గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 January 2015

ఛాందోగ్యోపనిషత్తు ఏ వేదంలో, ఎక్కడ ఉంది? ఛాందోగ్యోపనిషత్తు సామవేదంలో, తలవకార బ్రాహ్మణం లో ఉంది.ఛాందోగ్యోపనిషత్తు ఏ వేదంలో, ఎక్కడ ఉంది?
ఛాందోగ్యోపనిషత్తు సామవేదంలో, తలవకార బ్రాహ్మణం లో ఉంది.

ఛాందోగ్యోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఛన్దాంసి గాయంతి ఇతి ఛన్దోగాః -
ఛందస్సులను (వేదములను) గానము చేయుదురు గావున ఛందోగులు అంటారు. లేక ఛందస్సు లను (వేదములను) అధ్యయనం చేయుదురు గావున ఛందోగులు అంటారు.
ఛన్దోగులకు చెందినది గనుక చాన్దోగ్యమ్ అని పేరు వచ్చింది.
ఛందస్సు అంటే వేదము అని అర్థం ఉన్నా, సామవేదము అనే అర్థం రూడ్యర్థంగా గ్రహించబడుతుంది. అందుచేత సామవేదానికి చెందిన తలవకార బ్రాహ్మణము ఛాందోగ్య బ్రాహ్మణమని, అందులో భాగంగా ఉండుటచే ఈ ఉపనిషత్తును ఛాన్దొగ్యోపనిషత్తు అని అంటారు.

ఈ ఉపనిషత్తులోని మంత్రాలు ఎన్ని అధ్యాయాలలో ఉన్నాయి?
ఇందులోని మంత్రాలు 8 అధ్యాయాలలో విస్తరించి ఉన్నాయి.

సామవేదానికి చెందిన మహావాక్యం ఈ ఉపనిషత్తులో ఉందంటారు. ఆ మహావాక్యం ఏమిటి?
ఈ ఉపనిషత్తులో మహావాక్యం - "తత్త్వమసి". దీని అర్థం - "అది (అంతటా వ్యాపించి ఉన్న చైతన్యం) నీవు అయి ఉన్నావు".

ఈ ఉపనిషత్తు లోని ప్రత్యేకత ఏమిటి?
ప్రయోగాలతో సత్యాన్ని నిరూపించడం ఈ ఉపనిషత్తులోని ప్రత్యేకత.

ఛాందోగ్యోపనిషత్తులోని కథలలోని ప్రధాన పాత్రధారులెవరు?
ఈ ఉపనిశత్తులోని కథలలో ప్రధాన పాత్రధారులు - సత్యకాముడు, శ్వేతకేతువు-ఉద్దాలకుడు, నారదుడు-సనత్కుమారుడు, ఇంద్రుడు-విరోచనుడు-ప్రజాపతి, మొదలైనవారు.

సత్యకాముని కథలోని ప్రధానమైన అంశం ఏమిటి?
ఆభిజాత్యం కంటే గుణం, జిజ్ఞాస ప్రధానమని సత్యకాముడి కథ ఉపదేశిస్తుంది. ఇంద్రియాలనన్నిమ్తిని చైతన్యపరచేది ప్రాణం గనుక, అది ఉత్క్రుష్టమైనదని మరొక కథ నిరూపిస్తుంది.

గురుకుల వాసం రాగానే శ్వేతకేతునికి అతని తండ్రి ఉద్దాలకుడు వేసిన మౌలికమైన ప్రశ్న ఏమిటి?
"ఏ విద్యను అభ్యసించటం వలన వినశక్యం కానిది వినగలమో, చూడ శక్యం కానిది చూడగలమో, తెలియశక్యం కానిది తెలుసుకోగలమో, ఆ విద్యను మీ గురువు వద్ద నుండి అభ్యసించావా? అని ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతుని ప్రశ్నించాడు. ఈ ఉపనిషత్తులో ఈ ప్రశ్న తోనె సత్యశోధన మొదలౌతుంది.

కారణాన్ని (cause) తెలుసుకుంటే కార్యం (effect) సులభగ్రాహ్యం అవుతుందనడానికి ఉపమానాలేమిటి?
మట్టి ముద్దను తెలుసుకుంటే దాని నుండి ఏర్పడిన కుండ మొదలయిన వికారాలు తెలుస్తాయి. బంగారాన్ని తెలుసుకుంటే దానితో తయారైన ఆభరణాలు తెలుస్తాయి. కార్య రూపమైన (effect) కుండ, ఆభరణాలు అసత్యం - అవి మార్పుకు లోనవుతాయి, అశాశ్వతం గనుక. కారణ రూపమైన (material cause) మట్టి ముద్ద, బంగారం సత్యం. అవి మార్పుకు లోను కావు. శాశ్వతం గనుక. అలాగే నామ రూపాత్మకమైన విశ్వం అసత్యం, అనిత్యం; కారణ రూపమైన బ్రహ్మము సత్యం అని నిరూపించడానికి ఈ ఉపమానాన్ని వేదాంత శాస్త్రంలో ఉదహరిస్తారు. ఇదే దాని ప్రాముఖ్యం.

భేదాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
వేదాంతం మూడు రకాల భేదాలను ప్రస్తావిస్తుంది. మొదటిది 'స్వగత భేదం' - అంటే ఒక చెట్టు ఉందనుకోండి - దానిలో అంతర్భాగంగా ఉండే ఆకులు, పువ్వులు, కాయల నుండి చెట్టును వేరుగా పరిగణించడం; రెండవతి 'సజాతీయ భేదం' రెండూ చెట్లే అయినా మామిడిచెట్టు- వేపచెట్టు రెండూ వేరు వేరు; మూడవది 'విజాతీయ భేదం' కొండ కంటే నది వేరు. ఇక్కడ జాతి భేదం ఉంది. అద్వితీయం, నిరాకారం, నిరవయవం, నిర్గుణమైన బ్రహ్మానికి ఈ మూడురకాల భేదాలు ఉండవు.

బ్రహ్మ మొక్కటే! అని చెప్పే వాక్యం ఏది?
ఏకమేవ అద్వితీయం (6.2.1) అంటే సద్వస్తువు ఒకటే. దానిని పోలిన మరొక వస్తువు లేదు. మనవలె దానికి అవయవాలు లేవు గనుక స్వగత భేదం లేదు. మట్టి ముద్దకు బంగారపు ముద్దకు స్వగత భేదాలు లేవు. వాటి నుండి ఉత్పన్నమైన వస్తువులకు స్వగత భేదాలు ఉంటాయి అని ఉపనిషత్తు ప్రవచించింది.

అనేక జీవరాశులతో కూడిన ఈ సృష్టి పరమాత్మ సంకల్పం అని చెప్పే వాక్యం ఏది?
బహు స్యాం ప్రజాయేయేతి (6.2.3) అనే వాక్యం!
సృష్టికి పూర్వం ఏకంగా ఉన్న బ్రహ్మము తన మాయా శక్తి చేత అనేక జీవరాశులతో కూడిన, నామ రూపాత్మకమైన విశ్వంగా (బహుస్యాం) కావలెనని సంకల్పించింది. అట్లు విశ్వంగా వ్యక్తమై అందులో ప్రవేశించి నామ రూపాలను అభివ్యక్తం చేసింది, చైతన్యవంతం కూడా చేసింది.

'తత్త్వమసి' అనే మహా వాక్యం యొక్క అర్థం ఏమిటి?
సద్వస్తువు - అంటే, ఆత్మ - అణు ప్రమాణమైనది - కంటికి కనబడదు. దాని నుండే ఈ విశ్వం వ్యక్తమైంది. దాని కంటే ఇతరము లేదు. అందుచేత ఆ ఆత్మ నీవే! You are that తత్త్వమసి అనేది ఒక మహా వాక్యం. అద్వితీయమైన వేదాంత విషయాన్ని విశద పరచే వాక్యాలను మహా వాక్యాలంటారు (Great Sentence). అవి నాలుగు. అన్నీ కూడా ఆత్మ యొక్క ఏకత్వాన్ని సూచిస్తాయి.

తెలుసుకొన వలసినది ఏది?
తెలిసికొనదగినది విజ్ఞానము.
యదా వై విజానాత్యథ సత్యం వదతి నావిజానన్ సత్యం వదతి (7.17.1)
విజ్ఞానం తెలిసికొనదగినది. అపుడే సత్యం చెప్పడం సాధ్యం. విజ్ఞానం అంటే ఏమిటి? జీవ జాలంలో ఆత్మతో బాటు ప్రాణం కూడాఉంటుంది. ఇలా ప్రాణం కూడా సర్వత్ర ఉన్నందువల్ల ప్రాణాన్నే ఆత్మఅనుకుంటారు. అది అజ్ఞానం. మనిషి నడుస్తోంటే నీడ అనుసరిస్తుంది. కాని నీడ అసత్యం, మనిషి సత్యం. అట్లే నామ రూపాత్మకమైన ప్రాణం అసత్యం, ఆత్మ సత్యం. ఈ అవగాహన ఉన్నవాడే విజ్ఞానం ఉన్నవాడు. అతడే సత్యాన్ని చెప్పగలడు. ఆత్మ చైతన్య స్వరూపం. ప్రాణం (bio-energy) జడం. అందుచేత ఆత్మజ్ఞానమే నిజమైన విజ్ఞానం.

శరీరం అశాశ్వతం అని చెప్పే మంత్రం ఏది?
మఘవన్మర్త్యం వా ఇదగ్ం శరీరమాత్తం మృత్యునా (8.12.1)
ఆత్మతత్త్వం గురించి బోధించ వలసినదిగా ఇంద్రుడు ప్రజాపతి వద్దకు వచ్చి అర్థించినప్పుడు ప్రజాపతి అన్న మాటలివి. 'ఇంద్రా! మరణ ధర్మం కలిగిన శరీరం - అశాశ్వతం; అది ఆత్మకు భోగాధిష్ఠానం. అందుచేత శరీరమే ఆత్మ అనుకొని శరీరాన్ని సుఖ పెడుతూ భోగలాలసత్వంలో ఉండడం అవివేకం' అని ఉపదేశిస్తాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML