గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 January 2015

భగవద్గీతలోని కర్మషట్కమును సరళంగా తెలిసికొనే ప్రయత్నంచేద్దామా

భగవద్గీతలోని కర్మషట్కమును సరళంగా తెలిసికొనే ప్రయత్నంచేద్దామా
1. అర్జున విషాదయోగము: అర్జునుడు అంటే సాధకుడు అని మనమందఱం సాధకులమే కదా ! విషాదము అంటే ఏడుపు అని అర్థం. యోగము అంటే మనం భగవద్గీత ను అనుసరించి పొందేస్థితి అని చెప్పవచ్చు అంటే ఉదాహరణకు కర్మయోగం అంటే కర్మని పొందేస్థితి, జ్ఞానయోగం అంటే జ్ఞానమును పొందేస్థితి, ధ్యానయోగం అంటే ధ్యానమును పొందేస్థితి అన్నమాట. మనకిప్పుడు ఒక సందేహం వస్తుంది అర్జునవిషాదయోగమంటే విషాదమును పొందే స్థితి అని కదా విషాదమును పొందడమేమిటి అని అంతేకదా ! విషాదము కి ఏడుపుకి గల తేడా తెలిస్తే ఈ సందేహం మనకి కలగదు. ఏడుపు అంటే ఏడుస్తూ ఉండే స్థితి దీని ఫలితం ఏడుపే కానీ , విషాదం అంటే ఏడుపుని తొలగించుకోవడం కోసం ఏడ్చే ఏడుపనమాట. ఆ ఏడుపుకి ఫలితం ముక్తి కాబట్టే అర్జునునివిషాదం యోగమయ్యింది. మనకి మన ఏడుపు రోగమయ్యింది.
2. సాంఖ్యయోగము: కిందపడి ఏడుస్తూ వచ్చిన బిడ్డని చూసి తల్లి ఏమంటుంది ప్రేమ అనే బంధంతో లేదులే లేదులే అంటుంది. వాడు అది నిజమే అనుకొని ఏడుపాపేస్తాడు. ఆ తల్లి లేదులే లేదులే అని దేనిగురించి అన్నదో, ఆ బిడ్డ లేదులే అంటే ఏమి లేదని అనుకున్నాడో మొత్తానికి ఏడుపైతే ఆపేస్తాడు. కానీ ఇక్కడ అదే ప్రక్రియ జరిగింది కానీ తల్లి లాగా స్వామి కి బంధంలేదు, బిడ్డ లాగా అర్జునునికి అజ్ఞానంలేదు. ఏది ఎందుకు లేదో, ఉన్నది అంటే ఎలా ఉంటుందో కార్యకారణాలతో చెప్పగలిగినది కాబట్టే ఇది సాంఖ్యయోగమయినది. నువ్వు బాధపడుతున్నావని నిన్ను ఓదార్చటానికి చెప్పే మాటలుకావు. నీ ఏడుపుతో సంభంధంలేకుండా ఉన్న నిజం సాంఖ్యం.
3. కర్మయోగం: పదోతరగతి తప్పిన విద్యార్థి తప్పాను అని ఏడుస్తున్నాడు. అది చూసిన మాష్టారు వాడి దెగ్గరకూర్చొని ఏవేవో చెప్పాడు. విద్యార్థి ఏడుపాపేశాడు. ఇప్పుడు మొదలయ్యేది ఏమిటి? ఆలోచించండి మిత్రులారా ఏముంది సెప్టెంబర్ లో పరిక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే కదా . ఇలా తన ఏడుపుని అధిగమించి నిజం తెలిసికొన్న సాధకుడు చెయ్యవలసిన సాధనగురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది కర్మయోగమయ్యింది.
4. జ్ఞానయోగం: నేను ఎందుకు తప్పాను? తప్పడానికి నేను చేసిన పొరపాట్లు ఏమిటి? నేను పాస్ అవ్వాలంటే నేను ఎలా ఆ పొరపాట్లని తీసెయ్యాలి అన్న విచారణనే సాధకుడు ఇక్కడా చేస్తాడు అది తనకు జ్ఞానమవుతుంది కాబట్టి ఇది జ్ఞానయోగమయ్యింది.
5. సన్న్యాసయోగం: నేను విద్యార్థిని. నాకు చదువుకోవడం అనే నియమం ఉంది. నేను ఆనియమంతో ప్రవర్తించాలి. నేను ఆనియమం తప్పాను. కాబట్టే పదో తరగతి తప్పాను. ఇప్పుడు అన్ని విషయాలని ఒదిలి ఈ నియమంతో ఉంటాను అని అన్ని విషయాలని ఒదిలి ఎలా ఆ విద్యార్థి ప్రవర్తిస్తాడో అదే సాధకుడు ఏ నియమాన్ని వదిలి అంతకుముందు ప్రవర్తించాడో ఆనియమాన్ని తెలిసికొని ఆనియమంతో ఉంటాడు అది తనకు సన్న్యాసమవుతుంది కాబట్టి సన్న్యాసయోగం.
6. ధ్యానయోగం: చివరికి ఆ విద్యార్థి తన పూర్వపుస్థితి ని మరచి ఆటలు, తిరుగుళ్ళు కట్టిపెట్టి కనీసం గుర్తుకుకూడా రాకుండా ఆ నియమాన్ని నిలుపుకుంటాడు. అట్లాగు సాధకుడు కూడా తన పూర్వ వాసనలను సైతం అధిగమించి తనని తాను నిలుపుకుంటాడు అది తనకు ధ్యానయోగమవుతుంది కాబట్టి ఇది ధ్యానయోగం. ఇది కర్మషట్కం. తదుపరి జ్ఞానషట్కంగురించి తెలిసికొందాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML