గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 15 January 2015

సంక్రాంతి మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు భోగి పండుగ.

సంక్రాంతి మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు భోగి పండుగ. రెండవ రోజు సంక్రాంతి. మూడవ రోజు కనుమ పండుగ (పశువుల పండుగ). భోగి పండుగనాడు కష్టకాలంలో వాడుకున్న చింపిరి చాపలు, విరిగిన కొయ్యలు భోగి మంటల్లో వేసి చలిని ఊరి నుంచి తరిమి వేసి వెచ్చని ఊహలతో భోగభాగ్యాలను చవి చూడటం మొదలు పెడతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుంది కాబట్టి ఆరోజు కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు పెడతారు. ఆనాటి సాయంకాలం పిల్లలపై భోగి పండ్లు పోయడం ఆచారం. భోగిపండ్లుగా రేగుపండ్లను వాడుతారు. వీటినే బదరీ ఫలాలంటారు. ఇవి విష్ణుమూర్తి స్వరూపాలే. పాపలపై ఆ ఫలాలను పోస్తే నిండార విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని విశ్విసిస్తారు.
రెండవ రోజు సంక్రాంతి. ఆ రోజు ఆడపడుచులను, అల్లుళ్లను ఆహ్వానించి ఆనందంతో పండుగ జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ. ఆ రోజు ఎవరూ ఎక్కడికీ ప్రయాణం చేయరు. ఆ రోజును ఆవులను, గేదెలను, కోడ దూడలను, పెయ్యలను, ఎడ్లను పసుపు కుంకుమలతో అలంకరించి తప్పెట్లు తాళాలతో ఊరేగిస్తారు. ఈ విధంగా సంక్రాంతిని మూడు రోజుల పాటు చూచువారలకు చూడ ముచ్చటగా జరుపుకుంటారు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML