైవ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి. అలా పూజించటం పరబ్రహ్మను పూజించినట్లే అవుతుంది. భక్తులు తఇష్టమైన మకు దేవతావిగ్రహాన్ని నిల్పుకుని ఆ విగ్రహమే ‘పరబ్రహ్మగా’ తలచి, నిశ్చలభక్తితో, శ్రద్ధాశక్తులతో, పరిపూర్ణవిశ్వాసంతో నిరంతరం పూజించితే తప్పనిసరిగా ‘ఆత్మజ్ఞానం’ పొందుతారు.

విగ్రహారాధన ద్వారా మనస్సుని నిశ్చల పరుచుకుని, (మనోనిగ్రహాన్ని పొంది) ఆ తదుపరి ‘నిర్గుణోపాసన’ ఆచరించవచ్చు. అంతేగాని, మనోనిగ్రహాన్ని పొందకుండా నిర్గుణోపాసన ద్వారా ‘ఆత్మజ్ఞానాన్ని’ తెలుసుకోవాలనుకోవటం హాస్యాస్పదం. మనస్సుని అంటే పంచేంద్రియాలను, కామ, క్రోధాది అరిషడ్వర్గములను జయించనివాడు ‘నిర్గుణోపాసన’కు అర్హుడు కాదు. భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో “విగ్రహారాధన” చేసేవారు “పరబ్రహ్మ”ను ఆరాధించి నట్లే అవుతుందని, వీరే పరమ భాగవతోత్తములని శ్రుతులు తెలుపుతున్నాయి.

విగ్రహారాధన చేయకుండానే “పరబ్రహ్మను” ఆరాధించవచ్చు. దీనినే ‘నిర్గుణోపాసన’ అంటారు. కాని నిర్గుణోపాసన సామాన్యులకు సాద్యం కానిది. ఎందువలనంటే మన ఎదుట నిలుపుకున్న ‘దైవవిగ్రహము’ మీదనే, మన దృష్టిని, మనస్సుని తదేకంగా నిలపటం కష్టము. అటువంటప్పుడు నిరాకారుడైన ఆ “పరబ్రహ్మ” పై మన మనస్సుని ఎలా నిలుపగలం. సామాన్యులకు అది సాధ్యం కాని విషయం.

మానవునికి క్షణకాలంలోనే అనేక సంకల్పాలు శరపరంపరలుగా కలుగుతుంటాయి. అటువంటి విపరీత చంచల స్వభావమైన మనస్సును కదలక నిశ్చలంగా ఉండేటట్లు చేయడం చాల కష్టం. కాబట్టి మనస్సును “విగ్రహారాధన” అనే ప్రక్రియలో నిశ్చలపరచి, “మనోనిగ్రహాన్ని” పొందటం అత్యంతావశ్యకం.

కాబట్టి, మనస్సుని నిగ్రహించి, ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందటానికి లేక ‘పరబ్రహ్మతత్త్వాన్ని’ తెలుసుకోవటానికి ‘విగ్రహారాధన’ యే మిక్కిలి ప్రయోజనకారిగా ఉంది.

సర్వవ్యాప్తుడై సర్వభూతాలలో చిద్రూపుడైన ‘పరమాత్మ’ స్వరూపాలకు శిలా, మృత్తిక, దారుకలతో, కళావిన్యాస ప్రక్రియలతో విగ్రహాలుగా తయారు చేసి, ఆ దేవతామూర్తులను మంత్ర తంత్ర సంస్కారములచే ఆవాహన చేసి, ప్రతిష్టించి, వర్ణ, రూప నామములతో మంత్ర, తంత్ర యంత్ర విధులతో సామాన్యులైన భక్తులు పూజించి, భగవదనుగ్రహాన్ని పొందటం శాస్త్ర సంబంధమై ఉంది.

దుర్లభో మానుశోదేహః దేహీనాం క్షణభంగురః
తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనమః

జీవులలో మానవజన్మదుర్లభమైనది. కాని, క్షణ భంగురమైనది. కావున ఆ కొద్ది దుర్లభమైన “దైవ సాక్షాత్కారా”నికి వినియోగించుకోవలెను. ఇది ఉత్తమం. భగవదారాధన పూర్వకమైన విగ్రహారాధన కేవలం వైదికమైన పరలోకప్రాప్తికే కాక శారీరక, మానసికశాక్తులను పెంచుకోవడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. శాస్త్రాలలో అవ్యక్తమని చెప్పబడుతున్న ‘పరమాత్మ’ను ఆరాదిన్చాదానికిగల మార్గాలలో సులభమైంది ఈ ‘విగ్రహారాధన’.

భగవంతుడు సర్వవ్యాపి. ఆ స్వామి అన్నింటా వ్యాపించి ఉన్నాడు. కనుక మనం పూజించే విగ్రహంలో కూడ ఎందుకు లేదు? తప్పక ఉన్నాడు. అందుకే మనకు విగ్రహాన్ని చూడగానే భక్త్యావేశం కలిగి పరవశులం అవుతుంటాం! ఆ విగ్రహరూపం ముందు మన గోడును చెప్పుకుని సేదతీరుతుంటాం

విగ్రహారాధనకు ఆసక్తి, నమ్మకం చాలా ముఖ్యం. భక్తి, ప్రేమలు ప్రధానం. ఆడంబరాలతో చేసె విగ్రహారాధనలకు, అహంకారపూరితమైన భావావేశాలకు ‘పరమాత్మ’ గోచరింపడు. ప్రశాంత చిత్తంతో ఆరాధిస్తూ, నిష్కామంగా దృఢవిశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే తప్పని సరిగా సాక్షాత్కరిస్తాడు. ఆయన భక్తజన పరాధీనుడు.

విగ్రహమనగా విశేషంగా గ్రహించేది. అంటే భగవంతుని శక్తిని, గుణాలను, స్వరూపాన్ని పూర్తిచేసిగా తనలో ఇముడ్చుకొనగలిగినవే “దైవ విగ్రహాలు”. అవి దేనితో చేయబడినప్పటికీ కళావిన్యాస పూర్వకంగా ఉండి, మంత్రశక్తిచే శాస్త్రప్రకారం ప్రతిష్టించబడటం చేత, అవి “భగవంతుని” తత్త్వాన్ని ఆకర్షించుకుని, తమలో నిక్షిప్తపరచుకుని, ఆ శక్తితో అవి ప్రకాశిస్తుంటాయి. కాబట్టి వాటిని ‘అర్చామూర్తులు’ అని అన్నారు.

భగవద్గీతలో ఉదాహరించిన ప్రకారం, ఉపాసింప వీలులేని భగవత్త్వమును సామాన్య భక్తులు ఉపాసించుటకు వీలుగా విగ్రహారాధన రూపొందింది. అందరికి అందుబాటులో ఉండి, సులభసాధ్యమైనది ఈ విగ్రహారాధన.

సర్వాంతర్యామియైన భగవంతుడు కేవలం తపఃసంపన్నులను, యోగులకే చూడ సాధ్యమవుతాడు. ఆకారణంగా సామాన్యులకు ‘అర్చావతారవిగ్రహా’లే శరణ్యమవుతున్నాయి.

విగ్రహాలలో భాగాచ్చక్తి నింపటానికి మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సాధనములు ఉన్నాయి. భగవతత్వం ప్రప్రథమంగా శబ్దంచే గ్రహింపబడుతుంది. భగవద్రాహకమగు శబ్దమేది ఉందో, అదే ఆ దైవం యొక్క మంత్రంగా నిలుస్తోంది.

నిత్యపూజాగృహములయందు పూజావిగ్రహాలు 4 అంగుళాలు మొదలు 12అంగుళాల వరకు ఉండాలి. పూజా ప్రతిమలు రత్నాలతో తయారైనవైతే అత్యుత్తమం. ఆ తరువాత బంగారం, వెండి, రాగి లోహాలతో విడివిడిగా గాని, ఈ లోహములన్నింటిలో కలిపి గాని (పంచలోహాలు) చేయుంచుకోవటం ఉత్తమం. రాయితో తయారైనవి మధ్యమం, చెక్కలతో తయారైనవి అధమం. దైవపటాలకన్నా విగ్రహాలు శ్రేష్ఠం. అందులోనూ పంచలోహాల విగ్రహాలు గాని, శిల, దారు, మృత్తికావిగ్రహాలు కాని, శక్త్యానుసారంగా ఉపయోగించుకోవచ్చు.

దైవవిగ్రహాలు చూడటానికి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనస్సుని ఆకట్టుకునే విధంగా, కళాత్మకంగా, సుందర మనోహరంగా తీర్చిదిద్దిఉండాలి.

ఇంట్లో ఈశాన్యభాగంలోగాని, ఉత్తర, తూర్పుభాగాలలోగాని పూజామందిరాన్ని ఏర్పరచుకోవాలి. పూజామందిరంలో ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాలలో ఉన్నతమైన స్థలంలో గాని, ఎత్తైన పీఠంపైగాని పూజావిగ్రహాలను ప్రతిష్టించాలి. దైవవిగ్రహాలకు ఎదురుగా కూర్చుని పూజించరాదు.

సగుణ జ్ఞానహీనస్య నహినిర్గుణ వేదనమ్
నందిదర్శన హీనస్య యథా న శివదర్శనమ్

ఎలాగైతే నంది దర్శనాన్ని చేయలేనివాడు శివదర్శనాన్ని చేయలేకపోతాడో, అలాగు సగుణజ్ఞానంలేనివానికి నిర్గుణజ్ఞానం సిద్ధించదు. పెద్దఆకారంతో గర్భగుడికి బైటనున్న నందీశ్వరుని చూడజలని అశక్తుడు చీకట్లో చిన్నదిగా ఉన్న శివలింగాన్ని ఎలా చూడగలడు? అని శివపూరానం చెబుతోంది. అందుకనే సగుణరూపంలో మనకోసం భూలోకానికి విచ్చేసి కొలువైన దైవాలను నియమనిష్ఠలతో పూజించి వారి ముందు మన లోరికలను ఉంచి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మన జన్మలను ధన్యం చేసుకుందాం.

హిందూమతంలో పధానమయినది ఏకేశ్వరభావాన. ఏ దేవుని పూజించినా ఆ పూజలన్నీ ఏకేశ్వరునికే చెండుతాయన్నది ప్రతి ఒక్క హిందువు అపార నమ్మకం!
Read More

మనది పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. ఇక్కడ పవిత్రనదులు సజీవంగా ప్రవహిస్తున్నాయి.

మనది పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. ఇక్కడ పవిత్రనదులు సజీవంగా ప్రవహిస్తున్నాయి. మహోన్నత పర్వతాలున్నాయి. ప్రాచీనమైన సభ్యతా - సంస్కృతులు విరాజిల్లుతున్నాయి. మానవజీవనానికి అనువైన శీతోష్ణ స్థితి వుంది రమణీయ ప్రకృతి శోభిల్లుతూ ఉన్నది. వనరులు ఎనెన్నో సమృద్ధిగా ఉన్నాయి. పరోపకారంమిదం శరీరం అన్న ఆర్యోక్తికి అంకితమై అజరామరులైన తపోధనలు, ఋషులు, యోగులు, సిద్ధులు, కవులు, కళాకారుల గురించి మన మెరుగుదుము. ఈ అఖిల జగతిని సుఖంగా, క్షేమంగా వుంచగల శాశ్వత సూత్రాలకు ఆచార సంహితను ‘్ధర్మం’ అని నామకరణం చేశారు. దీనినే మానవధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్నారు. హిందూ ధర్మం ఓ ప్రవక్తవల్లనో, ఓ వ్యక్తి తపస్సు వల్లనో ఏర్పడింది కాదు. అనేకవేల సంవత్సరాల సాధనలోంచి, కాలక్రమేణా ఆవిర్భవించిన మహాధర్మమిది. ఎందరో యోగిపుంగవుల, ఋషుల, దార్శనికుల ఆత్మజ్ఞానానికి ప్రతీకలైన వేదాలు ఉపనిషత్తులు పురాణగాధల రూపంలో ఆవిష్కృతమైన జీవన విధానమిది.
హిందుత్వం నిజానికి జీవితానికి - ప్రకృతికీ సంబంధించిన ఆధ్యాత్మిక మార్గం. మన ఆధ్యాత్మిక సంపదను వేదాంతమన్న పేరూ ఉంది. వేదాంతంలో మోక్షం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, పరబ్రహ్మ, సృష్టికర్త, ఆత్మ, ప్రకృతి, కర్మసిద్ధాంతం, పునర్జన్మ బంధనాలు, స్వేచ్ఛ మొదలైన అనేక అంశాలపైన చర్చలుంటాయి. తాత్విక చింతన యోగవిద్య వీటిలో అంతర్లీనమై ఉంటాయి. అసలు వేదాంతమే హిందూ ధర్మసారం. ఇలా రూపుదిద్దుకున్న హిందుత్వం అందించిన జీవన రచనా విధానం వల్లనే హిందూ సమాజం ‘చిరంజీవి’ అయింది.
బాధాతప్తుల బాధను దూరం చేయడమే మానవుడి పరమధర్మమని మనధర్మం చెబుతోంది.మానవజన్మ లభించినందుకు మనం గర్వించాలి. పొంగిపోవాలి. ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. మనకర్మలే మన జీవితాన్ని ఆదేశిస్తాయన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది హైందవ దృక్పథం. ఇహపరాల సంగతి సరే - నేటి మన రాజకీయ, సామాజిక, ఆర్థిక నైతిక సమస్యలకు పరిష్కారమార్గం చూపగలిగే మహత్తర శక్తి మన హిందూ ధర్మచింతన ప్రసాదిస్తున్నది. ఈ దుర్లభమైన మానవజన్మను సద్వినియోగపరచుకోవాలంటే ఐహిక ప్రలోభాలకు తలొగ్గక, ఆత్మజ్ఞానాన్నీ, ఆత్మతతాత్త్వన్నీ ఆకళింపు చేసుకుని, హైందవ తాతిత్వకతను అవగాహన చేసుకోవాలి. తన జీవితానికి అన్వయిపరచుకోవాలి. తన జీవన కాలంలోని ప్రతి క్షణాన్నీ హైందవ ధర్మాచరణకు అంకితం చేసుకోవాలి.
Read More

మహాలక్ష్మి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత. ఆ జగజ్జనని సుందరమైన రూపాలలో ప్రాచీన ద్రష్టలు ఆరాధించారు.మహాలక్ష్మి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత. ఆ జగజ్జనని సుందరమైన రూపాలలో ప్రాచీన ద్రష్టలు ఆరాధించారు.

పుత్ర పౌత్ర ధనం ధాన్యం మస్త్యశ్యాజానిగోరథమ్‌
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతు కరోతుమాన్‌

అని అన్నారు. అంటే, సహజంగా లక్ష్మీదేవి ధనాన్ని అనుగ్రహిస్తుందని అంటుంటారు. అయితే, ఆ మాత...పుత్రులను, పుత్రికలను, మనునళ్లను, మనుమరాళ్లను, ధనాన్ని, ధ్యాన్యాన్ని, వాహన సౌకర్యాన్ని ఇవ్వడంతోపాటూ, వాటన్నింటినీమించి ఆయుష్షును ఇస్తుందని శ్రీసూక్తం చెబుతోంది.

సువర్ణవర్చస్సుతో భాసించే మహాలక్ష్మీమాత, పూర్ణవికసిత పద్మంపై చతుర్భుజాలతో ఆసీనురాలై ఉంటుంది. పైనున్న రెండుచేతుల్లో పద్మపుష్పాలు ఉంటాయి. పద్మం సౌందర్యానికి, నిర్మలత్వానికి పసిడిపంటల శోభకు సంకేతము. ఆమె ఆసీనురాలై ఉన్న పద్మం బురద నుండి ఆవిర్భవిస్తుంది. ఎటువంటి వాతారణంలోనైనా పూర్ణవికాసం చెందగల మనలోని అపరిమితశక్తికి ఆ పుష్పం సంకేతం. ఆ పద్మం చుట్టూ నీరు ఉంటుంది. ఆ నీరు జీవశక్తికి సంకేతం. నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించకపోతే, ఆ నీరు చెడిపోతుంది. అలాగే ధనం ప్రవహిస్తూ ఉండాలి. ధనం ఒకచోట నుండి మరో చోటుకు మారినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది.

లక్ష్మీదేవి సుసంపన్నతను, తేజస్సును వెదజల్లుతుంటుంది. మన జీవితాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే ఆ జగన్మాత ఆకాంక్షిస్తుంటుంది. ఆమె నాలుగు హస్తాలు ధర్మార్థకామ మోక్షాలకు సంకేతాలు. ఆ హస్తాలు మన జీవితాలకు బంగారు పునాదులు. లక్ష్మీదేవి కుడి హస్తం నుండి బంగారు నాణేలు వర్షిస్తుంటాయి. ఆ తల్లి కరుణ మనకు లభిస్తే, మన జీవితాలు సువర్ణమయం అని ఆ నాణేలు గుర్తుచేస్తుంటాయి. ఇక ఆ తల్లి ఎడమ చేత్తో పట్టుకున్న సువర్ణకలశం సుభీక్షానికి ప్రతీక. ఆమె ఆకుపచ్చని రంగు చీరను ధరిస్తుంది. పచ్చపచ్చని పొలాల పంటల సిరికి, అభివృద్ధికి, ఆ హరితాంబరం సంకేతం. ఒక్కొక్కసారి ఆమె ఎరుపురంగు చీరలో దర్శనమిస్తుంది. ఎరుపురంగు కార్యశీలతకు, ప్రకృతిశక్తికి సంకేతం.

ఆమె కుడి, ఎడమల రెండు తెల్లటిఏనుగులు నిలబడి నీటిని విరజిమ్ముతుంటాయి. ధర్మబద్ధంగా, విజ్ఞత, జ్ఞానం, వినిర్మలతలతో ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను పొందేందుకై ప్రతివ్యక్తి చేసే నిరాటంక ప్రయత్నానికి ఆ జలధారలు సంకేతాలు. మహాలక్ష్మి చిత్రపటాలలో అప్పుడప్పుడు ఓ తెల్లని గుడ్లగూబను చూస్తుంటాం. ఇందులో రెండు ప్రతీకలున్నాయి. ఒకటి విజ్ఞతకు, అదృష్టానికి సంకేతము. రెండు, తెలివితక్కువ తనానికి ప్రతీక. సక్రమంగా నిర్వహించని సంపద అదృశ్యమైపోతుందని ఆ సంకేతార్థం. లక్ష్మీదేవి గర్వం, అహంకారాలను క్షమించదు. అందుకే ఆమె చంచల అయింది. క్రూరబుద్ధి, నాస్తికులు, కృతఘ్నులు, పాపాత్ములు, అబద్ధాలు ఆడేవారు, అయుష్షులయందు తాను కరుణ చూపనని చెప్పిన వారిని కాక, లక్ష్మీదేవి సత్యాన్ని పలికేవరు, పరిశుభ్రతను పాటించేవారు, గురుభక్తి, గర్వం లేనిపుణ్యాత్ములు, నిశ్చలబుద్ధిగలవారు, జ్ఞానులు, తపస్సు, దానం చేసేవారు, బ్రహ్మచర్యం పాటించేవారు, దయాగుణం గలవారిని అనుగ్రహిస్తానని చెప్పింది. లక్ష్మీ అనే పదం లక్ష్యం అనే పదాఅన్ని కూడ సూచిస్తుంది. ఒక ప్పష్టమైన లక్ష్యం, గమ్యం ఉన్న వారికే ధనం లభిస్తుంది.

లక్ష్మీదేవి ఆవిర్భావం

లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే, క్షీరసాగర మథనానికి ముందటి పరిస్థితులను తెలుసుకోవాలి. ఆ కాలంలో స్వర్గాధిపతియైన ఇంద్రునిలో అమితమైన గర్వాతిశయం పొడుసూపింది. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా, ఎదురుగా దుర్వాసమహర్షి తారసపడతాడు. అల్లంతదూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు, అమరావతి అధిపతికి గౌరవసూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు, దండ నిచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞత చెప్పకుండా, ఆ దండను తన ఏనుగు తొండడానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ, ఇటూ ఆడిస్తూన్న ఏనుగు, దండను కిందికి విసిరేసి కాళ్ళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు, ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపావేశ పూరితుడై, "ఓయీ ఇంద్రా! మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను, ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి" అని శపించాడు.

అప్పుడు ఇంద్రుని కళ్ళకుకప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాసమునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు, శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వవైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తారు. ఇంద్రుని అతని పరివాంతోపాటు స్వరం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి, తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో, ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుముర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో, అందరూ విష్ణుసన్నిధికి చేరుకుంటారు.

ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి, రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి, అందునుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందరపర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపములో మందరపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యివతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువమాలతో ఉదయిస్తుంది. ఆమె అక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి, నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జనించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోను ఆయన సరసనే ఉంటుంది.

చంచల స్వరూపిణి

లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ర్టుని ముందు నిలిచిన దుర్యోధనుడు, పాండవులపట్ల తనకు గల అక్కసునంతా వెళ్లగక్కుతాడు. పాండవులు అలవిలేనంత సంపదల మధ్య తులతూగిపోతున్నారనీ, లెక్కలేనంతమంది భృత్యులతో, రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారనీ, చెప్పాలంటే సంపదలో కుబేరుని కూడ మించిపోయారని, వారిని మించాలంటే తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తారు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు, పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతినియమాలతో ప్రవర్తించాలనీ, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు. అవును. ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ, అతడు నడిచిన బాట నైతిక ఋజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని ఋజువర్తనం మనకు ఇంద్రుని ఉదంతం ద్వారా తెలుస్తోంది.

ఒకసారి విషయవాంఛలతో విసిగి వేసారిపోయిన ఇంద్రుడు, తన గురువు బృహస్పతిని కలిసి, తను కోల్పోయిన సంతోషాన్ని ఏవిధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్నివిధాలైన సంతోషాలకు మూలమనీ, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరోసందేహం. విజ్ఞానం కంటే గొప్పదైన విషయము ఏమైనా ఉందా అని, అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసగురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా, అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరకెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటిని ప్రశ్నించగానే, తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటంవల్ల సమాధానం చెప్పే తీరికలేదన్న ప్రహ్లాదుడు, తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు, ఏదో ఒకరోజు వీలుచిక్కినప్పుడు, ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటివరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూగడుపుతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప, ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు.

"రాజుగా నా స్థాయిని తలచుకుని నేను ఏనాడూ గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ, గురువులు, పెద్దలపట్ల గౌరవభావాన్ని కలిగివుంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం". ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుని సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరంకొమ్మంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక ఋజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు 'సరే' నని ఒప్పుకోగానే, అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది.

"నేను నీలోని నీతివంతమైన నడవడిని, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివశిస్తానని చెప్పి, ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలోనుంచి బయల్వెడలిన మరో జ్వాల, తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండా ఉండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం, తాను నిజాన్ని అని, ధర్మబద్ధాతతో ఉంటానని చెప్పి వెళ్లిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరగా ధవళకాంతులతో మెరసిపోతున్న ఓ దేవత బయటకొచ్చి, తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలంనీవెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయట పడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం నైతికబద్ధ ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకు అర్థమవుతోంది.

లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమైఇళ్ళను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్తజనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.
Read More

సింహాచల క్షేత్రమహత్యంసింహాచల క్షేత్రమహత్యం
ఆదికాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 'సింహాచలం' ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రం. కైలాసంగా పిలవబడే ఈ పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తున, విశాఖ పట్టణానికి ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశం అధికభాగం అడవులు, కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండల సముదాయం నీటిధారలతో, సన్నని కాలువలతో కూడివుంది ఇందులో ముక్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార. మరికొన్ని ముఖ్యమైన ధారలు సీతమ్మ ధార, సింహాచలధార, మాధవధార, ఇందులో సింహాచల ధార అన్నిటికన్నా పెద్దది. సింహాచలం అంటే 'సింహం యొక్క కొండ' అని అర్థం. ఇది విష్ణువు నాలుగవ అవతారమైన నరసింహుని కొండగా భావించబడుతోంది. "సర్వం విష్ణు మయం జగత్'' అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీవరాహ నరసింహస్వామి. యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా, వేదాద్రిలో లక్ష్మీనరసింహుడుగా, నరసింహస్వామి వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తారు. దశావతారాలలో విడి అవతారాలైన వరాహ, నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహనరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. వరాహ ముఖం, మానవశరీరం, సింహతోకతో కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు. ఇక్కడి ప్రజలు స్వామివారిని "సింహాద్రి అప్పన్న'' అని పిలుస్తారు.

బయటనుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది. మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమరముఖంగా ఉంటుంది. పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలయిన మూడు ప్రాకారాలతో, అయిదు ద్వారాలతో, నాట్య, ఆస్థాన, భోగ మంటపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. సంతాన గోపాలయంత్రంపై ప్రతిష్టింపబడిన కప్పస్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడివారి విశ్వాసం. ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు. వాటినే షడ్బేరులు (ఆరు) అంటారు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు. ఉత్సవమూర్తి గోవిందరాజులు, కౌతుక మూర్తి మదనగోపాలుడు, శయనమూర్తి వేణుగోపాలుడు, స్నపన (స్నానంచేసే మూర్తి), యోగానంద నరసింహుడు, బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాల క్రిందే లెక్క. ఆయా శరీరాలతో, ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ ఉంటారన్నమాట. మూల విరాట్టు శిలావిగ్రహం కాగా, మిగిలినవి లోహమూర్తులు.

మూలవిరాట్టు :

మూలవిరాట్టు 'వరాహనరసింహ' ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో, లింగాకారంలో దర్శనమిస్తాడు. ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. ఏడాదిలో ఒక్క అక్షయతదియ (వైశాఖశుద్ధ తృతీయ) రోజు మాత్రమే కొద్ది గంటలసేపు స్వామివారిపై ఉన్న పూతను ఒలిచి, నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. అప్పుడు త్రిభంగి భంగిమలో రెండుచేతులతో, వరాహ ముఖంతో, నరుని శరీరంతో, సింహ తోకతో స్వామివారు దర్శనమిస్తారు. మూలవరులకి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. పద్మాసనంలో కూర్చుని, చేతిలో పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు (లక్ష్మీ)కి, ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి. ఆళ్వారులకు ఈ ఆలయంలో గౌరవస్థానం కల్పించబడింది. ఇక్కడ భగవద్రామానుజులు, మణవాళ మహాముని, విష్వక్సేన సన్నిధులు కూడా ఉన్నాయి. వారి జన్మ నక్షత్రాలలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది. వైశాఖ, జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణమండపం కూడా ఉంది. ఈ ఆలయానికి రెండు పుష్కరిణిలు ఉన్నాయి. ఒకటి స్వామి పుష్కరిణి, మరొకటి వరాహ పుష్కరిణి. ఇది కొండ కింద భాగంలో ఉంది. విశేషమైన పండుగ ఉత్సవాలలో స్వామికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. కొండ క్రింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండుగ సమయాలలో ఊరేగిస్తారు. 'గంగధార'కు వెళ్ళే దారిలో శ్రీత్రిపురాంతక, త్రిపురసుందరి ఆలయం ఉంది. శ్రీత్రిపురాంతక స్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు. గంగధార ప్రక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు. గుడికి వెళ్ళే మార్గంలో శ్రీకాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణదేవీల సన్నిధి ఉంది. హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది.

దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాలవలెనే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. ఈ స్థల పురాణం 32 అధ్యాయాలుగా విభజింపబడింది. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు. పురాణాల కథనం ప్రకారం, ఇది త్రేతాయుగానికి చెందినది. మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వార పాలకులైన జయ, విజయలు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా జన్మిస్తారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను హింసిస్తుండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు. సోదరుని మరణవార్తతో హిరణ్యకశిపుడు క్రోధుడై దేవతలను, ఋషులను, హరిభాక్తులను హింసిస్తుండగా శ్రీమహావిష్ణువు తన సేవకుల్లో ఒకరైన సుముఖున్ని హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించమని ఆదేశించగా, అతడు ప్రహ్లాడునిగా జన్మించి, చిన్నతనంనుండే విష్ణుభక్తుడు అయ్యాడు. ఇది సహించక హిరణ్యకశిపుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదున్ని సముద్రంలో పడవేసి, అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.

అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా స్వామి వచ్చి రక్షిస్తాడు. ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది. ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష, హిరణ్యకశిపులని వధించిన అవతారాలైన వరాహ, నారసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామి ఇక్కడ వెలిశాడు. భక్తితో ప్రహ్లాదుడు స్వామికోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహనృసింహ స్వామిని పూజించినట్టు పురాణ కథనం. కృతయుగం చివరిలో ఈ ఆలయం నిరాదరణకు గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయింది. తరువాతి యుగంలో చంద్రవంశ రాజు వురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ప్రహ్లాదుని కథ విష్ణుపురాణంలోను, భాగవతంలోను ప్రస్తావించబడింది. సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను, అహోబిలం హిరణ్యకశిపుని వధించిన తరువాత వెలసిన క్షేత్రంగాను పురాణ కథనం.

ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు :

ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి. కల్యాణోత్సవం, చందనోత్సవం, ధనుర్మాస ఉత్సవం, వారోత్సవం, మాసోత్సవం జరుపుతారు. చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలలనుండి భక్తులు వస్తారు. వైశాఖ మాసంలోని అక్షయతృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు. ఇది శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు. ఈ రోజు స్వామికి చందనం సమర్పించినవారికి, దర్శించినవారికి మోక్షం, ఆనందం కలుగుతాయి. స్వామివారి చందనం తెల్లవారుఝామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తరువాత సాయంత్రం మళ్ళీ చందనపూత వేస్తారు. పన్నెండు మణుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు. అవి నరసింహ జయన్తి, ఆషాడ శుద్ధపూర్ణిమ, జ్యేష్ఠ శుద్ధ పూర్టిమ.

ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు. స్తంభాల మీద రకరకాల నరసింహ మూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు. శ్రీవరాహ స్వామికి, శ్రీనరసిహునికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం సింహాచలం ఒక్కటే. రెండూ స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారనే అభిప్రాయం ఉంది.
Read More

మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం.మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం.

మనం మనకు ఈ స్తూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.
ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు 'కఠోపనిషత్తు' లో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు.నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు. ఎదో మంచి జీవితం మంచి భార్యా తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడ తెలుసుకునేంత సమయం లేదు. కాని ఎదో ఒక రోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే వుంటుంది, అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడ మనం గమనించే పరిస్తితులలో ఉండము.
మరణం తరువాత ఏమి జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని వుంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి వుంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి వుంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు.
ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని వుంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో.ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్దిని అదుపులో వుంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకొని నువ్వు విముక్తడవు అయి వుంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు.ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
కాని మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినయో లేదో. కావున మనం మన ఈ స్తూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు వుండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు, మనస్సు అనేదే ఒక భ్రమ అని . అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవున్ని (పరమాత్మను) మన హృదయంలో దర్శించుకోవడమే.
ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికీ మరల యేయే జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి వుంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేసిస్తాయి.
అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికి తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.
Read More

కఠోపనిషత్తు లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.కఠోపనిషత్తు లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.

వాజశ్రవుడు (ఉద్దాలకుడు) అను బ్రాహ్మణుడు ఒక యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగం లో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి. కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను, గొడ్డులను, ముసలి ఆవులను దానం చేయసాగాడు. ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా! నేనూ నీకు గల సంపదనే కదా. మరి నన్ను కూడా దానం చెయ్యి" అన్నాడు. దీన్ని ఒక బాల్యచేష్ట గా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు. కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను" అని అన్నాడు.(ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).


కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు. అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా! ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్య దోషం వస్తుంది. మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి." అని యముని వద్దకు వెళ్ళాడు.

నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయం లో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు. నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రోజులు నిరాహారంగా ఉన్నాడు. యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథిని మూడు రోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను. అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.

అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా! మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి (ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి) మరియు అతని పాపాలన్నీ పోవాలి. రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని, దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు. యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేత యజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు. ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి మరియు బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు. యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన, వస్తు, కనక, వాహన, కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు. కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.

తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.

ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.
Read More

ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్1||శ్లో|| శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !

యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||


తా: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.


2||శ్లో || బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత

లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ ||


తా: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.


3||శ్లో || సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |

వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.


4||శ్లో || సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |

ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.


5||శ్లో|| సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,

దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.


6||శ్లో|| సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః

ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.


7||శ్లో || సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :

నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.


8||శ్లో|| సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |

ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.


9||శ్లో|| సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||

ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.


10||శ్లో || సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,

త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.


11||శ్లో|| సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|

ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.


12||శ్లో|| సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |

ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ


13||శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.


14||శ్లో|| బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |

ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.


15||శ్లో|| అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:

మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.


16||శ్లో|| లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప

బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా: ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.


17||శ్లో || ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|

భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా: ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.


18||శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.


19||శ్లో|| ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|

త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.


20||శ్లో|| వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య

హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||


తా: ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము


21||శ్లో|| ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |

శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా: ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.


22||శ్లో|| మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |

విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా: నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !


23||శ్లో|| శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |

సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||


తా: సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.


24||శ్లో|| యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,

లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||


తా: మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.


25||శ్లో|| శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |

త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||


తా: ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.


ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్
Read More

సనాతన ధర్మాన్ని పాటించే వారికి భగవద్గీతే ఆదర్శంముక్తిర్మోక్షోమహానందః మహానందమే మోక్షము అని అమర కోశం నిర్వచనం. దుఃఖం కొంచమైనా లేని ఆనందమే ముక్తి. సనాతన ధర్మాన్ని పాటించే వారికి భగవద్గీతే ఆదర్శం. అనుసరణీయం. గీత 14వ అధ్యాయం రెండవ శ్లోకంలో భగవానుడిలా చెప్పాడు
ఇదం జ్ఞానము పాశ్రిత్యమమ సాధర్త్య మాగతాః
సర్గేపినోపజాయంతే ప్రలయే నవ్యధంతిచ

ఈ గుణత్రయ విభాగ యోగంలోని జ్ఞానమును పొందినట్లైతే భగవత్సాయుజ్యమును పొంది, సృష్టి సంహారాలకు లోనుకాదు. సాధర్మ్యము అనగా సాయుజ్యమే మోక్షమని గీత నిర్వచించింది. ఇలా 9వ అధ్యాయం చివరి శ్లోకంలోను, 18వ అధ్యాయం 65వ శ్లోకంలోను భగవానుడిలా చెప్పాడు. మన్మనాభవ మద్భ క్తోమద్యాజీ మాం నమస్కుడు, మామే వైష్యసి...నాపై మిక్కిలి ప్రీతి కలవాని మీద నాకు కూడా మిక్కిలి ప్రీతి ఉంటుంది.


ఇది సహజమే గదా! అటువంటి నా భక్తుని ఎడబాటును సహించలేక అతన్ని నా వద్దకు చేర్చు కుంటాను. పరంబ్రహ్మ సాయుజ్యమే మోక్షమని నిశ్చయంగా చెప్పేం గీతా సిద్ధాంతాన్ని రామానుజదర్శనం సమర్ధిస్తూంది. ముక్తుడు పరమపదంలో నారాయనుడితోపాటు అతని కల్యాణ గుణాలను సంతృప్తిగా ఆనందంగా అనుభవిస్తాడు.

రామానుజ దర్శనంలో, తన రక్షణ భారాన్ని భగవంతునిపై ఉంచిన ప్రపన్నుని సర్వ పాపాలను పరిహరించి పరమాత్మ తన స్థానమైన వైకుంఠమున చేర్చుకొను విధానము, 'సంత్సంగాత్ భవ నిస్పృహా గురు ముఖాత్, ముక్త్కోర్చర్ధిన పూర్వపక్ష...' అనే రెండు శ్లోకాల్లో విరింపబడింది.

సత్సంగం వల్ల సంసారములో వివక్తుడై సదాచార్య సమాశ్రయణం చేసి, వారి మంత్రోపదేశానుసారం శ్రియః పతిని శరణాగతి చేసి, ఆగామి కర్మ తామరాకుపైన నీటిబొట్టులా అంటకుండా చేసికొని, నిప్పులో పడిన దూదివలె సంచిత కర్మను భస్మం చేసి, ప్రారబ్ధ శేషమును అనుభవించి, తన ఉపాసనా అతిశయముచే ప్రసన్నుడైన పరమాత్మ ప్రకృతి బంధాన్ని నిశ్శేషం చేయగా, సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంథ్రమును చేధించుకొని వెలుపలికి వచ్చి అర్చిరాది మార్గంలో పయనించి పరమపదం చేర గలడు. ఈ పద్ధతి అంతా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము 24 నుంచి 27వ శ్లోకం వరకు సంగ్రహంగా సూచించబడింది. అదే ముక్తి ఫల స్వరూపం.
Read More

* ‘భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే

* ‘భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘
* సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.
* సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.
* ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.
* ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.
Read Moreశివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

1.ఉపవాసం

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.

2. జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

3. మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.

ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.

4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

5.జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.

6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

పూర్తి వివరాలకు బ్లాగు సందర్శించండి:
Read More

శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. అహంకారమమకారాలు ఎంతటి పనినైనా చేయిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ, తన ఆధిపత్యం కోసం 'తాను లింగం యొక్క పైభాగాన్ని చూసినట్ట్లుగా దొంగసాక్ష్యం చెప్పమన్నాడు. అబద్ధం చెప్పడం పాపం అంటుంది మొగలి పువ్వు. తాను సృష్టికర్తననీ, తన ఆదేశాలనీ పాటించితీరవలసిందే అన్నాడు. చేసేది లేక అసత్యపు సాక్ష్యానికి కేతకీ పుష్పం ఒప్పుకుంది.

ఇంతలో కామధేనువు కనపడింది. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగగా, ఈ దివ్యజ్యోతిర్లింగాన్ని దర్శించి వస్తున్నా అని చెప్తుంది బ్రహ్మతో. నువ్వు దీనీ అగ్రభాగం చూశావా? అని అడుగగా, చూశాను అంటుంది. అయితే నువ్వు కూడా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంటాడు.

తాము మొదటి నిశ్చయించుకున్న ప్రదేశానికి మొగలిపువ్వు, కామధేనువుతో చేరుకుంటాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను, లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, తానే గొప్పవాడినని, కామధేనువు, మొగలిపువ్వులే సాక్ష్యాలని చెప్తాడు. ఎప్పుడు, ఎవరు ఏమి చెస్తున్నారో ఆ పరమాత్ముడికి తెలియదా?.

అప్పుడు ఆ లింగం నుంచి 'ఓం','ఓం','ఓం' అని ప్రణవం వినిపిస్తుంది. లింగం యొక్క దక్షిణభాగం నుంచి అకారం, ఉత్తరం నుంచి మకారం, దాని తరువాత నాదం వినిపిస్తున్నాయి. అదే ఓంకారం. వెంటనే ఆ దివ్యలింగం నుండి ఒక మహాశక్తి పుట్టింది. 10 చేతులతో, తెల్లని వర్ణంతో, 5 తలలతో, త్రిశూలం, ఢమరుకం ధరించిన ఒక దివ్యమైన, సుందరమైన ఆకారం ఏర్పడింది. ఆయనే పరమశివుడు. అబద్దం చెప్పిన బ్రహ్మ మీద పరమేశ్వరునికి కోపం కట్టలుతెంచుకుంది. ఆయన కోపం నుండి వీరభధ్రుడు పుట్టాడు. అసత్యాలు పలికితే ఎమవుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో ఇది తెలియజేస్తుంది. అబద్దం చెప్పిన బ్రహ్మ ఇదవ తలను నరికేశాడు వీరబధ్రుడు. బ్రహ్మనే హతమారుద్దాం అనుకున్నాడు, కానీ, బ్రహ్మ పశ్చాతాపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ భీఖర సన్నివేశం చూడలేక బ్రహ్మను కాపాడమని ‪#‎విష్ణువు‬ కూడా శివుడిని వేడుకున్నాడు.‪#‎బ్రహ్మను‬ వదిలేశాడు వీరభధ్రుడు.

అబద్దం చెప్పిన మొగలిపువ్వు భయంతో వణికిపోతోంది. దాని వైపు చూసిన శివుడు, నీవు అసత్యం పలికినందుకుగానూ నువ్వు నా పూజకు పనిరావు, నీతో నేను పూజింపబడను అని శపించాడు. అందుకే మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు. చేసిన తప్పు తెలుసుకుని భాధపడి ఈశ్వరుని వేడుకుంది మొగలిపువ్వు. చేసిన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి నీవు నా పూజకు అర్హత కోల్పోయినా, నా పూజల కొరకు చేసే అలంకారాల్లో వాడబడతావు అన్నాడు.

‪#‎శివుడు‬ కామధేనువు వైపు చూస్తూ "కామధేనువు బ్రహ్మ అగ్రభాగం చూసినట్టూ నిలువుగా తన తల ఊపింది. కాని తోక మాత్రం అబద్దమని చెబుతు అడ్డంగా ఊపింది. అందువల్ల ఆవు తోక భాగం పూజనీయమవుతుంది. ఉదయం లేవగానే ఎవరు ఆవు తోక భాగం చూస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా దాని మొహం చూస్తే దరిద్రం పడుతుంది" అని పలికాడు సదాశివుడు.

నిజాయతీగా నిజం ఒప్పుకున్న విష్ణువును చూసి, ఆనందపారవశ్యంతో నువ్వు సర్వలోకములయందు నాతో సమానంగా పూజింపబడతావు అంటూ వరం ఇచ్చాడు. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. శివుడికి, విష్ణువుకు బేధం లేదు. వాళ్ళను ఇద్దరుగా వేరు చేసి చెప్పడం కూడా దోషం అవుతుందేమో. శివకేశవులు కలిసి ఆడిన మహానాటకం ఇది. అసత్యం పలికేవాళ్ళకు ఏ గతి పడుతుందో చెప్పడానికి, సత్యంగా, నిజాయతీగా బ్రతికేవాళ్ళకు సాక్షాత్తు భగవంతునికి సమాన స్థానం వస్తుందని తెలియపరచడానికి వారు ఆడిన దివ్య క్రీడ ఇది.

అటు తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని పూజించారు.

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల బాసిత శోభిత లింగం
జన్మజ దుఖః వినాశక లింగం
తత్ప్రణమామి సదా శివలింగం

ఆఖరున శివుడు, బ్రహ్మ, విష్ణువులతో మనం ముగ్గురం ఒకే శక్తి యొక్క వేర్వేరు తత్వాలము. మన ముగ్గురికి ఎంత మాత్రమూ తేడా లేదు అని పలుకుతాడు.

ఈ మహాలింగం ఉద్భవించిన రోజే శివరాత్రి. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలోనే మహాశివుడు దివ్య లింగంగా ప్రకటితమయ్యాడు. అందుకే శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.

ఓం నమః శివాయRead More

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుటదుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట
మరల అత్రి మహా ముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో జేర దీసి యింకను ఇట్లు చెప్పెను. "ఓ దుర్వాస మని! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమై నవే. నేను అవతారము లె త్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను గాన, అందులకు నే నంగి కరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యిం ట భుజింపక వచ్చినందులకు అతడు చింతా క్రాంతుడై బ్రాహ్మణ పరిఒ వృ తుడై ప్రాయో పవేశ మొనర్ప నెంచినాడు. ఆ కారణమూ వలన విష్ణు చక్రము నిన్ను భాదింప బూనెను. ప్రజా రాక్షనమే రాజా ధర్మముగాని, ప్రజా పీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింప వలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధను ర్బా ణములు ధరించి ముష్క రుడై యుద్ద మునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించా కూడదు. బ్రాహ్మణా యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించు వాడును హింసింప చేయు వాడును. బ్రాహ్మణ హితకులకి న్యాయ శాస్త్రములు ఘోషించు చున్నవి. బ్రాహ్మణుని సిగ బట్టి లాగిన వాడును, కలోతో తన్నిన వాడును, విపర ద్రవ్యమును హరించు వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విపర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మ హ౦ తుకులే అగుదురు. కాన, ఓ దుర్వాస మహర్షి! అంబరీషుడు ని గురించి - తప శ్శాలియు, విప్రోత్త ముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందు చున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడ నా యితినే- యని పరితాపము పొందు చున్నాడు కా బట్టి, నీవు వేగమే అబరిషుని కడ కేగుము అందు వలన నీవు భయులకు శాంతి లభించును" అని విష్ణువు దుర్వసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలిసప్త వి ౦ శో ధ్యాయము- ఇరవ య్యే డవ రోజు పారాయణము సమాప్తము.
Read More

అన్నం పరబ్రహ్మ స్వరూపంఅన్నం పరబ్రహ్మ స్వరూపం

భగవంతుడు, ప్రారబ్ధం వదిలించుకొని పరమాత్మ యందు ఐక్యం కావడానికే మానవ దేహం ప్రసాదిస్తాడు. కానీ; మన ఇంద్రియాలద్వారా వివిధ అపవిత్రమైనకార్యాలు చేస్తూ, అశుద్ధఆహారాన్ని స్వీకరిస్తూ, చివరికి ఈ పవిత్రమైన దేహాన్ని మట్టికే అంకితమిచ్చి, ప్రారబ్ధాన్ని పోగొట్టుకోలేక, మరింత పోగుచేసుకొని మరిన్ని దేహాల్నీ మరల మరల పొందుతూ జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, శ్రమిస్తూ దుఃఖితులమౌతున్నాం.
అందుకే అలా కాకుండా
ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం,
సత్కర్మలు ఆచరిస్తూ, సద్భావనతో చరిద్దాం,
ఆరోగ్యకరమైన శుద్దాహారమునే స్వీకరిద్దాం,
తద్వారా తరిద్దాం.


మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని.
దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: |
దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ ||
బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి
Read More

‪#‎రుద్రాక్ష‬ జాబాల ఉపనిషత్తు 4‪#‎రుద్రాక్ష‬ జాబాల ఉపనిషత్తు 4

రుద్రాక్షల యొక్క వివిధ ముఖములు వాని యొక్క ప్రభావము ఈ క్రింది విధముగా ఉండును.

‪#‎ముఖము‬ రూపము ప్రభావము
1. ఏకముఖి -----శాశ్వత సత్యము -----మోక్షమును పొందుట .
2. ద్విముఖి -----అర్ధనారీశ్వర -----అర్ధనారీశ్వరుని కృప
3. త్రిముఖి ------ అగ్ని ----------- అగ్నిదేవుని కటాక్షము
4. చతుర్ముఖి ----బ్రహ్మ --------- బ్రహ్మ దేవుని కటాక్షము
5. పంచముఖి ---- బ్రహ్మ ------- నరహత్య పాతకము తొలగించును
6. షణ్ముఖి ------ కార్తికేయుడు/గణపతి -----చిత్తశుద్ది, జ్ఞాన సిద్ది కలిగించును
7. సప్తముఖి ------ సంపద , ఆరోగ్యము కలిగించును..
8. అష్టముఖి ----- అష్ట వసువులు/గంగ ----దేవతల ఆశీర్వచనం కలుగును, సత్య మార్గమును సాధించును
9. నవముఖి ---- నవగ్రహములు--నవ విధములైన శక్తులు సాధించును
10. దశముఖి ----- యముడు ----శాంతిని చేకూర్చును
11. ఏకాదశ ముఖి ---- ఏకాదశ రుద్రులు ---సర్వవిధములైన సంపదలు
12. ద్వాదశ ముఖి --- మహా విష్ణు, / ద్వాదశ రుద్రులు ---- మోక్ష సాధనము
13. త్రయోదశ ముఖి --- మన్మధుడు ----- అన్ని కామనలు తీర్చును.
14. చతుర్దశ ముఖి --- రుద్రుడు --- అన్ని వ్యాధులను రూపుమాపును.


(ఇంకా ఉంది )
Read More

హిందూ ధర్మం - 147 (మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య)హిందూ ధర్మం - 147 (మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య)

18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 ‪#‎అక్షౌహిణిల‬ సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు.


సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.

వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.

‪#‎చముకు‬ మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.

To be continued ............
Read More

* భూరిశ్రవుడు* భూరిశ్రవుడు

భూరిశ్రవుడు ఇప్పటి పర్షియాలోని బాహ్లిక రాజ్యానికి యువరాజు. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఒక అక్షౌహిణికి అధిపతియై పోరాడాడు. ఆ యుద్ధంలో సాత్యకి చేతిలో మరణించాడు.


భూరిశ్రవుని తండ్రి సోమదత్తుడు. కృష్ణుని తల్లి అయిన దేవకి వివాహము చేసికొనక ముందు ఆమె కొరకు చాలా మంది రాజులు పోటీ పడ్డారు. వాసుదేవుని కొరకు ఆ యుద్ధములో పాల్గొన్న మరొక రాజు శైని సోమదత్తుని ఓడించాడు. ఈ సంఘటన వల్ల శైని మరియు సోమదత్తుని కుటుంబముల మధ్య వైరం జనించింది.

కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శైని మనుమడైన సాత్యకి పాండవుల పక్షాన, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు.

కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకితో భూరిశ్రవుడు యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.

భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందించాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట కూడా యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేశాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.

అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. అందరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండించాడు.
Read More

మనం రోజూ చదివే 24 నామాలు అన్నీ ఒకేమహావిష్ణువు యొక్క వివిధరూపాల పేర్లు. ఒకొక నామానికి ఒక విశిష్టత ఉంది.మనం రోజూ చదివే 24 నామాలు అన్నీ ఒకేమహావిష్ణువు యొక్క వివిధరూపాల పేర్లు. ఒకొక నామానికి ఒక విశిష్టత ఉంది.

నారాయణః

నారము అంటే నీరు అని అర్థము. నారాయణ శబ్దాన్ని నాదాయన శబ్దంగా కూడా చెప్పుకుంటారు. ఇలా చెప్పుకోవటంలో తప్పులేదు. నాదము అంటే ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి శబ్దము. అది ఒక గతికి వెళ్ళి ఎక్కడ శూన్య స్థితిని పొంది - ఎక్కడ శబ్దం అంతర్థానమవుతుందో అక్కడికి వెళ్ళిన ఆ శబ్దము మళ్ళీ వెనక్కు రాదు. Black hole అని వింటూ ఉంటాము. Black hole అనేదాని సైజ్ ఒక square yard కన్నా ఎక్కువగా ఉండడు అని చెపుతారు. దానికన్నా ఎన్నోరెట్లు ఎక్కువ పరిమాణం ఉన్న ఆకారాన్ని కూడా అది అమాంతంగా తనలోకి లాగేసుకుంటుంది. ఎంత పెద్ద గోళమయినా అందులోకి వెళ్ళిపోతుంది. అది ఏమయిందో కూడా శాస్త్రజ్ఞులకు అంతుపట్టటం లేదు. అంటే antimatter అనేది ఒకటి ఉన్నది ఈ సృష్టికి అతీతంగా! matter అనేదానిని నిర్మూలించగలిగిన ఒకానొక మహత్తర శక్తి ఈ సృష్టిలో వ్యాపించి ఉన్నది. దాని దగ్గరికి వెళ్ళగానే ఉన్నట్లుండి అంతర్థానమవుతుంది ఏ వస్తువైనా! ఈ జహ్ను శబ్దం చేత సర్వులను సంహారం చేసే లక్షణంగా ఇంతకుముందు చెప్పబడింది. ప్రసన్నాత్ముడయినప్పటికీ ఆయన సమదృష్టి కలిగి ఉంది జ్ఞాన స్వరూపుడిగా ఉంది దాక్షిణ్యం ఏమీ లేకుండా ఎక్కడా భేద దృష్టి చూపించకుండా చేస్తాడని నారాయణ శబ్దం చేత సమస్త జగత్తుకు ఆత్మా స్వరూపుడిగా ఉండేవాడు అని అర్థం. ఆయన జీవులను రక్షిస్తూ ఉంటాడు. శిక్షిస్తూ ఉంటాడు. ఆయన నారాయణుడు ఈ జగత్తంతా కూడా ఆయనయందు లయం పొందుతున్నది. ఆయనము అంటే ప్రయాణము అని అర్థం. ఆయన ప్రాణస్వరూపుడై ఉంటాడు. నారాయణ నామం చేత నార(ద)ములు - అంటే శబ్దములు మాత్రమే కాకుండా నీరములు, ప్రాణములు అని కూడా అర్థములు చెప్పుకోవటం చేత ఆయన సమస్త ప్రాణులకు గమ్యస్థానమై ఉన్నాడు. ఇక్కడ నరుడు అంటే ఆత్మా! నారములకు అంటే జీవులకు అని అర్థం. 'యత్ప్రయన్త్యభిసంవిశన్తి' ఈ జగత్తంతా కూడా ఈ రకంగా ప్రయాణం చేస్తున్నది. జగత్తంతా అందులోనే కలుస్తున్నది. 'ఆపోనారా ఇతి ప్రోక్తా' - ఇది స్మృతి వచనం.
Read More

The Saiva Upanishads - 5 Rudra Upanishad (5)The Saiva Upanishads - 5

Rudra Upanishad (5)

Only through Jnana, you can get rid of this Samsara. Only through Jnana, you can understand this existence and never through Karma. Understand this through the guidance of a Brahmanishtha-Srotriya Guru. The Guru will give the disciple all the necessary knowledge of Brahman, the Absolute. By cutting off the bondage of Ajnana or Avidya, one should take refuge in Lord Sadasiva. This is the real wisdom to be understood by an aspirant seeking after Truth.

The Pranava is the bow. The Atman is the arrow. The Para-Brahman is the target. Just like the arrow, the Atman will become one with Brahman.

But all these three, the bow, the arrow and the target are not different from that Sadasiva. There do not shine the bodies of the sun, moon or the stars. There does not blow the wind, there do not exist many Devatas. He, the One Lord only exists. He only, the Purity of purities, shines for ever and ever.

To be continued............
Read More

ఈ రుద్రాక్ష జాబాల ఉపనిషద్ ను పఠించిన వాడు ఏ వయసు వాడైనను ఉన్నత స్థితిని పొందును.ఈ రుద్రాక్ష జాబాల ఉపనిషద్ ను పఠించిన వాడు ఏ వయసు వాడైనను ఉన్నత స్థితిని పొందును. అతను అందరికి గురువు అవుతాడు, సకల మంత్రాలు తెలిసినవాడవుతాడు. ఈ మంత్రములతో హవనము, అర్చన చేయవలెను.

ఈ ఉపనిషద్ ను సంధ్య సమయమునందు పఠించిన బ్రాహ్మణుడు ఆ దినమంతయు చేసిన పాపముల నుండి విముక్తుడగును. అపరాహ్న వేళ పఠించినచొ, 6 జన్మల నుండి చేసిన పాపములు తొలగిపోవును. ఇరు సంధ్యా సమయములందు పఠించిన జన్మ జన్మ ల సంచిత పాపములన్నీ నశించును. ఆరువేల కోట్ల గాయత్రీ జపము చేసిన ఫలితము దక్కును.


బ్రహ్మ హత్యా పాతకము, కల్లు సేవించిన పాపము, హిరణ్యమును ( బంగారము ) ను అపహరించిన పాపము, గురు పత్ని తో సంగమము చేసిన పాపము, భ్రష్టుని తో సంభాషించిన పాపములు కూడా రుద్రాక్ష ఉపనిషద్ ను చదివినచొ తొలగి పోవును.

అన్ని పుణ్య క్షేత్రములు దర్శించిన ఫలితము, అన్ని ‪#‎పుణ్య‬ తీర్దములలో మునిగిన ఫలితము పొంది, అంతిమ కాలమున శివ సాయుజ్యము పొంది, మరు జన్మ అన్నది లేనివాడై మోక్షమును పొందును.

ఓం నమః శివాయ.
స్వామి శివానంద
Read More

The Saiva Upanishads - 5 Rudra Upanishad (2)The Saiva Upanishads - 5
Rudra Upanishad (2)

Uma Herself is the form of Vishnu. Vishnu Himself is the form of the moon. Therefore, those who worship Lord Vishnu, worship Siva Himself. And those who worship Siva, worship Lord Vishnu in reality. Those who envy and hate Sri Rudra, are actually hating Sri Vishnu. Those who decry Lord Siva, decry Vishnu Himself.


Rudra is the generator of the seed. Vishnu is the embryo of the seed. Siva Himself is Brahma and Brahma Himself is Agni. Rudra is full of Brahma and Vishnu. The whole world is full of Agni and Soma. The masculine gender is Lord Siva. The feminine gender is Sri Bhavani Devi. All the mobile and immobile creation of this universe, is filled up with Uma and Rudra. The Vyakta is Sri Uma, and the Avyakta is Lord Siva. The combination of Uma and Sankara is Vishnu.

Hence everybody should prostrate to Sri Maha Vishnu with great devotion. He is the Atman. He is the Paramatman. He is the Antaratman. Brahma is the Antaratman. Siva is the Paramatman. Vishnu is the Eternal Atman of all this universe. This whole creation of Svarga, Martya and Patala Lokas is a big tree. Vishnu is the top portion (branches) of this tree. Brahma is the stem. The root is Lord Siva.

The effect is Vishnu. The action is Brahma. The cause is Siva. For the benefit of the worlds. Rudra has taken these three forms.

To be continued............
Read More

The Saiva Upanishads - 5 Rudra Upanishad (5)The Saiva Upanishads - 5
Rudra Upanishad (5)

Only through Jnana, you can get rid of this Samsara. Only through Jnana, you can understand this existence and never through Karma. Understand this through the guidance of a Brahmanishtha-Srotriya Guru. The Guru will give the disciple all the necessary knowledge of Brahman, the Absolute. By cutting off the bondage of Ajnana or Avidya, one should take refuge in Lord Sadasiva. This is the real wisdom to be understood by an aspirant seeking after Truth.


The Pranava is the bow. The Atman is the arrow. The Para-Brahman is the target. Just like the arrow, the Atman will become one with Brahman.

But all these three, the bow, the arrow and the target are not different from that Sadasiva. There do not shine the bodies of the sun, moon or the stars. There does not blow the wind, there do not exist many Devatas. He, the One Lord only exists. He only, the Purity of purities, shines for ever and ever.

To be continued............
Read More

వీటిని దగ్ధయోగాలు అంటారు.పాడ్యమి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
విదియ - ఏ విదమైన పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది
తదియ - సౌక్యం, కార్య సిద్ధి
చవితి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
పంచమి - ధన ప్రాప్తం, శుభ యోగం
షష్టి - కలహం, రాత్రి కి శుభం
సప్తమి - సౌక్యకరం
అష్టమి -కష్టం
నవమి - వ్యయ ప్రయాసలు
దశమి - విజయ ప్రాప్తి
ఏకదశి - సామాన్య ఫలితములు
ద్వాదశి - భోజన అనంతరం జయం
త్రయోదశి -జయం
చతుర్దశి -రాత్రి కి శుభం
పౌర్ణమి - సకల శుభకరం
అమావాస్య- సాయంత్రం నుండి శుభకరంషష్టి - శనివారం, సప్తమి - శుక్రవారం, అష్టమి - గురువారం, నవమి - భుదవారం, దశమి - మంగళవారం, ఏకాదశి - సోమవారం, ద్వాదశి - ఆదివారం ,ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు.
వీటిని దగ్ధయోగాలు అంటారు.
Read More

శ్రీయంత్రం మిస్టరీ!! ~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది.

శ్రీయంత్రం మిస్టరీ!!
~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది.
~ సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు.
~ దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది.
~ ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13
మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి
చెప్పేశారు.~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?
~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు????Read More

ॐ ఓం శ్రీం శనేశ్వరాయనమః ॐॐ ఓం శ్రీం శనేశ్వరాయనమః ॐ
మేరుప్రదక్షిణం కృత్వా సర్వలోకభయాపహమ్
కృష్ణాంబరధరం దేవంద్విభుజం గృధ్రసంస్థితమ్
సర్వపీడాహరం న్రృణాంధ్యా యేద్గ్రహగణోత్తమం
శనైశ్చరశ్శిరో రక్షేన్ముఖం భక్తార్తి నాశనః
కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః
కృష్ణాంగో నాసికాం రక్షేత్ కర్ణౌ మేచ శిఖండిజః
భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పల ప్రభః
పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదర స్తథా !


నీలాంబరో నీలవపుః కిరీటీ గృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః సదా మమస్యాద్వరదః ప్రశాంతః |

'బ్రహ్మా ఉవాచ '
శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం మహత్ కవచం శనిరాజస్య సౌరైరిదమనుత్తమమ్
కవచం దేవతావాసం వజ్ర పంజర సంగకమ్
శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ అథ శ్రీ శని వజ్ర పంజర కవచమ్
ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః
నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః
స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా
నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా
పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందనః

"ఫలశ్రుతిః"

ఇత్యేతత్కవచమ్ దివ్యం పఠేత్సూర్యసుతస్య యః
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః
వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోపివా
కలత్రస్థో గతోవాపి సుప్రీతస్తు సదా శనిః
అష్టమస్థో సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్
ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా
ద్వాదశాష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః

' ఓం: శాంతి శాంతి శాంతిహి: శుభం భూయత్ : '
: ॐ : కృతజ్ఞతలు తొ ....' మీ ., మధు శర్మ. ॐ :
Read More

మామిడి తోరణాలు..... మామిడి తోరణాలు ఎందుకు కడతారు?మామిడి తోరణాలు..... మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

నూతన గృహంలోకి ప్రవేశించే ముందు మామిడి తోరణాలను కడుతుంటారు. అలాగే పండుగల సమయాలలో కూడా మామిడి తోరణాలు కట్టడం జరుగుతోంది. మామిడి తోరణాల ప్రయోజనం తెలియకనే జనులు దగ్గరగా కూర్చి మామిడాకు తోరణాలను ప్రవేశ ద్వారాల వద్ద కట్టుతుంటారు. అలాగే గృహప్రవేశ సమయంలో మద్యగదిలో కొత్త పాత్రలో పాలు పొంగీయడం మనం చూస్తున్నాం. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. పాలు మసిలి పొంగి నేలపైకి తొరలడం గృహప్రవేశ సమయంలో ఎంతో శుభసూచకంగా చెప్పబడును. గౄహప్రవేశ కార్యంఅయిన ఇంట్లోకి మామిడితోరణాలు కళకళలాడూతూ అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి. ఈ ఆచారము వెనుక ఓ శాస్త్రీయ విషయాన్ని గ్రహించారు కాబట్టే, అనేక శుభకార్యాలలో మామిడి ఆకును వాడేవారు. గృహప్రవేశ సమయంలో అనేక బంధుమిత్రులు ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఈ కారణంగా సహజంగానే ఇంట్లోని గాలి కలుషితమౌతుంది. అయితే మామిడాకులకు గాలిని శుద్దిచేసే గుణం ఉండటం కారణంగా తోరణాలను ద్వారాలను దట్టంగా కట్ట్డం జరుగుతుంది. మామిడాకులకు పళ్ళలోని సూక్ష్మక్రిములను హరించే సామర్ధ్యమున్న కారణంగా మన పూర్వులు పళ్ళు తోమడానుకి మామిడి ఆకులను ఉపయోగిస్తుండేవారు. బావిలోనికి దిగి శుభ్రము చేయువారికి మొదట ఓ మామిడాకులు ఎక్కువగా ఉన్న కొమ్మను బావిలోకి దించి, చుట్టుతా కొంతసేపు తిప్పమని చెప్పబడేది. ఇలా చేయడంవల్ల బావిలో ఉన్న విషయాయువులు తొలగించబడతాయి. ఇలా చేయువారు గ్రామీణ ప్రాంతాలలో మనదేశంలో ఇప్పటికి కనిపిస్తారు. కాబట్టి పెద్దల మాట చద్దిమూటలా మనం భావించాలి.


నూతన గృహంలోకి ప్రవేశించే ముందు మామిడి తోరణాలను కడుతుంటారు. అలాగే పండుగల సమయాలలో కూడా మామిడి తోరణాలు కట్టడం జరుగుతోంది. మామిడి తోరణాల ప్రయోజనం తెలియకనే జనులు దగ్గరగా కూర్చి మామిడాకు తోరణాలను ప్రవేశ ద్వారాల వద్ద కట్టుతుంటారు. అలాగే గృహప్రవేశ సమయంలో మద్యగదిలో కొత్త పాత్రలో పాలు పొంగీయడం మనం చూస్తున్నాం. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. పాలు మసిలి పొంగి నేలపైకి తొరలడం గృహప్రవేశ సమయంలో ఎంతో శుభసూచకంగా చెప్పబడును.
గౄహప్రవేశ కార్యం అయిన ఇంట్లోకి మామిడితోరణాలు కళకళలాడూతూ అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి. ఈ ఆచారము వెనుక ఓ శాస్త్రీయ విషయాన్ని గ్రహించారు కాబట్టే, అనేక శుభకార్యాలలో మామిడి ఆకును వాడేవారు.
గృహప్రవేశ సమయంలో అనేక బంధుమిత్రులు ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఈ కారణంగా సహజంగానే ఇంట్లోని గాలి కలుషితమౌతుంది. అయితే మామిడాకులకు గాలిని శుద్దిచేసే గుణం ఉండటం కారణంగా తోరణాలను ద్వారాలను దట్టంగా కట్ట్డం జరుగుతుంది.
మామిడాకులకు పళ్ళలోని సూక్ష్మక్రిములను హరించే సామర్ధ్యమున్న కారణంగా మన పూర్వులు పళ్ళు తోమడానుకి మామిడి ఆకులను ఉపయోగిస్తుండేవారు. బావిలోనికి దిగి శుభ్రము చేయువారికి మొదట ఓ మామిడాకులు ఎక్కువగా ఉన్న కొమ్మను బావిలోకి దించి, చుట్టుతా కొంతసేపు తిప్పమని చెప్పబడేది. ఇలా చేయడంవల్ల బావిలో ఉన్న విషయాయువులు తొలగించబడతాయి. ఇలా చేయువారు గ్రామీణ ప్రాంతాలలో మనదేశంలో ఇప్పటికి కనిపిస్తారు.
Read More

శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?

గ్రహాల స్థితిగతులనుబట్టి మన జాతకచక్రం నడుస్తుంటుంది. కనుక నవగ్రహాలను అనుకూలంగా చేసుకోవడం చాలా అవసరం. అందులో శని ప్రభావం మరీ ఎక్కువ కనుక, శని దోషం ఉన్నవారు కొన్ని దానాలు ఇవ్వడం ద్వారా దాన్ని శాంతింపచేసుకోవచ్చు.

శని మహర్దశలో చేయవలసిన దానములు


1. శని మహర్దశ, శని అంతర్దశల్లో నువ్వులు దానము చేయాలి.
2. శని మహర్దశ, రవి అంతర్దశలో ఒక గుమ్మడికాయను, ఇవ్వగలిగినంత బంగారాన్ని దానం చేయాలి.
3. శని మహర్దశ, చంద్రుని అంతర్దశలో తెల్ల ఆవును దానం చేయాలి.
4. శని మహర్దశ, కుజ అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. శని మహర్దశ, బుధుడు అంతర్దశలో దున్నను దానం చేయాలి.
6. శని మహర్దశ, గురుడు అంతర్దశలో బంగారు మేకను దానం చేయాలి.
7. శని మహర్దశ, శుక్రుడు అంతర్దశలో నల్ల మేక, నువ్వులు, ఇనుము, లవణం, నూనెలను దానం చేయాలి.
8. శని మహర్దశ, రాహువు అంతర్దశలో సీసమును దానం చేయాలి.
9. శని మహర్దశ, కేతువు అంతర్దశలో బంగారం, నువ్వులు దానం చేయాలి.

వివిధ గ్రహాల శని అంతర్దశలో చేయవలసిన దానములు:

1. రవి మహర్దశలో మేకను దానం చేయాలి.
2. చంద్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
3. కుజ మహర్దశ, శని అంతర్దశలో నువ్వుల పిండిని దానం చేయాలి.
4. బుధుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. గురుని మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
6. శుక్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
7. రాహువు మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
8. కేతు మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.

పైన సూచించినవి ఏవైనా దొరకనప్పుడు వాటికి బదులుగా ధనమిచ్చుటకన్నా సూచించిన దాని ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో కలిసి ఇవ్వాలి.Read More

మన దేవాలయాలలో వచ్చే ఆదాయం దేవాలయ సిబ్భంది జీతాలు పోను మిగిలిన సొమ్ము ప్రభుత్వ ఖజానా కు అందచేస్తారు ఆ సొమ్ము తో సబ్సిడీలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తారు లబ్ది పొందే వారిలో హిందు , క్రిస్టియన్ , ముస్లిం సోదరులు వుంటారు కాని మస్జిద్ , చర్చి లలో వచ్చే సొమ్ము మరి వారికే చెందాల ? ప్రతి హిందువు గమనిచాలి !


Read More

హిందూ ధర్మం - 13హిందూ ధర్మం - 13

1- ధృతిః : ఎంతటి ఆపద వచ్చినా, మానసిక
స్థైర్యాన్ని, దైర్యాన్ని కోల్పొవకపోవడం, ధృడ
నిశ్చయం కలిగి ఉండడం ధృతిః. ప్రారంభించిన
పనిని, ఎన్ని ఆపదలు, విఘ్నాలు వచ్చినా,
తట్టుకుని, ఎదురించి, పోరాడి, పూర్తి
చేయడం ధృతిః. నిత్యం సంతోషంగా ఉండడం,
చావు తన్నుకువస్తున్నా,
ఆత్మవిశ్వాసం సడలకుండా,
మృత్యువుకు సైతం ఎదురు నిలబడి
పోరాటం చేయడం ధృతిః..


మనం చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాల్లో ఒక
పద్యం చదివాం. గుర్తుందా?

ఆరంభించరు నీచమానవులు
విఘ్నాయససంత్రస్తులై
యారభించి పరిత్యజింతురు విఘ్నాయాత్తులై
మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమాను లగుచున్
ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ
ప్రజ్ఞానిధుల్ గావునన

ఏదైన ఒక పని మొదలుపెడితే, ఆపదలు,
అడంకులు, కష్టాలు వస్తాయని భయపడి,
అసలు చేయాల్సిన పనిని చేయకుండా
తప్పించుకుంటారు కొందరు. వాళ్ళను నీచులు/
అధములు అన్నాడు కవి. ఇక రెండవ రకంవారు,
పని మొదలుపెట్టినా, ఆటంకాలు వచ్చాయని
మధ్యలోనే వదిలిపెట్టేస్తారు, ఇక మావల్ల
కాదు అని చేతులు ఎత్తేస్తారు,
వీరు మధ్యములు. మూడవ రకంవారు,
కష్టాలే రానీ, కన్నీళ్ళే రానీ, వచ్చిన ప్రతి
ఆటంకాన్ని తొలగించుకుంటూ, ప్రతి
ఆపదను ఎదురుకుంటూ, ఎప్పుడో ఏదో
వస్తుందని భయపడకుండా, దిగులు చెందకుండా,
'ధృతి'తో, ఉత్సాహం కలిగినవారై, పనిని పూర్తి
చేస్తారు ధీరులు. ప్రతి మనిషికి ఉండవలసిన
లక్షణం కూడా అదే అంటున్నది మనుస్మృతి.
అందరూ కర్తవ్య నిర్వహణలో ధీరులు కావాలి.
ధృతితో ఆఖరివరకు పోరాడి విజయం సాధించాలి.
అదే ధర్మానికున్న మొదటి లక్షణం.

To be continued..................
Read More

హిందూ ధర్మం - 14హిందూ ధర్మం - 14

మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ధృతి అని
తప్పుడు పనులను కూడా అట్లాగే పూర్తి
చేయాలనుకోకూడదు. మనం చేసే పని
మంచిదైనప్పుడు, లోకమంతా అడ్డగించినా,
పూర్తి చేయడం మాత్రమే ధృతి అవుతుంది.
అంతేకానీ, దుష్ట ఆలోచనలు చేసి, అవి తప్పని
తెలిసినా, వాటిని వదిలిపెట్టక, వాటిని పూర్తి
చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంద


ఈ జీవితం అనేది సుఖదుఃఖాల కలియక,
గెలుపు, ఓటముల సంగమం. ఒక సమయంలో
సుఖం ఉంటే, మరొక సమయంలో
దుఖం ఉంటుంది. సుఖం వచ్చిందని అతిగా
ఆనందపడిపోకూడదు, దుఖం వచ్చిందని
క్రుంగిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా,
తట్టుకుని, మరణం వచ్చేవరకు జీవించాలి.
సముద్రానికి ఆటుపోట్లు ఉన్నట్టే జీవితానికి
ఉంటాయి. తనలో ఎన్నో నదులు వచ్చి
కలుస్తున్నా, సముద్రం పొంగిపోదు.
సూర్యుడు తన నీటిని ఆవిరిరూపంలో
పీల్చుకున్నా క్రుంగిపోదు. ఎప్పుడు ఒకేలా
ఉంటుంది. అట్లాగే మనిషి కూడా జీవితంలో
అన్నిటిని తట్టుకుని నిలబడాలి. ఈ
ప్రపంచం ఒక వ్యాయమశాల వంటిది, ఇక్కడ
నిన్ను బలవంతుడిగా చేసుకోవాలి అంటారు స్వామి
వివేకానంద. స్వామిజీ చెప్పిన ఈ
మాటలను గుర్తుపెట్టుకుని, జీవితంలో
మనం అనుభవించే ప్రతి కష్టం నుంచి ఏదో ఒక
విషయం నేర్చుకోవాలి. ఇక్కడ మన
బలవంతులుగా మారాలి. ఎక్కడ జీవితం మీద
నిరాశ చెందకుండా, ఆశవాదంతో జీవితాన్ని
పరిపూర్ణంగా జీవించడం ధృతి. అదే
ధర్మం యొక్క ప్రధమలక్షణం.

To be continued.................
Read More

హిందూ ధర్మం - 16హిందూ ధర్మం - 16

మనం కూడా చాలా పనులు మొక్కుబడికి
చేస్తుంటాము. ఎప్పుడో, ఏదో ఆవేశంలో, ఒక
మాట అనేస్తాం, నేను అది చెస్తాను, ఇది
చేస్తాను అని ప్రగల్భాలు పలికేస్తాం.
తర్వాత ఆ పని పూర్తి చేయడానికి నానా
తంటాలు పడతాం. ఎందుకు చెప్పాన్రా
బాబోయ్! అంటూ మన మీద చిరాకుపడతాం.
ఆఖరికి పనైతే పూర్తవుతుంది. కానీ ఇది ధృతి
అనిపించుకోదు అంటారు ఋషులు. బలవంతంగా
పనులు, కార్యాలు పూర్తి చేయడం కాదు,
అయిష్టంగా సంకల్పాలు నెరవెర్చడం కాదు,
ఇష్టంతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి,
మనసా, వాచా, కర్మణా (త్రికరణ శుద్ధిగా)
చేయాలి. అలా చేయడమే ధృతి
అనిపించుంకుటుంది.


నేను ఈ ధర్మాన్ని ఆచరిస్తాను అనుకుంటాం.
సుఖాలు ఉన్నప్పుడు,
సమయం అనుకూలించినప్పుడు ఆచరించడం
సులువే. కానీ కష్టం వచ్చినా,
మరణం సమీపిస్తున్నా, ప్రళయం వస్తున్నా,
ధర్మాన్ని అదే ఉత్సాహంతో, సంతోషంతో
ఆచరించడం ధృతి. ధృతిని మనుమహర్షి
ధర్మానికి మొదటి లక్షణంగా చెప్పడంలో ఒక
రహస్యం ఉంది. ఈ ధర్మంలో ఆధునిక
వైద్యశాస్త్రంలో ఉన్నట్టుగా దేనికి
క్షణికమైన ఫలితాలు (Instant results)
ఉండవూ, అనుసంగ ప్రభవాలు (Side
Effects) ఉండవు. ఆయుర్వేదమే తీసుకోండి,
ఒక్కో ఔషధం పని చేయాలంటే కనీసం 41
రోజులు పాటు దాన్ని సేవించాలి, కానీ దాని
ఫలితాలు అధ్బుతంగా ఉంటాయి. ధ్యానం,
యోగా కూడా అంతే.
గురువు దగ్గరకు వెళ్ళగానే, రా నాయానా!
నేను నీ కోసమే వేచి ఉన్నాను.
మొత్తం నీకు ఇప్పుడే భోధిస్తాను అని
చెప్పడు. ముందు బోలెడు పరీక్ష పెడతారు,
మన ఓపికను పరీక్షిస్తారు, మన
శ్రద్ధను గమనిస్తారు, మనం అన్నిటిని
తట్టుకుని సిద్ధమయ్యాక, అప్పుడి
జ్ఞానాన్ని భోధిస్తాడు. ఇక్కడ కూడా
వ్యక్తికి ధృతి ఉండాలి. లేకుంటే
మోక్షం పొందలేడు. అట్లాగే భగవంతుని
అనుభూతి ఒక్క రోజులో కలగదు. దానికి
బోలెడు సాధన కావాలి, ఆహార
నియమాలు పాటించాలి, బాగా ఓపిక కావాలి,
నిరనతరం ఉత్సాహం ఉండాలి, భగవంతుడిని
చేరాలన్న తపన నిరనతరంగా కలుగుతూనే
ఉండాలి. ఇదంతా కేవలం ధృతి వల్లనే
కలుగుతుంది. కనుక మనుమహర్షి
ధర్మాచరణలో ధార్మికునకు ఉండవలసిన
మొదటి లక్షణం ధృతి అని ప్రవచించారు.
తరువాతి లక్షణం క్షమా.

To be continued..........
Read More

హిందూ ధర్మం - 17హిందూ ధర్మం - 17

2 - క్షమా:

క్షమించడం, క్షమా గుణం కలిగి
ఉండడం ధర్మం యొక్క రెండవ లక్షణం.
క్షమించడం అన్నమాటని జాగ్రత్తగా
అర్ధం చేసుకోవాలి. ఒకడు బలహీనుడై,
ఎదుటివాడు బలవంతుడైనప్పుడు, వాడితో
పోరాటం చేయలేక, వాడు ఎన్ని
అకృత్యాలు చేస్తున్నా, వాడిని క్షమించేస్తాం.
ఇది పరికితనంతో చేసే పని. ఇది క్షమా
గుణం కాదు, చేతకానీతనం అంటుంది ధర్మం.
ఏలా అంటే, మీకు ఎవరి మీదో బాగా కోపం వచ్చింది,
గట్టిగా నాలుగు తగించాలనుకున్నారు, కానీ
అవతలివాడు మీకంటే శక్తివంతుడని,
మీరు ఒక్క దెబ్బ కొడితే, వాడు పది
దెబ్బలేస్తాడని తెలిసు కనుక,
మీరు వెనక్కు తగ్గుతారు. అది కాదు క్షమా
అంటే అంటుంది ధర్మం.


మీరు ముందు బలవంతువులుగా మారండి.
ఎవరైనా మీ జోలికి వస్తే వాడికి బుద్ధి
చెప్పేటంతగా, శారీరికంగానూ, మానసికంగానూ మీరే
బలవంతులవ్వాలి. ఎదుటివాడిని మట్టి కరిపించే
శక్తి మీకు ఉండాలి. అన్నీ ఉండి,
అవతలవాడు బలహీనుడని తెలిసి కూడా
మీరు క్షమించగలగాలి. అదే నిజమైన క్షమా
గుణం. ఇదే కర్మయోగం చెప్తుంది.
ధర్మం కూడా అటువంటి క్షమాగుణాన్నే
అలవరచుకోవాలని చెప్తున్నది. ఎందుకంటే ఏమి
లేనీవాడు, శక్తిహీనుడు ఎట్లాగో వాదన
చేయలేడు, కనుక సర్దుకుపోతాడు.
క్షమించడం ధీరులైనవారి లక్షణం.
చేతగానితనం బలహీనుల లక్షణం. అందుకే
బలహీనులు ఎప్పటికి క్షమించలేరు,
క్షమించడం బలవంతుల
సద్గుణం అన్నారు గాంధీ.
Read More

అమ్మ తెరెసా:అమ్మ తెరెసా:

దళిత హక్కుల కోసం ధర్నా లో ఫల్గొంది - రిజర్వేషన్ కూడా అడిగింది పాపం, కాని తన మిషనరీస్ అఫ్ చారిటీస్ సంస్థ కి మాత్రం ఒక బ్రాహ్మణ సిస్టర్ ని మాత్రమే వారసురాలిగా నియమించింది

ఎందుకు? మనువదపు ఏజెంట్? లేక ఏంటి?


దళితులూ - ఆలోచించండి.
Read More

Friday, 27 February 2015

మార్కండేయ పురాణం -2వ భాగంమార్కండేయ పురాణం -2వ భాగం

ఒకనాడు ప్రభాతవేళ శమీకుడు అనే ఒక మహాముని..
ఆ కురుక్షేత్రం మీదుగా వెళ్తుంటాడు. గంటకింద వున్న గుడ్లు పిల్లలుగా మారి, కిచకిచలాడుతుంటాయి.


అలా ధ్వని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి నాలుగు పక్షి పిల్లలు కనిపిస్తాయి.

శమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ పక్షులు..

‘‘ఓ మహానుభావా! తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ ఋణము మేమెలా తీర్చుకోవాలి? మేము ఏ విధంగా నీకు సేవ చేయగలం చెప్పు’’ అని అడిగాయి.

పక్షులు మానవభాషలో మాట్లాడుతున్నందువల్ల శమీకుడు ఆశ్చర్యపడి, ‘‘ఓ పక్షి పిల్లల్లారా! మీరు మానవభాషలో మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా వింతగా వుంది. అసలు మీరెవ్వరు?
ఎందుకు ఈ పక్షీ జన్మం ఎత్తారు?

నాకు దయచేసి తెలపండి’’ అని అడగగా... ఆ పక్షిపిల్లలు ఈ విధంగా సమాధానం చెబుతాయి.

‘‘ఓ ఋషీశ్వరా! పూర్వం సుకృతి అనే మహామునికి మేము నలుగురం పుత్రులుగా జన్మించాం.

వేదశాస్త్రాలను చదువుకుంటూ... మా తల్లిదండ్రులను సేవిస్తూ.. కాలాన్ని గడిపేవాళ్లం.

ఇలా వుండగా.. ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రిసత్యాన్ని పరీక్షించడానికి గ్రద్దరూపంలో వచ్చి నరమాంసాన్ని ఆహారంగా పెట్టమని కోరాడు.
అప్పుడు మా తండ్రి..

‘‘మీలో ఎవరైనా ఇంద్రునికి ఆహారం అవ్వండి’’ అని ఆజ్ఞాపించారు.
అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞాన్ని పాలించకుండా అలాగే వుండిపోయాం.

అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షలుగా పుట్టాలని శపించి, తన శరీరాన్ని ఇంద్రునికి ఆహారంగా సమర్పించుకున్నారు.

ఇంద్రుడు మా తండ్రి త్యాగబుద్ధిని సంతోషించి, మమ్మల్ని చూసి...

‘‘మీరు వింధ్యపర్వత గుహలలో నివసించండి. జైమిని అనే వ్యాసశిష్యుడు మీ దగ్గరకు వచ్చి, కొన్ని సందేహాలు అడుగుతాడు.

ఆ సందేహాలను తీర్చి మీరు శాపవిముక్తి పొందండి. మీరు పక్షులైనా..
సర్వవేదాలను పొంది ధర్మపక్షులు, జ్ఞానపక్షులుగా పేరు పొందుతారు’’
అని మమ్మల్ని అనుగ్రహంచి వెళ్లిపోయాడు’’ అని ఆ పక్షులు తమ వృత్తాంతం గురించి శమీకునికి చెబుతాయి.

అప్పుడు శమీకుడు... ‘‘మీరు నాకోసం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యపర్వతాలకు వెళ్లండి’’ అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపివేశాడు’’
కాబట్టి..

ఓ జైమినీ! నువ్వు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి నీ ధర్మసందేహాలను తీర్చుకో’’ అని జైమినికి చెప్పి.. మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళతాడు.

జైమిని వింధ్యపర్వతంలో జ్ఞానపక్షులను వెదకడానికి వెళతాడు. అలా కొద్దిసేపు తరువాత అతనికి ఆ పక్షులు కనిపిస్తాయి.

ఆ పక్షులు ఆ సమయంలో వేదాధ్యాయనం చేస్తున్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి..
‘‘ఓ పక్షులారా! నేను వ్యాసుని శిష్యుడిని.
నన్ను జైమిని అంటారు.

మార్కండేయుడు చెప్పిన విధంగా నేను మీ దగ్గర కొన్ని ధర్మసందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను
నా సందేహాలను తీర్చండి’’ అని చెప్పగా...

ఆ పక్షులు ‘‘నీకున్న సందేహాలేంటో అడుగు.. మా చేతనైంతవరకు సమాధానాలు చెబుతాం’’ అని సమాధానం ఇస్తాయి.

Continues...
Read More

ఋగ్వేదం - ప్రథమ సూక్తం (౩)ఋగ్వేదం - ప్రథమ సూక్తం (౩)

ఓం యదజ్ఞ దాశుషే త్వ మగ్నే భద్రం కరిష్యసి !
తవేత్తత్ సత్యమజ్ఞిర: !!


అంగ అగ్నే! అంగిర: = చూడు అగ్ని! (దావాగ్ని అంగారాల్లాగా కోరికలను కాల్చిశమింపజేసే) అంగిరుడా!; త్వం = నువ్వు; దాశుషే = తాను చేసే కర్మలనన్నింటినీ భగవత్సమర్పణం చేసేవాడికి; యత్ భద్రం కరిష్యసి = ఏ సుఖ కల్యాణాలను కలిగిస్తావో; తత్ తవ ఇత్ = అది నీదే, నీకు తగినదే; తత్ సత్యం = ఇది ముమ్మాటికీ నిజం.

చూడా అగ్ని! అంగారాల్లాగా, ఆసక్తులను అంటించి దహించి, శమింపజేసే అంగిరుడా! తాను చేసే సర్వ కర్మలనూ, భగదర్పణం చేసే సాధకుడికి నువ్వు కలుగజేసే భ్రదతను నువ్వే ఇవ్వగలవు. అది నీకే చెల్లును. ఇది ముమ్మాటికీ సత్యం.

ప్రియతమైన అగ్ని! ద్రవ్య హవిస్సులనూ క్రియా హవిస్సులను నీకు సమర్పించి నీలో వేల్చే సాధన యజమానికి నువ్వు ప్రసాదించే పరమసుఖం... అదే, నీ సత్యమైన రూపు.... అదే నీ ప్రధనమైన ప్రదీప్త స్వరూపం... అదే నీ విలక్షణమైన లక్షణం.

7. ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ ధియా వయం !
నమ భరన్త ఏమసి !!

అగ్నే = హే అగ్నీ; వయం = సాధకులమైన మేము; దివే దిదే దోషావస్త: = ప్రతీరోజూ రాత్రీ పగలూ; ధియా = బుద్ధిపూర్వకంగా చేసే కర్మలను; నమో భరన్త: = నమస్సులతో నింపుతూ (కర్మలను అణుకువతో చేస్తూ); ఉప, త్వా, ఆ ఇమపి = నీ దగ్గరకు చేరుతున్నాము.

అగ్నీ! మేము అహరహమూ రాత్రీ, పగలూ (అనే భేదం లేకుండా) మనసా బుద్ధ్యా వినయ పూర్వకంగా కర్మలను చేస్తూ నమస్సులనర్పిస్తూ నీ దరికి చేరుతున్నాం.

8. రాజన్త మధ్వరాణాం గోపామృతస్యదీదివిమ్ !
వర్ధమానంస్వే దమే !!

రాజన్తం = దేదీప్యమానంగా వెలుగుతున్న; అధ్వరాణాం = ఫలాసక్తి అన్న హింసను బహిష్కరించిన యజ్ఞ మార్గాలను; గోపాం = సంరక్షిచేవాడివీ; ఋతస్య = విశ్వనియమాన్ని; దీదివిం = బాగా ప్రకాశింపజేసేవాడివీ; స్వే, దమే, వర్ధమానం = నిగృహీతమైన, క్రమశిక్షణాయుక్తమైన, సాక్షాత్తూ తనదే అయిన సాధన శరీర గృహంలో వర్ధిల్లుతున్నవాడివీ; స: త్వం అగ్నే = అటువంటి నువ్వు; ఓ అగ్ని మానవే = కొడుకుకు.

ఫలాసక్తి వల్ల కలిగే హృదయ సంకటాలను ఉద్వేగాలనూ పోగొట్టుకుని దివ్యసాధనాపథాలను అనుసరించే సాధకుడిని సంరక్షిస్తూ, విశ్వనియమాన్ని (భగవదిచ్ఛను) అతనికి గోచరమయ్యేలాగా ప్రకాశింపజేస్తూ అతని సంయమిత శరీర గృహంలో సంవర్థమానమవుతున్న.

అగ్నీ! పలాసంగమనే బంధకారక పీడను విడిచిన మార్గాలను సంరక్షిస్తూ విరాజిల్లుతున్నావు నువ్వు. ప్రచండ తేజస్సుతో విశ్వధర్మసేతువులను కాపాడుతున్నావు.

నిగ్రహ ప్రకాశితమైన వ్యక్తిగత దేహగేహాల్లోనూ.. విశ్వకాయ మహా గృహంలోనూ ప్రదీప్తంగా వర్ధిల్లుతున్నావు. ఆ నీకు చేరువై, సన్నిహితమై ప్రతిరోజూ, రాత్రింబవళ్లు ఎడతెరిపిలేకుండా నిరంతరమూ కాయేన, మనసా, బుద్ధ్యా కర్మణా నీ సన్నిధినే కల్పించుకుంటూ మేము సర్వ సమర్పణా పూర్వక నిర్భర భావంతో నిన్ను ధ్యానం చేస్తూ వుంటాం.

9. స న: పితేవ సూనవేఁ గ్నే గోపాయనోభవ !
సచస్వా న: స్వస్తయే !!

పితా ఇవ = తండ్రివలె (సులువుగా చేరదగిన వాడయినట్టు); సు ఉపాయనోభవ = సులువుగా దరిచేరనిచ్చే వాడివికా; న: = మేము, మమ్మల్ని; స్వస్తయేసచస్వ = భద్రంగా వుండేలాగా మాతో కలిసి వుండు.

ఆ నువ్వు అగ్నీ! కొడుకు తండ్రిని చేరగలిగినంత చనువుగా మమ్మల్ని నీ వద్దకు చేరనివ్వు. మేము అవ్యయంగా సుభద్రంగా వుండేలాగా మాతో ఎప్పుడూ సమ్మిళితమై వుండు.

అగ్ని! తండ్రి ఒడిలోనికి కొడుకు చేరుకునేంత సులువుగా మేమే నిన్ను చేరుకోగలిగేలాగా, నీ సాన్నిహిత్యాన్ని మాకు ప్రసాదించు.
మేము స్వస్తిమంతులమై పరమభద్రాన్ని పొందేలాగ నువ్వెప్పుడూ మాతో కూడి వుండు.

ఇంతటితో ప్రథమం సమాప్తం...
Read More

మత్స్య మహా పురాణం -3వ భాగం నారాయణుడి మత్స్యవతారం :మత్స్య మహా పురాణం -3వ భాగం

నారాయణుడి మత్స్యవతారం :

శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవ్వగానే అతనిని చూసి..


‘‘ఓ మహానుభావా! నీకు తెలియంది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి, పెరిగి చివరకు నశిస్తున్నాయి.

నీ మహిమను గ్రహించడానికి మేమెంతటివాళ్లం? సృష్టిని నిర్మించినవాడివైన నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అయినా నీకు విన్నవించుకుంటున్నాను...

నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్ద వున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపవడం వల్ల సృష్టిన తయారుచేసే సామర్థ్యం నాలో తగ్గిపోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి, నాకు నుగ్రహించండి’’ అని ప్రార్థించుకుంటాడు.

అప్పుడు శ్రీహరి పదియోజనాల పొడవుగల చేప రూపాన్ని దాల్చి, బ్రహ్మతో..

‘‘ఓ బ్రహ్మదేవా! విచారించకు. నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ వున్నా ఆ సోమకుడిని వెతికి పట్టుకుని చంపి, వేదాలను నీకు అప్పగిస్తాను’’ అని మాటిచ్చి.. సముద్రంలోకి వెళ్లిపోతాడు.

సోమకాసురుడు అపహరించుకుని తీసుకుపోయిన వేదాలను.. తినే పదార్థాలు అనుకొని వాటిని మింగేస్తాడు.

కాని అవి అతని ఆకలి తీర్చలేదు. దీంతో అతను ఆకలి తీర్చుకోవడం కోసం ఆహారాన్ని వెదకడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మత్స్యరూపమెత్తిన శ్రీమన్నారాయణుడు కూడా అతనిని వెతుక్కుంటూ, అతను వున్న ప్రాంతానికి చేరుకుంటాడు. సోమకాసురుడు..

‘‘ఈ చేప ఎంత బాగుంది. దీనిని నా ఆహారంగా మలచుకుంటాను’’ అని తలచుకుని, దానిని మింగడానికి ప్రయత్నిస్తాడు.
కానీ ఆ చేప అతనిని ఎదుర్కుంటుంది. సోమకాసురుడు మహా బలవంతుడే కాబట్టి వారిద్దరి మధ్య యుద్ధం ఏర్పడుతుంది. ఇలా వారిమధ్య యుద్ధం కొన్ని కాలాలపాటు మహాసంగ్రామంలా జరుగుతుంది.

దానవుడు, మత్స్యాన్ని నొప్పించడానికి అనేక రకాల పథకాలు రచిస్తాడు. తన దగ్గరున్న గదాఘాతంతో కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే విష్ణువు ఆ దెబ్బ నుంచి తప్పించుకుని తోకతో నీటిని బాదుతాడు. ఆ దెబ్బతో నీరు ఒక యోజనం పైకి ఎగరగా..

సోమకాసురుడు కూడా అలాగే పైకి ఎగురుతాడు. దాంతో సోమకుడు కోపాద్రిక్తుడై మత్స్యాన్ని తన రెండు చేతులతో బట్టి పీడించడం మొదలుపెట్టాడు. అయితే మత్స్యం రాక్షసుని పట్టునుంచి
విడిపించుకుని, తన కోరలతో చీల్చి చెండాడుతుంది. అనంతరం అతని కడుపులో వున్న వేదాలను, ఒక దక్షిణావర్త శంఖమును తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు.

శ్రీ విష్ణువు, బ్రహ్మకు వేదాలు ఇస్తూ.. ‘‘నాయనా! సోమకుడు ఈ వేదాలను మింగడం వల్ల కొన్ని శిథిలమయిపోయాయి.

నీకు జ్ఞాపకమున్నంతవరకు వీటిని శిథిల పురాణం చేసి, స్ఫురించిన చోట ప్రణవంతో పూరించి, సమగ్రంగా పూర్తి చేయు’’ అని చెప్పి అదృశ్యమవుతాడు.

Continues...
Read More

Powered By Blogger | Template Created By Lord HTML