భగ్వద్గీత గంగ కంటే ఉత్తమమైనది. గంగలో స్నానం చేసినవారికి మాత్రమే ముక్తి లభిస్తుంది. కానీ, గీతా రూపమైన గంగలో మునకలు వేసిన వారు , తాము ముక్తులవడమే కాక, ఇతరులను కూడా తరింపచేస్తారు. ఙ్ఞాన, భక్తి, నిష్కామ, కర్మ తత్త్వ రహస్యాలను గీతలో చెప్పినట్లు, మరే ఇతర గ్రంథాలలో చెప్పబడలేదు. సర్వ కర్మ ధర్మ మర్మములను బోధించు ఉత్తమగ్రంథం " గీత" .
కాలం ఎవరింకోసం ఆగదు. మృత్యువు ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు.ముసలితనంలోనే కాక, బాల్య యవ్వన దశలో కూడా మృత్యువు సంభవించవచ్చు. ముసలితనం పైబడిన తరువాత శరీరంలో శక్తి నశించి, ధ్యానం చేయడానికి కూడా కుదరకపోవచ్చు. అందుచేత శక్తి సామర్ధ్యాలు నశించక ముందే , ధ్యానం చేయమని భగవంతుడు చెప్పాడు. ఎవరు మరణం సమయంలో నన్ను స్మరింతురో , వారే నన్ను పొందుతారు" అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు.
యోగ, భక్తి ఙ్ఞానములతో విస్తరింపబడిన భగవ్ద్గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతముండదు. అంతే కాకుండా అభ్యసిస్తున్న కొలదీ, అందులో కొత్త అర్ధాలు స్ఫురిస్తూ ఉంటాయి. ఙ్ఞానేశ్వరుడు అనే యోగి గీత గురించి ఈ విధంగా చెప్పాడు " వివేక వృక్షములకు తోట గీత , పరమార్ధ సిద్ధాంత రత్నఖని, తెరువబడియున్న పరంధామం. సర్వ ధర్మాలకు మాతృభూమి. ఙ్ఞానామృత పూర్ణ గంగ! సరస్వతి లావణ్య రత్న భాండాగారం. వివేకమును క్షీరసముద్రం యొక్క నవలక్ష్మీ" ఇదే భగవద్గీత యొక్క మహా విశిష్టత.
భగవద్గీతలోని ప్రతి అక్షరంలో దైవత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే ఈ గ్రంథం ప్రపంచంలోని అనేక భాషలలో అనువాదింపబడినది. అందు చేత చదవగలిగిన ప్రతి ఒక్కరూ, తమ జీవిత కాలంలో భగవద్గీతను సంపూర్ణంగా ( 18 అధ్యాయాలు) ఒక్కసారైనా చదివి జన్మను ధన్యఒ చేసుకోవాలి. భగవద్గీత అధ్యయనం, అధ్యాపనం, ఆచరణ వల్ల చాలా మంది ఋషులు, గృహస్తులు ఉత్తమ గతిని పొందారు. శ్రీ శంకరాచార్యులు వారు, శ్రీ రామానుజాచార్యులు వారు మొదలైన మహానుభావులు ఈ గ్రంథాన్ని పఠించి మనకు బోధన చేసారు.
భగవానుని మంచి మాటల మూట..భగవద్గీత!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment