గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 4 January 2015

వైకుంఠం అన్న పేరు స్వామి లోకానికి ఉన్నది. అంతేకాదు స్వామి పేరు కూడా వైకుంఠుడు. అందుకే "వైకుంఠః పురుషః ప్రాణః " అనే నామం మనకి విష్ణు సహస్రంలో కనపడుతూ ఉన్నది.

వైకుంఠం అన్న పేరు స్వామి లోకానికి ఉన్నది. అంతేకాదు స్వామి పేరు కూడా వైకుంఠుడు. అందుకే "వైకుంఠః పురుషః ప్రాణః " అనే నామం మనకి విష్ణు సహస్రంలో కనపడుతూ ఉన్నది. వైకుంఠుడు అని ఆయనకి పేరు. ఇక్కడ వైకుంఠ శబ్దమే చాలా విశేషం. "వికుంఠస్య భావమ్ వైకుంఠం" వికుంఠము, వైకుంఠము రెండూ ఒకే అర్థాలను తెలియజేస్తూ ఉన్నాయి. కుంఠము అంటే కుంటుతనము, అడ్డు అనే అర్థం వస్తున్నది. ఒక పరిపూర్ణత లేకుండా అడ్డుకోనేది ఏదో అది కుంఠత్వం. అలాంటి అడ్డుతనాలనీ, అపరిపూర్ణతలనీ అనగా లోటుపాట్లనీ తొలగించి ఒక సంపూర్ణమైనటువంటి తత్త్వాన్ని అందించడమే వైకుంఠములో ఉన్నటువంటి భావం. ఎక్కడైతే కుంటుతనము అనేది ఉండదో, లోటు అనేది ఉండదో, లోపమనేది ఉండదో, పరిపూర్ణమైన అఖండ సచ్చిదానందం ఉంటుందో దాని పేరు వైకుంఠము. అందుకు పరమాత్మ సంపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు. ఆయన తత్త్వమే లోకమంతా వ్యాపించి ఉంది. ఒక దీపం చుట్టూ వెలుగు ఉన్నట్లుగా స్వామి చుట్టూ వైకుంఠము ఉన్నది. ఆ దీపానికీ, వెలుగుకీ ఎలా భేదం లేదో స్వామికీ వైకుంఠానికీ అలాగే భేదం లేదు. విష్ణు తత్త్వమే వైకుంఠములో పరచుకొని ఉన్నది. అందుకే వైకుంఠ లోకం అనగానే విష్ణువుకు సంబంధించిన స్థితి మన మనస్సు విష్ణు మయమైపోతే ఆ హృదయమే వైకుంఠము. మన శరీరానికీ కుంఠత్వమున్నది. ప్రతిదానికీ ఒక పరిమితి ఉంది. ఆ పరిమిత కుంటుతనం అంటారు. ఆయన అపరిమితుడు. అదే వికుంఠతత్త్వంలోని గొప్ప తత్త్వం. అంతేకాదు లోకంలో ఒకదానినొకటి కలుపుతూ ఉంటాడుట. ఆ కలిపేటప్పుడు ఒకటి ఇంకొక దానికి అవరోధం కాకుండా ఎలా కలిపితే ప్రపంచం నడుస్తుందో ఆయనకి తెలుసు. అందుకే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - ఈ పంచ భూతములనీ పంచీకరణం చేస్తూ ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంటాడు పరమాత్మ. అలా కలిపి ప్రపంచాన్ని నడిపే వాడిని వైకుంఠుడు అని అంటారని శంకరులు వైకుంఠ శబ్దానికి అర్థం చెప్తూ భాష్యంలో రచించారు. ఇదేమాట మహాభారతం కూడా మనకి చెప్తోంది. అందుకు అటువంటి పరిపూర్ణమైన అఖండానంద స్వరూపమైన విష్ణు పదమును దర్శించడానికి జ్ఞాన ద్వారం తెరుచుకోవాలి. ఆ జ్ఞాన ద్వారమే వైకుంఠ ద్వారము. ఇంత విశేషమైన తత్త్వమిది.
ఈరోజున విశేషంగా చేయవలసిన పని ఏమిటంటే బ్రాహ్మీముహూర్తంలో నిదుర లేచి శుద్దులై విష్ణ్వారాధన రోజంతా ఉపవాసాది నియమాదులతో చేస్తూ ఉంటారు. విష్ణు పూజ, విష్ణు నామ సంకీర్తన, విష్ణు గానం, విష్ణు వ్రతం. ఈరోజంతా విష్ణుమయంగా జీవిస్తూ రాత్రి అంతా జాగరణ చేసి మరురోజు ద్వాదశినాడు స్వామి వారిని ఆరాధన చేసి అటుపై నివేదించిన పదార్థములను పారణ చేసి భుజించి ఈ వ్రతాన్ని సంపూర్తి చేస్తారు. అందుకే ఏకాదశికి, ద్వాదశికి అంత ప్రాధాన్యం ఉన్నది. పైగా ఈరోజున స్వామిని ధ్యానించవలసిన విధానము, నామము - కేశవ నామంతో స్వామిని ధ్యానించాలి. కేశవాది ఇరవై నాలుగు నామాలు మనకు ప్రసిద్ధి. అవి సృష్టిలో ఉన్న 24 తత్త్వములకూ సంకేతము. అదేవిధంగా గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరముల స్వరూపము. అలాగే మన ప్రాణ శక్తి కూడా మన వెన్నులోనుంచి ప్రయాణించేటప్పుడు ఆ వెన్నుపూసలు కూడా 24. ఒకదానికొకటి ఏవో తెలియని అనుబంధాలుంటాయి. అందుకే భారతీయ ఋషుల విజ్ఞానంలో ఉన్నటువంటి మార్మికమైనటువంటి ఈ సందేశం. మొత్తానికి కేశవ నామంతో ఆరాధించబడే నారాయణుని యొక్క స్వరూపం ఈరోజున మనం ప్రత్యేకించి పూజిస్తూ ఉంటాం. పైగా నారాయణుని స శంఖ చక్రం సకిరీట కుండలం - శంఖ చక్రములు ధరించి, ఇంకొక వైపు పద్మము, గద ధరించి, భుజాన శార్ఙ్గ ధనువును ధరించి, అంటే స్వామియొక్క ధనుస్సు పేరు శార్ఙ్గము. ఇలా ప్రకాశిస్తున్న విష్ణు స్వరూపాన్ని ధ్యానించాలి. "వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ!
శ్రీ మన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు!!
అని విష్ణు సహస్రనామాల చివర అనుసంధాన శ్లోకంగా చెప్పారు. వనమాల ధరించి ఉన్నాడు, దివ్యాలంకారంగా దాల్చి ఉన్నాడు స్వామి. పైగా పంచాయుధములు స్వామియొక్క ప్రధాన ఆయుధములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ నందకీ - ఈ పంచాయుధాల పేర్లు తలన్చుకున్నా మనం ధన్యులం అయిపోతాం. ఇవి గొప్ప రక్షా కవచాలు. అందుకే
శంఖం సదా హం శరణం ప్రపద్యే!
చక్రం సదా హం శరణం ప్రపద్యే!!
గదాం సదా హం శరణం ప్రపద్యే!
శార్ఙ్గమ్ సదా హం శరణం ప్రపద్యే!
ఖడ్గం సదా హం శరణం ప్రపద్యే!
సుదర్శన మనబడే చక్రము, పాంచజన్యమనబడే శంఖము, శార్ఙ్గమ్ అనబడే ధనుస్సు, కౌమోదకీ అనబడే గద, నందకము అనబడే ఖడ్గము - ఇవి ధరించి ఉన్నాడు స్వామి. ఇక పద్మము ధరించి ఉన్నాడు చేతితో. ఈ దివ్యమైన పద్మము జ్ఞాన ధర్మ శక్తికి స్వరూపము. ఈవిధమైన దివ్యాయుదాలతో నీలమేఘశ్యాముడై గరుడ వాహనారూఢుడైనటువంటి నారాయణుని ఈ దివ్య వైకుంఠ ఏకాదశీ పర్వమునాడు స్మరించి, ధ్యానించి ఆ ధ్యానంలోనే కాలాన్ని గడపడం గొప్ప యోగం. అటువంటి యోగాన్ని ప్రసాదించమని నారాయణుని ప్రార్థిస్తూ
సర్వం శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML