గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

ఆంజనేయ జననంఆంజనేయ జననం
”హనుమాన్ కల్ప వ్రుక్షోమే –హనుమాన్ మామ కామధుక్
చిన్తామనిస్తూ హనుమాన్ –కో విచారః కుతో భయం .”
ఒక సారి రాక్షస బాధలు భరించ లేక దేవతలంతా బ్రహ్మ దేవుని వెంట పెట్టుకొని శివుని దగ్గరకు వెళ్ళారు .అప్పుడ్డు ఆయన వాళ్ళందర్నీ తీసుకొని బదరికా వనం లో వున్న శ్రీ మహా విష్ణు వును దర్శించాడు .రాక్షస బాధలనుంచి రక్షించ మని అందరు వేడుకొన్నారు విష్ణు మూర్తిని ..రాక్షసులు తప్పక నశిస్తారని చెప్పి ,బ్రహ్మ తో సహా అందరి దేవతల తేజస్సును ,తన తేజస్సును కలిపి ముద్దగా చేసి శివునికి ఇచ్చాడు .ఈ తేజస్సు నుంచి బలవంతుడైన వానరుడు పుట్టి ,భయం తీరుస్తాడని అభయం ఇచ్చాడు శ్రీ హరి .
కొంత కాలమ్ తర్వాత పరమేశ్వరుడు ,పార్వతీ దేవి తో కలిసి భూమండలం అంతా పర్యటిస్తూ ,ఆంద్ర దేశం లోని వెంకటాచలం చేరారు .శేష శైలం మీద చిత్ర వనం లో ఆనందం గా విహరిస్తున్నాడు .ఆయనా ,ఆమె కపి రూపం తో విహరించారు .విష్ణువు ఇచ్చిన సకల దేవతా తేజస్సును పార్వతి గర్భం లో నిక్షిప్తం చేశాడు .ఆమె దాన్ని భరించ లేక అగ్ని దేవునికిచ్చింది .ఆయనుకు శక్తి చాలక వాయుదేవునికి అందించాడు .
పూర్వం రాదంతర కల్పం లో కశ్యపుడు అనే వెద వేదాంగ పారీనుడైన బ్రాహ్మణోత్తముడు వుండే వాడు .ఆయన శివుని గురించి పంచాగ్ని మధ్యమం లో తపస్సు చేశాడు .శివుడు మెచ్చి ప్రత్యక్ష మయాడు .కోరిక ఏమిటో చెప్పమన్నాడు .”శివా !నువ్వు నాకు పుత్రుని గా జన్మించాలి ”అని ఆ బ్రాహ్మణుడు కోరాడు .”తధాస్తు ”అన్నాడు పరమేశ్వరుడు .అక్కడే వున్న అగ్ని ,వాయువుదేవులు కూడా తమకు కూడా శివుడు పుత్రుని గా జన్మించాలి అని కోరారు .అలాగే అన్నాడు .ఆ కశ్యపుడే కేసరి అనే వానర శ్రేష్టునిగా జన్మించాడు .ఆయన భార్య మహాసాద్వి అయిన సాధ్య ఈమె గౌతమ మహర్షి భార్య అహల్యకు అంజనా దేవిగా జన్మించింది .ఆమె దేవతల అభీష్టం మేరకు కేసరికి ధర్మ పత్ని అయింది .కేసరి అరవై వేలమంది వానరులకు నాయకుడు .
ఆకాలం లో ”శంక సాధనుడు ”అనే రాక్షసుడు ,దేవ వానర రుషి గణాలను చిత్ర హింసలు పెట్టె వాడు .వారంతా బ్రహ్మ దగ్గర మొర పెట్టుకొన్నారు .ఆయన కేసరి కి మాత్రమే అతన్ని చంపే శక్తి వుందని ,ఆయన్ను శరణు కోరమని హితవు చెప్పాడు ఆయన దగ్గరకు వెళ్లి రక్షించ మన్నారు .అభయం ఇచ్చాడు కేసరి .శంకసాధనునికి తెలిసి ఆయనపై యుద్ధానికి దిగాడు .అతన్ని సంహరించి వారందరినీకాపాడాడు కేసరి .కేసరి ఆంటే సింహం అని అర్ధం కదా డాని బలం ముందు ఏదీ ఆగలేదు .


ఆకాలం లోనే వానర వీరులలో కున్జరుడు అనే గొప్ప వాడుండే వాడు. భార్య వింధ్యావళి సంతానం కలగలేదు .శివుని ధ్యానించాడు ,ఆయన కనిపించి సంతాన యోగం లేదనీ ,కొద్ది కాల౦ లో ఒక ఋషి పుత్రిక లభ్యం అవుతుందని ,ఆమెనే బిడ్డ గా పెంచుకొంటే ఆమె వల్ల సంతానం వృద్ధి చెందు తుందని హితవు చెప్పాడు .ఆ రోజు కోసం దంపతులు ఎదురు చూస్తున్నారు
గౌతమ మహర్షికి అహల్య వల్ల అంజనా దేవి అనే కుమార్తె పుట్టిందని చెప్పుకున్నాం వారికే శతానందుడు అనే కుమారుడు కూడా జన్మించాడు .అహల్యా శాపం సంగతి మనకు తెలిసిన కధే .ఆమె శిలగా మారింది .పిల్లల ఆలనా ,పాలనా చూసే వారు లేక పోయారు .నారదుని సలహాతో గౌతముడు శాతానండున్ని జనక మహా రాజు దగ్గరకు పంపాడు .ఆయన తర్వాత జనక ఆస్థానపురోహితుడు అయ్యాడు .అలాగే నారదుని మాట విని కున్జరునికి అంజనా దేవిని పెంచుకోవటానికి ఇచ్చాడు. ఆమె కున్జరుని పెంపుడు కూతురు అయిందన్న మాట .యుక్త వయస్సు వచ్చిందామెకు .తగిన వరుడి కోసం వెతుకు తున్నాడు ..శంబ సాధనుడి నుంచి తమల్ని రక్షించిన కేసరికి మేలు చేయాలని దేవతలు భావించారు .కేసరికి అన్జకు అంతా కలిసి వైభవం గా వివాహం చేశారు .
వారిద్దరికీ చాలా కాలం సంతానం కలగలేదు .కేసరి వంటి మహా వీరుణ్ణి కుమారునిగా పొందాలని అంజనా దేవి భావించింది .తాను వీర మాత అనిపించు కోవాలని ఆరాట పడింది .దైవానుకూలం కావాలని కేసరి ,అంజన తెలుసు కున్నారు భర్త అనుమతితో మన తిరుపతి దగ్గర వున్న వృషభాద్రి చేరింది .ఆకాశ గంగలో స్నానం చేస్తూ ,ఇంద్రియ నిగ్రహం తో తపస్సు ప్రారంభించింది. ఆమె యందు అనుగ్రహం తో వాయుదేవుడు రోజు ఒక ఫలాన్ని ఆమెకు అర్పించేవాడు .ఒక రోజు ,పార్వతి ,అగ్ని దేవుల ద్వారా తనలో చేరిన శివ తేజస్సును ఫల రూపం లో ఆమె ఒడిలో వేశాడు .ఆమె దాన్ని భక్తితో భుజించింది .ఆమె గర్భం ధరించింది .ధ్యానం మాన లేదు .ఒక రోజు ఆకాశవాణి “అంజన ! నీకు వ్రతభంగంలేదు దుఖిన్చవద్దు .భగవంతుని దయ వల్ల నీకు గొప్ప వ్యక్తీ జన్మిస్తాడు” .ఇది దేవతల అనుగ్రహం .నీ పాతివ్రత్యానికి భంగము వుండదు . కాల౦ గడిచింది వైశాఖ మాసం కృష్ణ పక్షం లో దశమి నాడు శనివారం పూర్వా భాద్ర నక్షత్రం లో వైద్రుతీ యోగం లో మధ్యాహ్న సమయం లో ,కర్కాటక లగ్నం లో అంజనా దేవికి ఆంజనేయుడు జన్మించాడు .బంగారు రంగు ,పింగళ వర్ణం గల నేత్రాలు ,స్వర్ణ హారం ,బంగారు యజ్ఞోపవీతం ,మణుల నూపురాలతో ,ధ్వజము ,వజ్రాయుధం ,అంకుశం ,గొడుగు ,పద్మం ,అనే శుభ చిహ్నాలు పాదాలలో వున్న వాడు ,పొడవైన తోక గల వాడు ,వజ్ర దేహంతో ప్రకాశించే వాడు పెద్ద దవడలు కలవాడు ,కటి సూత్రం కౌపెనం (గోచి) తో వున్న గొప్ప బాహువులతో విరాజిల్లు తున్న కపిరూపం లో ఆంజనేయ బాలుడు విరాజిల్లాడు .
దేవతలు పుష్ప వర్షం కురిపించారు .అంజనకు పుట్టిన వాడు కనుక ఆంజనేయుడు పేరు .కేసరి కుమారుడు కనుక కేసరినందనుడు .వాయువు వర ప్రసాదం తో పుట్టాడు కనుక వాయునందనుడు ,అనిల సుతుడు యాడు .అగ్ని తేజం కూడా వుండటం తో అగ్ని సంభవుడని శివ పార్వతుల తేజస్సు కల్గివుండటం తో పార్వతీ నందనుడనీ శంకర సుతుడని పిలువ బడు తున్నాడు .సకల దేవతల తేజస్సు తో జన్మించినందున సర్వ దేవాత్మకుడు అన్నారు .
”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః ”అందుకే ఆన్జనేయుడిని పూజిస్తేసకల దేవతలను పూజించినట్లే నని బ్రహ్మ దేవుడు చెప్పాడు .


ఆంజనేయుడు హనుమ అయిన కధ
ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు .ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని .ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది .అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు . .ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి .తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది . నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు .అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు .తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు .దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము ,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు .దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని ,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు .వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు .ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక ,ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు .అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు .వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు .ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది .మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు .దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు .దీర్ఘాయువు ,బలం ,పరాక్రమం ,ఆరోగ్యం తేజస్సు ,గుణం ,బుద్ధి ,విద్య ,విచక్షణ ,ప్రసన్నత ,చతురత ,వైరాగ్యం ,విష్ణు భక్తి ,దయ పర స్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు .వజ్రాయుధం చేత మరణం ఉండదని ,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగి పోవాల్సిన పరిస్థితి వస్తుందనిఅన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి ఆన్జనేయునికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు .విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని ,రామ కార్యం నేరవేరుస్తాడని ,శివునిలా దుష్ట సంహారం చేస్తాడని ,లంక లోని రాక్షసులను వదిస్తాడని ,త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరు తో పిలువ బడ తాడని ,,దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు .ఇలా ఆంజనేయుడు హనుమ గా మారాడు .
దేవతలిచ్చిన వరాలతో హనుమ విజ్రుమ్భించి సహజ మైన కోతి చేష్టలు చేస్తూ ,అందర్నీ బాధిస్తుందే వాడు .అతను భవిష్యత్ లో చేయ బోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన kram మునులు ఏమీ అనకుండా వుండే వారు .వాళ్ల గోచీలు లాగటం, మడి బట్టలు చిమ్పేయటం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి ”నీ సహజ శక్తిని మర్చిపోతావు ”అని శపించాడు తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుదవుతాడని అనుగ్రహించాడు .క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడనిపించుకున్నాడు .విద్య నేర్చే వయసు వచ్చింది .తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది .ఆయన దగ్గరకు వెళ్లి విద్య నేర్పని అడిగాడు .తాను అనుక్షణం తిరుగుతూంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు .తాను కూడా సూర్యుని తో పాటు కదిలి పోతూ ,విద్యలు నేర్చాడుఒక కాలు ఉదయపర్వతం మీద ,రెండోది పశ్చిమ పర్వతం మీద వుంచి శ్రద్ధ తో విద్య నేర్చాడు .అయిదు వ్యాకరణాలు నేర్పాడు .మిగిలిన నాలుగు నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో మన్నాడు .చేసుకుంటాను కాని నేను బ్రహ్మ చారి గానే వుంటాను దా౦పత్య సుఖం వుండదు .దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు .ఆమె అంగీకారం తో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు .వీరి కన్యాదానం జ్యేష్ట శుద్ధ దశమి నాడు జరిగింది .సువర్చల తపోనిష్ట తో గడుపు తోంది. గంధ మాదన పర్వతం మీద .హనుమ తల్లి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పాడు .ఆమె సంతోషించి ”నాయనా !నాకు వాలి ,సుగ్రీవుడు అనే సోదరులున్నారు .నీకు వాళ్ళు మేన మామలు .వారిద్దరికీ బద్ధ వైరం .అందులో సుగ్రీవుడు ధర్మ స్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడు గా వుండు .నీ పెద్ద మేన మామ వాలితో విరోధం మాత్రం పెట్టుకోకు .నీకు శుభం జరుగుతుంది ”అనిదీవించి పంపింది .
తల్లి మాట విని హనుమ పంపానదీ తీరం లో వున్న చేరి మంత్రి అయాడు .తర్వాత రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చిసీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా , జాడను లంకలో తెలుసు కోని ,రాముని ముద్రికను ఆమెకిచ్చి ,ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇ౦ద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుడి దర్బార్ కు వెళ్లి హిత వచనాలు చెపాడు .వినక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి ,మళ్ళీసీతా దేవిని దర్శించి, సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు .రాముడిసైన్యం సముద్రుని పై వారధి నిర్మించి లంకను చేరింది. రామ రావణ యుద్ధం లో చాల మంది రాక్షసులను చంపాడు హనుమ .రావణున్ని రాముడు సంహరించాడు .సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్చను తొలగించాడు .మైరావణ సంహారం చేసి శ్రీ రామ పట్టాభిషేకం జరిపించి ,సేవా తత్పరుడై ,రామ కార్య దురంధరుడై ,త్రేతా యుగం తర్వాత గంధ మాదన పర్వతం చేరి తారక నామం జపిస్తూ ,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ,భక్తుల మనో భీస్టాన్ని నెర వేరుస్తూ రామ భక్త హనుమాన్ గా ప్రజల హృదయం లో చిరస్థాయి గా వున్నాడు భక్త వరదుడైన శ్రీ హనుమ .


Story of birth of Lord Hanuman

Lord Hanuman is a Hindu God born as a son to Kesari and Anjana. Lord Hanuman is also known as Anjneya. Lord Hanuman is also known as Pawanputra means son of God Vayu. This story depicts why Lord Hanuman is Pawanputra Hanuman, the mighty monkey-god.

Anjana was a very beautiful attendant among various in the celestial palace-courts of Lord Brahma. Lord Brahma is a Hindu God of all creations living in a divine place in his heavenly abode. Once Lord Brahma happy with service of Anjana decided to bless her with a boon. Anjana asked to remove a curse given by a sage on earth. Anjana told him that when she was a child, immaturely she threw some fruits toward a monkey meditating with its leg folded in a lotus pose to make fun of him. But that was not a monkey but a powerful sage who assumed him in a monkey form to practice his and meditation. My behavior disturbed his penance and he cursed me that I would become a monkey when I will fell in love with anyone. I begged forgiveness but he couldn't take it back as it was already pronounced. But he assured me that in spite of my monkey face the man I fall in love with will love me.

Brahma told her to go to earth where she will get married and her curse will be removed by giving birth to an incarnation of Lord Shiva. Accepting Lord Brahma words Anjana took birth on earth and lived in a forest as young huntress. Once she saw a very heroic men struggling with a lion and she admired the warrior courage and power. As soon as that man turned to see Anjana, she turned into a monkey. Anjana cried in agony and covered her face seeing that man coming to her. When that man asked her about hiding her face she told her whole story and to her great surprise she found a big monkey-faced man standing before her because till now she saw him from a distance.

The monkey faced man told Anjana that he is not a human. He is blesses with boon by Lord Shiva to assumed human form whenever he want. He introduced himself as Kesari the king of Monkey with magical powers. Kesari asked Anjana for a marriage proposal which she accepted. Anjana did intense penance by worshipping Lord Shiva. Lord Shiva pleased with her asked for a boon in return she requested him to be born as her son. Lord Shiva agreed and blessed her.

Later on one day when Anjana was worshipping Lord Shiva, somewhere in other place Dasaratha, the king of Ayodhya, was performing a Putrakama Yagna (religious rite) to have a child. Pleased with Dasaratha the Fire-God provided him with sacred payasa (pudding) to share the payasa among all of his wives so they can have divine children. While Dasaratha was giving payasa to his elder wife Kausalya by divine ordinance a kite snatched a portion of a pudding and flew away from Ayodhya towards the forests Anjana lived and dropped the payasa where Anjana was engaged doing Penance.

Lord Vayu the god of wind saw this event and immediately trapped that portion of pudding and placed onto the spread-out hands of Anjana. Anjana saw something in her hands, wondering it as Lord Shiva‘s blessing she swallowed it. And later on she gave birth to a little monkey-faced boy and the child was called as Anjaneya or the son of Anjana. By giving birth to Lord Shiva's incarnation, Anjana got freed from the curse of the sage and express her wish to return to Heaven.

When Lord Anjneya ask her not to leave him she consoled him by saying that your father-the brave Kesari and your guardian spirit-the life-giving Vayu will always protect you. And fruits as red and ripe as a rising sun would be your food for nourishment. Saying so, Anjana kissed her son left back to her heavenly abode.


Hanuman meets Rama during the Rama's 14-year exile.[20] With his brother Lakshmana, Rama is searching for his wife Sita who had been abducted by Ravana. Their search brings them to the vicinity of the mountain Rishyamukha, where Sugriva, along with his followers and friends, are in hiding from his older brother Vali.
Having seen Rama and Lakshmana, Sugriva sends Hanuman to ascertain their identities. Hanuman approaches the two brothers in the guise of a brahmin. His first words to them are such that Rama says to Lakshmana that none could speak the way the brahmin did unless he or she had mastered the Vedas. He notes that there is no defect in the brahmin's countenance, eyes, forehead, brows, or any limb. He points out to Lakshmana that his accent is captivating, adding that even an enemy with sword drawn would be moved. He praises the disguised Hanuman further, saying that sure success awaited the king whose emissaries were as accomplished as he was.[20]
When Rama introduces himself, the brahman identitifies himself as Hanuman and falls prostrate before Rama, who embraces him warmly. Thereafter, Hanuman's life becomes interwoven with that of Rama. Hanuman then brings about friendship and alliance between Rama and Sugriva; Rama helps Sugriva regain his honour and makes him king of Kishkindha. Sugriva and his vanaras, most notably Hanuman, help Rama defeat Raavana and reunite with Sita.
In their search for Sita, a group of Vanaras reaches the southern seashore. Upon encountering the vast ocean, every vanara begins to lament his inability to jump across the water. Hanuman too is saddened at the possible failure of his mission, until the other vanaras and the wise bear Jambavantha begin to extol his virtues. Hanuman then recollects his own powers, enlarges his body, and flies across the ocean. On his way, he encounters a mountain that rises from the sea, proclaims that it owed his father a debt, and asks him to rest a while before proceeding. Not wanting to waste any time, Hanuman thanks the mountain, touches it briefly, and presses on. He then encounters a sea-monster, Surasa, who challenges him to enter her mouth. When Hanuman outwits her, she admits that her challenge was merely a test of his courage. After killing Simhika, a rakshasi, he reaches Lanka.

Hanuman reaches Lanka through flight and marvels at its beauty. After he finds Sita in captivity in a garden, Hanuman reveals his identity to her, reassures her that Rama has been looking for her, and uplifts her spirits. He offers to carry her back to Rama, but she refuses his offer, saying it would be an insult to Rama as his honour is at stake. In order to give Sita faith, Hanuman gives her a ring that Rama wanted Hanuman to give her. After meeting Sita, Hanuman begins to wreak havoc, gradually destroying the palaces and properties of Lanka. He kills many rakshasas, including Jambumali and Aksha Kumar. To subdue him, Ravana's son Indrajit uses the Brahmastra. Though immune to the effects of this weapon Hanuman, out of respect to Brahma, allows himself be bound. Deciding to use the opportunity to meet Ravana, and to assess the strength of Ravana's hordes, Hanuman allows the rakshasa warriors to parade him through the streets. He conveys Rama's message of warning and demands the safe return of Sita. He also informs Ravana that Rama would be willing to forgive him if he returns Sita honourably.
Enraged, Ravana orders Hanuman's execution, whereupon Ravana's brother Vibhishana intervenes, pointing out that it is against the rules of engagement to kill a messenger. Ravana then orders Hanuman's tail be lit afire. As Ravana's forces attempted to wrap cloth around his tail, Hanuman begins to lengthen it. After frustrating them for a while, he allows it to burn, then escapes from his captors, and with his tail on fire he burns down large parts of Lanka. After extinguishing his flaming tail in the sea, he returns to Rama.

In the Ramayana Hanuman changes shape several times. For example, while he searches for the kidnapped Sita in Ravana's palaces on Lanka, he contracts himself to the size of a cat, so that he will not be detected by the enemy. Later on, he takes on the size of a mountain, blazing with radiance, to show his true power to Sita.[21]
Also he enlarges & immediately afterwards contracts his body to out-wit Surasa, the she-demon, who blocked his path while crossing the sea to reach Lanka. Again, he turns his body microscopically small to enter Lanka before killing Lankini, the she-demon guarding the gates of Lanka.
He achieved this shape-shifting by the powers of two siddhis; Anima and Garima bestowed upon him in his childhood by Sun-God, Surya.

When Lakshmana is severely wounded during the battle against Ravana, Hanuman is sent to fetch the Sanjivani, a powerful life-restoring herb, from Dronagiri mountain in the Himalayas, to revive him. Ravana realises that if Lakshmana dies, a distraught Rama would probably give up, and so he dispatches the sorcerer Kalanemi to intercept Hanuman.[22] Kalanemi, in the guise of a sage, deceives Hanuman, but Hanuman uncovers his plot with the help of an apsara, whom he rescues from her accursed state as a crocodile.[22]
Ravana, upon learning that Kalanemi has been slain by Hanuman, summons Surya to rise before its appointed time because the physicianSushena had said that Lakshmana would perish if untreated by daybreak. Hanuman realizes the danger, however, and, becoming many times his normal size, detains the Sun God to prevent the break of day. He then resumes his search for the precious herb, but, when he finds himself unable to identify which herb it is, he lifts the entire mountain and delivers it to the battlefield in Lanka. Sushena then identifies and administers the herb, and Lakshmana is saved. Rama embraces Hanuman, declaring him as dear to him as his own brother. Hanuman releases Surya from his grip, and asks forgiveness, as the Sun was also his Guru.
Hanuman was also called "langra veer"; langra in Hindi means limping and veer means "brave". The story behind Hanuman being called langra is as follows. He was injured when he was crossing the Ayodhya with the mountain in his hands. As he was crossing over Ayodhya, Bharat, Rama's young brother, saw him and assumed that some Rakshasa was taking this mountain to attack Ayodhya. Bharat then shot Hanuman with an arrow, which was engraved with Rama's name. Hanuman did not stop this arrow as it had Rama's name written on it, and it injured his leg. Hanuman landed and explained to Bharat that he was moving the mountain to save his own brother, Lakshmana. Bharat, very sorry, offered to fire an arrow to Lanka, which Hanuman could ride in order to reach his destination more easily. But Hanuman declined the offer, preferring to fly on his own, and he continued his journey with his injured leg.

In another incident during the war, Rama and Lakshmana are captured by the rakshasa Mahiravana and Ahiravan), brother of Ravana, who held them captive in their palace inPatala (or Patalpuri) --the netherworld. Mahiravana keeps them as offerings to his deity. Searching for them, Hanuman reaches Patala, the gates of which are guarded by a young creature called Makardhwaja (known also as Makar-Dhwaja or Magar Dhwaja), who is part reptile and part Vanara.
The story of Makardhwaja's birth is said to be that when Hanuman extinguished his burning tail in the ocean, a drop of his sweat fell into the waters, eventually becoming Makardhwaja, who perceives Hanuman as his father. When Hanuman introduces himself to Makardhwaja, the latter asks his blessings. Hanuman enters Patala.
Upon entering Patala, Hanuman discovers that to kill Mahiravana, he must simultaneously extinguish five lamps burning in different directions. Hanuman assumes thePanchamukha or five-faced form of Sri Varaha facing north, Sri Narasimha facing south, Sri Garuda facing west, Sri Hayagriva facing the sky and his own facing the east, and blows out the lamps. Hanuman then rescues Rama and Lakshmana. Afterwards, Rama asks Hanuman to crown Makardhwaja king of Patala. Hanuman then instructs Makardhwaja to rule Patala with justice and wisdom.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML