గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 January 2015

"గీత జ్ఞానం - జీవన సారం" సాంఖ్యయోగం"గీత జ్ఞానం - జీవన సారం" సాంఖ్యయోగం

నీవు ఏది ధర్మం అని నమ్ముతావో అది కార్య రూపంలో పెట్టు.నీ సమస్త సైన్యం నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే, నీ చేతిలో కత్తి లేకపోయినా,నీ వైపు కొద్ది మంది ఉన్నా మరేదైనా కానీ…రథ సారధివై మధ్యలో ఉండు, నీ శక్తి సామర్ధ్యాలను నమ్ముకో. ముందు కీడెంచి మేలెంచు…
ఒక్క సారి కార్య క్షేత్రంలో దిగిన తరువాత మానసిక వికల్పాలతో పని లేదు. అక్కడ గెలుపు ఓటములను ఎదుర్కోవడమే మంచిది. రెండూ సమానమే. ఇటువంటి గుణగణాలతో పని చేస్తే తప్పక విజయం సాధిస్తాం.


అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26

అర్జునా ! శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 27

పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || 28

జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి. అర్జునా !అలాంటప్పుడు విచారమెందుకు?

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29

ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు.

దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30

అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించనక్కరలేదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML