గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 12 January 2015

* అందనంత ఎత్తులో ఆదిదేవుడు* అందనంత ఎత్తులో ఆదిదేవుడు

గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే - అని గణపతిని విద్యార్థులు, ధనార్థులు, ఈతిబాధల నుంచి ఉపశమనం పొందాలను కొనేవారు, ముక్తిపొందాలనే కోరికతో ఉన్నవారు ఇలా సామాన్యులు, అసామాన్యులే కాదు చివరకు పార్వతీ పరమేశ్వరులు కూడా పూజించందే ఏకార్యాన్ని మొదలుపెట్టరు. విఘ్నాలు లేకుండా తాము తలపెట్టిన కార్యము విజయవంతం కావాలని విఘ్నేశ్వరునికి మొక్కుతారు. ఇలాంటి ఈ దేవుడు అక్కడ ఇక్కడ అనే భేదాభిప్రాయం లేకుండా భక్తుల కోసం ఎక్కడైనా ఎపుడైనా తన స్వరూపాన్ని భక్తులకు కనిపింపచేస్తూ సంతోషింప చేస్తుంటాడు. ఆ దేవుడే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బైలడిల్లా అడవుల్లోని ఢోల్‌కాల్‌లో కొలువుతీరి భక్తులకు ఆశ్చర్యానందాలకు గురిచేస్తున్నాడు. ఈ వినాయకుని విగ్రహం చూచిన ప్రతివారినీ ఆకట్టుకుంటోంది. దంతెవాడ జిల్లా ప్రకృతి రహస్యాలకు నిలయం. ఇక్కడి గుహలు, జలపాతాలు, ఎతె్తైన కొండలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగల్గిన ఖనిజ సంపదలు ఆ జిల్లాకే సొంతం. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అంతా ఒకనాటి బస్తర్ జిల్లాలోనిది. కాకతీయులు బస్తర్ సామ్రాజ్యానికి కూడా తమ పరిపాలనను విస్తరించిన విషయాన్ని చరిత్ర చెబుతోంది.


అటువంటి అడవుల్లో దాదాపు వేల సంవత్సరాల కిందట నాగవంశస్థులు ఈ ప్రాంతంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటారని ఇక్కడ నివసించే ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఢోల్‌కాల్ గుట్టలపై కొలువు తీరిన ఈ వినాయకుడిని చేరుకోవడం చాలా కష్టం. నిటారుగా ఉండే కొండలు, వాటిని ఎక్కిన తర్వాత వచ్చే జలపాతాలు, అవికూడా దాటి ముందుకు వెళ్తే వచ్చే మరో కొండ, ఆ కొండ చిట్టచివరి ప్రాంతంలో కొలువు తీరిన ఈ వినాయకుడిని రోడ్డు మార్గం నుంచి దాదాపు 16 కి.మీలు గుట్టలపై ప్రయాణిస్తే కాని చేరుకోలేం. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నది పక్కన ఉన్న ఢోల్‌కాల్ కొండలపై కొలువుతీరిన వినాయకుడు ప్రపంచంలోనే ఎతె్తైన ప్రదేశంలో కొలువు తీరిన వినాయకుడని ఛత్తీస్‌గఢ్ వాసుల నమ్మకం. సాక్షాత్తు మునులు, రుషులు, ఈ వినాయకుడిని పూజించారని ఇక్కడి ఆదివాసీల విశ్వాసం. అంతేకాదు త్రిలోక సంచారి నారద మునీంద్రుడు కూడా ఈ గణపతిని దర్శించాడని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం వందల సంఖ్యలో భక్తులు మాత్రమే ఈ వినాయకుడిని దర్శించుకున్నారు. నిటారుగా ఉండే కొండలు, రహదారి సౌకర్యం కూడా లేని ఎతె్తైన కొండలు, కాకులు దూరని కారడవులు వంటి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కొలువై ఉన్న ఈ గణేష్ శిలారూపం మహా అద్భుతం. ఒక రహస్యం. ఈ గణేష్ అసలు ఇక్కడ ఎలా వెలిశాడు? ఎవరైనా చెక్కారా? తీసుకొచ్చి ప్రతిష్ఠించారా? అన్నది నేటికీ అంతుపట్టని రహస్యం. అసలు అక్కడికి వెళ్లడమే కష్టం. దాదాపు కొన్ని వందల కిలోల బరువుండే ఈ విగ్రహం అక్కడికి ఎలా చేరింది? చెక్కడం కూడా సాధ్యం కాని ఈ ప్రదేశంలో ఎలా ఉందనేది పెద్ద మిస్టరీ.

కాకతీయుల కాలం నుంచే...
కాకతీయులు గోదావరి పరీవాహకానికి ఇరువైపులా శివాలయాలు నిర్మించారు. వారు పరిపాలించిన ప్రాంతం అంతా దేవాలయాలు, అద్భుత శిల్ప కళాశోభితంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరింప చేస్తాయి. వరంగల్‌లోని వేయి స్తంభాలగుడి వంటి ఆలయాలు నిర్మించిన కాకతీయులే ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ఈ ప్రాంత వాసులు గట్టిగా నమ్ముతున్నారు. అటువంటి శిల్పకళా నైపుణ్యం ఆనాటిదేనని ఈ వినాయక విగ్రహాన్ని చూసిన వారు అంటున్నారు. సూదైన కొండపై, చుట్టూ లోయలు, ఏకశిలగా ఉండే పర్వత శిఖరంలో విగ్రహం వద్దకు చేరుకోవాలంటేనే సాహసమే అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా మావోయిస్టులకు అడ్డా. దండకారణ్యంలోని అబూజ్‌మడ్ పర్వత శ్రేణుల్లో ఈ ఢోల్‌కాల్ అటవీ పర్వతాలు ఉన్నాయి. అద్భుతమైన కళాఖండం ఈ ఆదిదేవుని శిలారూపం.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML