గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 12 January 2015

జపనీయులు - హిందుత్వం :: Hindhutvam is not only a religion Because it's culture and tradition) (హిందుత్వమనేది కేవలం ఒక మతం కాదు.. అది ఒక సంస్కృతి)

జపనీయులు - హిందుత్వం :: Hindhutvam is not only a religion Because it's culture and tradition)
(హిందుత్వమనేది కేవలం ఒక మతం కాదు.. అది ఒక సంస్కృతి)
జపాన్ లో ఇప్పటికీ మన దేవుళ్ళను ఆరాధిస్తున్నారు.. అది ఎంతలా అంటే ఒక అత్యున్నతమైన దేశానికే తలమానికమైన ఒక ప్రతిష్టాత్మక కట్టడం ముందు... ఆహ్వానం పలికేలా విగ్రహాలను ఏర్పాటు చేసేంతలా.. ఆ భవనం లోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా మన దేవుళ్ళను దర్శించుకున్న తర్వాతే సాధ్యమవుతుంది...
వాస్తవంగా జపానీయులు బౌద్ధమతాన్ని ఆరాధిస్తారు.. కానీ బౌద్ధమనేది హిందుత్వం నుంది చీలిన ఒక శాఖ.. అందుకే హిందుత్వమనేది వారి పుట్టిల్లు అని చెప్పవచ్చు.. వారు గణపతిని -- కాంగిటెన్ అని, సరస్పతిని -- బెంజైటెన్ అని, కుబేరుడిని-- బిశామౌంటెన్ అని , యముడిని - ఎన్మా అని, విష్ణు వాహనం గరుడుని - కరూర అని పూజిస్తారు... పిలుచుకుంటారు.. వారి విగ్రహాలకు చాలా పార్కులు కట్టించారు.. అవి సుప్రసిద్ధ స్థలాలుగా ఇప్పటికీ చెలామణీలో ఉన్నాయి..
సంస్కృతిలో హిందుత్వ పాత్ర ప్రత్యక్షంగా లేకున్నా ఖచ్చితంగా ప్రభావం ఎంతో ఉండి ఉంటుంది.. అందుకు నిదర్శనమే... పేరు మోసిన అత్యంత సుప్రసిద్ధమైన.. ప్రతిష్టాత్మక కట్టడం ఫుకు-ఓకు టవర్ కు ప్రారంభ స్థలంలో గణపతి, సరస్వతి, కుబేర(జపానీయులు/చైనీయులు లక్ష్మి కి ప్రతిరూపంగా కుబేరుని పూజిస్తారు) విగ్రహాల ప్రతిష్ఠాపన ... ఇంకా ఇక్కడ బ్రహ్మ విగ్రహం, అనేక ఇతర విగ్రహాలు ఉన్నాయి... ఎంత విలువిస్తున్నారో కదా.. టెక్నాలజీలో ప్రపంచాన్నే శాసిస్తున్నా తమ భక్తి ప్రపత్తులను ఏమాత్రం తగ్గకుండా ప్రదర్శించే దానిలో ఎప్పుడూ జపనీయులది ముందడుగే... ఎంతబౌద్ధ మత సాంప్రదాయలను అనుసరిస్తున్నా గణేష్,కుబేర, సరస్వతీ ప్రతిమలను చూస్తుంటే.... ఆశ్చర్యానందాలు కలుగటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.. నాగరికత ఒరవడిలో కొట్టుకుపోతున్న సమాజానికి నిజంగా జపాన్ వారు ఒక ఆదర్శం..


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML