
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 19 January 2015
సూర్య భగవానునికి సమర్పించే పుష్పాలు .......లోకాలకు వెలుగును ... జీవులకు చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు.
సూర్య భగవానునికి సమర్పించే పుష్పాలు .......లోకాలకు వెలుగును ... జీవులకు చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆయన కదలికలపైనే సమస్త జీవకోటి ఆధారపడి వుంటుంది. అందుకే రుషి గణాలు ... దేవతలు ఆ స్వామిని ప్రతినిత్యం పూజిస్తూ ... సేవిస్తూ వుంటారు. అలాంటి సూర్య భగవానుడికి దోసిటతో అర్ఘ్యం వదిలి ఓ నమస్కారం సమర్పిస్తే సంతృప్తి చెందుతాడు. ఒకవేళ ఆ స్వామిని పువ్వులతో పూజించాలనుకుంటే, ఆయనకి ఇష్టమైన పువ్వులను సమర్పించ వలసి వుంటుంది.
పొగడలు ... మందారాలు ... సంపెంగలు ... పున్నాగలు ... గన్నేరులు ... తామరలు ... జాజులు ... గులాబీలు ... నాగకేసారాలు ... మొల్లలు ... మొగలి పూలు ... మోదుగలు ... అవిసెలు ... విష్ణు తులసి ... కృష్ణ తులసి సూర్య భగవానుడుకి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి.
ఇక ముళ్ళతో కూడిన పూలు ... సువాసన లేని పూలు ... నల్ల ఉమ్మెత్త పూలు .. గురివింద పూలు సూర్యుడి పూజకు పనికి రావని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన ఈ నియమాన్ని పాటిస్తూ పూజించడం వలన సూర్యుడి అనుగ్రహాన్ని పొందవచ్చుననడంలో ఎలాంటి సందేహం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment