గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 12 January 2015

ఈ పాదాలకు అర్థం శ్రీరామ అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే అది వేయి సార్లు జపించిన దానికి సమానమని అర్థం.. అది ఎలా అంటే ????

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే!!
ఈ పాదాలకు అర్థం శ్రీరామ అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే అది వేయి సార్లు జపించిన దానికి సమానమని అర్థం.. అది ఎలా అంటే పూర్వం మన పదాలకు గణాలనీ.. ప్రతి అక్షరానికి ఒక విలువను కెటాయించి వాటిని సరైన క్రమంలో అమర్చి వ్యాకరణాన్ని, శాస్త్రాలను తయారు చేసారు.. దీనినే కటపయాది సూత్రం అంటారు..‘ పై ’విలువ కూడా ఈ పద్ధతి ద్వారానే కనుగొన్నారు.. ఇది ఎంత ఖచ్చితమైన దంటే దశాంశం ప్రక్కన ఇరవై మూడు అంకెలను కూడా గుర్తించదగినంత ఖచ్చితమైన సూత్రం.. అందుకే రామ నామ విలువను అంత గొప్పగా వివరించగలిగారు...
రామ నామము యొక్క ఇంకొక విశేషమేమంటే ఈ పదం నారాయణ మంత్రంలో ‘నారాయణ’ లోని రెండవ అక్షరం .. పరమ శివుని పంచాక్షరీ మంత్రం నమఃశివాయ లోని రెండవ అక్షరం రెండింటి కూర్పే.. రామ మంత్రం.. సాధారణంగా ఒక పద్యం లో వాక్యంలోని రెండవ అక్షరాన్ని యతి అంటారు...
నారాయణ మంత్రం లోని యతి..
నమఃశివాయ మంత్రం లోని యతి ల కూర్పే.. రామ మంత్రం..
సాక్షాత్తూ పరమ శివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన మంత్రంగా దీనిని చెపుతారు..
అందుకే అన్ని మంత్రాలలోకెల్లా రామ మంత్రం చాలా బలమైనది అని చెపుతారు..
ధ్యానమును ప్రారంభించే వారికి మొదట మంత్ర జపాన్ని కానీ నామ జపాన్ని కానీ అదీ శ్రీరామ మంత్రం తోనే ప్రారంభించే విధంగా గురుదేవులు ఉపదేశిస్తారు..
అందరికీ శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తుః
(పరిపూర్ణానంద స్వామి వారి ప్రవచనములలోచెప్పబడిన రహస్యమిది!!)


జైశ్రీరామ్ !!!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML