
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 12 January 2015
అమావాస్యల గురించి తెలుసుకుందాం
అమావాస్యల గురించి తెలుసుకుందాం
అమావాస్య
చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. అధి దేవత - చంద్రుడు . నెలకొక అమావాస్య చొప్పునాసంవత్సరానికి 12 అమావాస్ల్య్లుంటాయి . కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి . అమావాస్య కాలమానంలో చీకటి రోజు ... చంద్రుడుని చూడలేని రోజు . . . అయితే భూమండలం లో కొంతమందికే చీకటి , సగానికి చంద్రుడుకనిపిస్తాడు ... ప్రతివానికి ఏదో ఒక రోజు అమావాస్య వస్తుంది ... ఉంటుంది (చీకటి రోజు .. కష్టాలతో కూడుకున్న రోజు) .
అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకుముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, ఆ సమయంలో పితృదేవతలకు-అర్ఘ్యమివ్వడంవంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. ఆ తర్వాతఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే-ఆగిపోతారని పండితులు అంటున్నారు. అందుచేతఅమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు.
పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు -- దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులుచెబుతున్నారు. ఆ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయనివిశ్వాసం.
స్థూలంగా చెప్పాలంటే, తిథులు అంటే చంద్రుడి కళలు (Phases). వీటిల్లో అమావాస్య, పౌర్ణమి అంటే అందరికీ తెలుస్తుంది. భూమినుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా (నూట ఎనభై డిగ్రీల దూరంలో) ఉంటే అది పూర్ణిమ. ఇద్దరూ కలిసి ఉంటే (ఒకే డిగ్రీలో ఉంటే) అది అమావాస్య...సేకరణ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment