
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 19 January 2015
: సృష్టిస్థితిలయ కాలహరా శంకర సదా శివా.. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"
నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యంబకాయ’ త్రిపురాంతకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకంఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’.... ఓం రుద్రం పశుపతి స్ధాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కష్యతి
విశ్వేశ్వరా విరూపాక్షా విశ్వాంభారా సదా శివా నేను నీవు విశ్వేశ్వరుడవు ,ఈశ్వరుడవు ,ఈ జగమంతా ఈశ్వర
: సృష్టిస్థితిలయ కాలహరా శంకర సదా శివా.. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః"
"ఈ పూలతో శివుడిని పూజించాలి"
పరమశివుడు అల్పసంతోషి ... దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సముద్రమంత సంతోషపడతాడు. అడవిపూలతో పూజించినా ఆనందంతో పొంగిపోతాడు. ఆపదలో ఉంటే అమ్మలా పరిగెత్తుకు వస్తాడు. ఆందోళన చెందుతూ ఉంటే తండ్రిలా రక్షణగా నిలుస్తాడు. అందుకే అందరూ ఆదిదేవుడిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. భక్తిశ్రద్ధలతో ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు.
అనునిత్యం ఆ స్వామిని పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. సాధారణంగా స్వామివారి పూజకుగాను వివిధ రకాల పూలను ఉపయోగిస్తుండటం జరుగుతుంది. వీటిలో గన్నేరులు ... ఉమ్మెత్తలు ... జిల్లేడు ... పొగడలు ... మందారాలు మొదలైనవి ఆదిదేవుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఒక్కోరకం పూలతో శివుడిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుంది.
ఈ నేపథ్యంలో 'పొగడపూలు' కూడా ఎంతో విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా 'మార్గశిర మాసం'లో శివుడిని అర్చించడానికి 'పొగడపూలు' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ మాసంలో పొగడపూలతో శివుడిని పూజించడం వలన సంతోషంతో సంతృప్తిని పొందిన శివుడు, ఇహంలోను ... పరంలోను సుఖశాంతులను ప్రసాదిస్తాడు. అందువలన మార్గశిర మాసంలో మహాదేవుడి మనసును పొగడపూలతో గెలుచుకోవాలనే విషయాన్ని మరిచిపోకూడదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment