గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 4 January 2015

ద్వాపరయుగంలో మధురా నగరంలో " సుధాముడు " అనే భక్తుడుండేవాడు .ద్వాపరయుగంలో మధురా నగరంలో " సుధాముడు " అనే భక్తుడుండేవాడు . రకరకాల పూలదండలు కట్టి రాజుగారైన కమౌనికి సమర్పించడం అతని వృత్తి. ఒకానొక సమయంలో బలరామకృష్ణుల మేనమామ కంసుడు, ఆ ఇద్దరినీ చపించే ఉద్దేశాన్ని తన మనసులో పెట్టుకొని, నేను ధనుర్యాగం చేయబోతున్నాను రండి! " అంటూ మధురానగరానికి వారిని పిలిచాడు.

మేనమామ ఆహ్వానాన్ని మన్నిమ్చి బలరామకృష్ణులు మధురానగరానికి వచ్చారు. మధ్యాహ్నమవుతుండగా, వారిద్దరూ సుధాముడి ఇంటికి వెళ్ళారు. సుధాముడు భక్తిశ్రద్ధలతో వారిని యధోచితంగా సత్కరించి ఆతిధ్యమిచ్చాడు. దానికి శ్రీ కృష్ణుడు చాలా సంతోషించి, సుధాముణ్ణి " ఏదైనా వరం కోరుకో ! ఇస్తాను అన్నాడు. అప్పుడు సుధాముడు శ్రీ కృష్ణుని మూడు వరాలు కోరాడు.


లక్ష్మీ దేవి నిరంతరం విష్ణుమూర్తి పాదాల వద్దనే కూర్చొని, అతని పాదలనొత్తుతూ ఉంటుంది. త్రేతాయుగంలో ఆదిశేషుడు లక్ష్మణుడుగా జన్మించి, శ్రీ రాముడుగా అవతరించిన విష్ణుమూర్తిని సేవించాడు. ఆ ఋణం తీర్చుకోవటానికన్నట్లుగా ద్వాపరయుగంలో విష్ణుమూర్తి, శ్తీ కృష్ణుడుగా జన్మించి, అన్న బలరాముడిగా అవతరించిన ఆదిశేషుడిని సేవించాడు. ఈ పాదసేవనం అనే విషియం అంత విశేషమైనది. పవిత్రమైనది. కాబట్టి సుధాముడు ముందుగా " నీ పాదపద్మాలను సేవించుకొనే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు స్వామి అన్నాడు. ఇది ఆయన కోరిన మొదటి వరం. భగవంతుడి పాదపద్మాలు మనకు అందుబాటలో ఉండేవి కాదుకదా అని చింతించవలసిన పని లేదు. మనలను కని, పెంచే తల్లితండ్రులు మన కంటికి కనిపిస్తున్న దేవతలు. విద్యాదానం చేసిన గురువులు మనకు దైవతుల్యులే.

వారి పాదాలను సేవిస్తే భగవంతుని పాదాలను సేవించినట్లే! పాద సేవ మనకు వినయవిధేయతను నేర్పుతుంది. రెండవది నెయ్యం - స్నేహం. కడుబీదవాడైన కుచేలునికీ ద్వారకాధినాధుడైన శ్రీ కృష్ణపరమాత్మ మధ్యన ఉన్న మైత్రి అందరికీ ఆదర్శప్రాయమైనది. స్నేహమంటే ఆవిధంగా ఉండాలి. ద్రోణ ద్రుపదుల మైత్రి లాగా కాదు. భగవద్భక్తులతో స్నేహం చేస్తే చాలు, భగవంతుడితో స్నేహం చేసినట్లే లెక్క! దీనికి భగవంతుడికీ, భక్తునికీ మధ్య బేధం లేనే లేదు, అనే నారద భక్తి సూత్రమే (41) మనకు ఓరమ ప్రమాణం. ఈ కారణంగానే సుధాముడు " నీ పాదాలను పూజించే వారితో స్నేహాన్ని ప్రసాదించు స్వామీ" అని కోరాడు.

మూడవది - భూతదయ. ఇది మాములు భూతదయ కాదు. నిరంతరమైన, అపారమైన భూతదయ. ఎల్లప్పుడూ కొనసాగుతుండే అత్యధికమైన భూతదయ. ఈ భూమి మీద నివసిస్తున్న సమస్త క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, సింహశార్దూలహరిణాది క్రూర, సాధు జంతువులు అన్నీ భూతాది జీవులే. వీటి అన్నింటిపట్ల సముచితమైన దయ కలిగి ఉండేది మనం. దయ కలిగిన హృదయాలే దైవమందిరాలు. మనము అందరము ఆవిధంగా దయాబుద్ధి కలిగి ఉన్నట్లయితే ఆ భగవంతుడు మన హృదయాలనే తన నివాసంగా చేసుకుంటాడు. అటువంటి భూతదయనే ప్రసాదించవలసిందిగా శ్రీ కృష్ణుని సుధాముడు అడిగాడు.

ఇదే అణుకువతో స్వామిని సేవించుక్జ్న వారిలో అర్జునుడు మనకునాదర్శంగా కనబడుతూంటాడు.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML