ఆద్యంతమంగళ మజాతసమానభావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబలపంచవినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం
( శివపురాణం)
" శివుడి " అంటే " పరమ మంగళ స్వరూపుడు" అని అర్ధం. ఆద్యంతముల యందు మంగళం గల పరిపూర్ణ శుభుడు - శివుడు. ఆయనకు సమానమైన భావం లేదు. ఆరాధ్యుడైన ఈశ్వరుడు జరామరణ వర్జితుడు. అతడే ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తున్నాడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన - అనే పంచముఖాలతోనున్న పరమేశ్వరుడు, సృష్టి స్థితి సమ్హారతిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాల వినోదం కలవాడు.

No comments:
Post a Comment