గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ........శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ........

శ్రీ నరసింహ స్వామి విష్ణు మూర్తి యొక్క దశావతారాలలో ఒక అవతారం. నర అనగా మనిషి (నరుడు), సింహం అనగా సింహం అనే మృగం. ఈ అవతారం లో విష్ణు మూర్తి సగం నరుడి రూపం లో మరో సగం సింహం రూపం లో దర్శనం ఇస్తారు. కనుకనే ఈ అవతారానికి నరసింహ అన్న పేరు వచ్చింది. శ్రీ నరసింహ స్వామికి నృసింహ, నరసింగ్, నరసింగ అనే పేర్లు కూడా కలవు. శ్రీ నరసింహ స్వామి యొక్క అవతారాన్ని అనేక పురాణాలలో, ఉపనిషత్తులలో మరియు అనేక హిందూ సాహిత్య కృతులలో వర్ణించటమైనది. స్వామి వారి యొక్క ఈ ఉగ్ర స్వరూపం అనేక వైష్ణవ భక్తులచే ముఖ్యముగా దక్షిణ భారత దేశము నందు మహా వైభవంగా నేటికి పూజలను అందుకుంటుంది.
శ్రీ నరసింహ స్వామి అవతారం యొక్క వ్రాత పూర్వక ఆధారాలు మనకు అనేక పురాణాలలో కనిపిస్తాయి. భాగవత పురాణం 7 వ అధ్యాయం , అగ్ని పురాణం 4.2 - 3 , బ్రహ్మాండ పురాణం (2 .5 .3 - 29 ), వాయు పురాణం (67 .61 - 66 ), హరివంశ (41 & 3 .41 - 47 ), బ్రహ్మ పురాణం (213.44 - 79 ), విష్ణు ధార్మోత్తర పురాణం (1. 54 ), కూర్మ పురాణం (1.15.18 - 72), మత్స్య పురాణం(161-163), పద్మ పురాణం(ఉత్తర కాండ 5.42), శివ పురాణం (2.5.43 & 3.10 - 12 ), లింగ పురాణం ( 1.95 - 96 ), స్కంద పురాణం (2.18.60 - 130 ) మరియు విష్ణు పురాణం ( 1.16 - 20 ) లలో నృసింహ స్వామి గురించి మనం చూడ వచ్చు. అంతే గాక ఋగ్వేదం లో ఉన్న ఒక పద ప్రయోగం విష్ణు మూర్తి యొక్క గుణగణాలను ప్రస్తుతిస్తుంది. స్వామి వారి యొక్క ఈ గుణగణాలు మనకు కేవలం నరసింహ స్వామి అవతారం లోనే కనిపిస్తాయి. ఈ వాక్యం ఏమంటుంది అంటే - "క్రూర మృగం, అతి భయంకరము, నిరంతర అన్వేషణ(వేట), గుహ సంచారి " అనే గుణాలను వర్ణిస్తుంది. స్వామి వారి ఈ నృసింహ అవతారానికి ఇంకా వేరే ఈ ఆధారాలు కావాలి?
భాగవత పురాణము నందు స్వామి వారి కథ ఈ రకంగా చెప్పబడింది. జగద్గురువైనటువంటి శ్రీ మహా విష్ణువు తన పూర్వ అవతరమైనట్టి వరాహ రూపం లో "హిరణ్యాక్షుడు" అని పిలువబడే ఒక రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఈ హిరణ్యాక్షునికి "హిరణ్య కశిపుడు" అని పిలువబడే ఒక సోదరుడు వుండే వాడు. తన సోదరుని మరణ వార్తను విన్న హిరణ్యకశిపుడు తీవ్ర కోపానికి గురై శ్రీ మహా విష్ణువును అతని భక్తులను ద్వేషించటం మొదలు పెట్టాడు. శ్రీ మహా విష్ణువు ను ఎలాగైనాను సంహరించాలని కృత నిశ్చయుడై అందుకు కావలసిన శక్తులను సంపాదించ నెంచి "బ్రహ్మ" కోసం అనేక సంవత్సరాలు మండరాచలం అనే పర్వతం పై ఘోర కీకారణ్యములో ఘోర మైన తపస్సు చేసాడు. అట్టి తపమును మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశిపునకు సాక్షాత్కరించి " పుత్రా ! నీ తపస్సునకు మెచ్చాను. కోరుకొనుము, ఏ వరమడిగినను ప్రసాదించెదను" అని పలికెను. అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ ను ఈ విధంగా కోరెను. " ఓ ప్రభూ ! వరదాయకా, దయార్ద్ర హృదయంతో నను కరుణించిన నీవు, నేనడిగిన వరమును ప్రసాదించ దలచితే ఇదే నేను కోరే వరము - ఈ సృష్టి లో ఏ ఆయుధం చేతనైన గాని, ఏ మనిషి చేత గాని జంతువు చేత గాని, ఈ భూమ్మీద ప్రాణమున్న ఏ ప్రాణి చేత గాని, వస్తువు చేత గాని కిన్నెర కింపురుష యక్ష గంధర్వాది దేవ గణాలచేత గాని, పాతాళము నందున్న ఏ కాల సర్పము చేత గాని , నా ఇంటి గడప లోపల గాని వెలుపల గాని , పగలు గాని రాత్రి గాని నకు మరణమే సంభవించకుండా వరమునివ్వు. అంతే గాక ఈ విశ్వాన్ని అంతటిని ఏలే ఏకైక సార్వభౌమునిగా శక్తి సంపన్నున్ని చేయుము ".
ఇది ఇలా ఉండగా హిరణ్య కశిపుడు తపస్సు చేయుచున్న సమయమున, ఇంద్రుడు హిరణ్యకశిపుని గృహము పై దాడి చేసెను. ఆ సమయం లో హిరణ్య కశిపుని సతీమణి లీలావతి ని నారదుడు ఇంద్రుని బారి నుండి రక్షించి గర్భవతి గా ఉన్న తనకు రక్షణ కల్పించ టానికి తన వెంట తన ఆశ్రమానికి తీసుకు వెళ్తాడు. అక్కడ లీలావతి గర్భం లో ఉన్న ప్రహ్లాదుడు నారదుని ప్రవచనాలు విని పుట్టక ముందు నుండే శ్రీ మహా విష్ణువు కి గొప్ప భక్తుడు గా మారిపోతాడు. ఆ తరువాత లీలావతి నారదుని ఆశ్రమం లోనే ప్రహ్లాదునికి జన్మనిస్తుంది. తపస్సుని పూర్తి చేసుకుని వచ్చిన హిరణ్య కశిపుడు లీలావతిని, ప్రహ్లాదుని తన స్వగృహానికి తీసుకెళ్తాడు. నారదుని ప్రవచానాలచే ప్రభావితుడైన ప్రహ్లాదుని నారాయణ భక్తి హిరణ్య కశిపుని ఆగ్రహానికి కారణమైంది. అనేక విధాల ప్రయత్నించి తన కుమారుని చేత హరి భక్తి మాన్పించ లేక విసిగి వేసారిన హిరణ్య కశిపుడు ప్రహ్లాదున్నిచంపమని ఆదేశిస్తాడు. కానీ హరి భక్తి తో నిండిపోయిన ఆ బాలుని ప్రాణాలు తీసే అన్ని ప్రయత్నాలు విఫలమైనవి. అంతే గాక నేనే విశ్వానికి సార్వభౌమున్ని అనుకుంటున్న తన తండ్రి తో ఏకీభవించక ఈ జగద్గురువు ఆ శ్రీమన్నారాయనుడే అని నొక్కి వక్కాణించాడు. ఈ జగమంతా ఆవరించి వున్నాడు అని కూడా చెప్పాడు. అప్పుడు హిరణ్య కశిపుడు అటులైన నీ హరి ఈ స్థంభములో ఉండునా అని దగ్గరలో ఉన్న ఒక స్థంభమును తన గదతో ప్రగులగొట్టాడు. ఆ స్థంభము ఫటా పంచలై, మిరుమిట్లు గొలిపే కళ్ళతో, రత్నముల వలె మెరుస్తున్నతన చేతి గోళ్ళను పంజా వేసి చూపిస్తూ ఉగ్ర భయంకర స్వరూపం తో విష్ణుమూర్తి బయటకు వచ్చాడు. హిరణ్య కశిపుని కోరిక ప్రకారం నరుడు కాదు , మృగము కాదు నరసింహుడు , ఈ ఆయుధం లేకుండా తన చేతి గోళ్ళతో, ఇంటి బయట లోపల కాకుండా గడపపైన, పగలు కాక రాత్రి కాక సాయం కాలం లో హిరణ్య కశిపుని చంపి దుష్ట సంహారం గావించాడు శ్రీ హరి.
ఆ విధంగా నరసింహుడు దాల్చిన ఉగ్ర స్వరూపంను ఉపసంహరింప చేయటం ఎవరి వల్ల కాలేదు. బ్రహ్మ, మహేశ్వరులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైనవి. శ్రీ మహా విష్ణువు అర్థాంగి అయినటువంటి శ్రీ మహా లక్ష్మి కూడా ఏమీ చేయలేక పోయింది. చివరకు అందరు కలిసి ప్రహ్లాదున్నిచేరి ఇలా అన సాగారు - "ప్రహ్లాదా! నరసింహుడు నీ కోసం అవతరించిన వాడు. నీవు కోరితేనే తన ఉగ్ర స్వరూపాన్ని ఉపసంహరించ గలడు". అప్పుడు ప్రహ్లాదుడు తన భక్తి హృదయంతో ప్రార్థించగా నరసింహుడు తన కోపాగ్ని ని చల్లార్చుకుంటాడు.
అలా నరసింహుడు తన భక్తులకు తీరని కష్టం వాటిల్లినప్పుడు తప్పక ఆదుకుంటాడు అని రుజువు చేయబడింది. అంతే గాక ఆది శంకరాచార్యులు ఒక కపాల మాంత్రికుడి చేత కాళికా దేవి కి బలి కాబోతున్న సమయంలో కూడా నరసింహ స్వామి ఆదుకుంటాడు. ఆ మహిమను గుర్తించుట చేతనే ఆది శంకరుడు "లక్ష్మే నృసింహ స్తోత్రము" ను రచించెను.....ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML