భారతీయ భూమి కను తిరస్కరిస్తూ 150 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటిష్ పరిపాలకులు 'ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం' ఈ దేశం లో ప్రవేశపెట్టారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమనేది కేవలం ఒక వాదనే తప్ప వాస్తవం ఎంతమాత్రం కాదు. తదనంతరకాలంలో లభించిన ఆధారాలను, ప్రమాణాలను బట్టి ఈ దురాక్రమణ సిద్ధాంతం తిరస్కరింపబడుతోంది. అయినా ఈనాటికీ కూడా మన పాఠ్యపుస్తకాలలో, అదే సిద్ధాంతం, తరం తర్వాత తరంగా, బోధింపబడుతూ కొనసాగుతూ వస్తూవుంది.
పురాణాలులో ఒక శ్లోకం తెసుకొని దానికి ద్వంద అర్ధం తీస్తూ ఆర్య సిద్ధాంతం అనేది నిజము అనే ఓ మేదావులరా భారతీయ ప్రాచీన వేదశాస్త్ర గ్రంథాలలోగాని, ఇతి హాస పురాణాలలో గాని, ఈ దండయాత్ర లను గురించి ఎక్కడా ఒక్క వాక్యం కూడా చెప్పలేదు. దక్షిణ భారత దేశపు ద్రావిడ సాహిత్యం కూడా ఎక్కడా ఈ ఆర్యుల దండయాత్ర గురించిన సూచనలు కూడా లేనే లేవు.
నేనధ్యయనం చేసినంతమేరకు ఋగ్వేదంలోని మంత్రాలలో ఆర్యులు ఎక్క డ్నుంచో క్రొత్తగా వచ్చినవారు కాదనీ, వారు ముఖ్యంగా ఇండోయూరోపియన్లుగా భారత్‌లో ప్రవేశించ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఆర్యులు తెగకాదు ఆర్య అంటే గౌరవం సూచక పదం ఉత్తర భారతీయులు . అని కాదు . మండోదరి అనేక సందర్బాలులో రావణుడి ని ఆర్య పుత్ర అని సంబోదించింది రామాయణం చదివిన వారికీ తెలుస్తుంది
సరే ఈ వాదనలు ఇవన్నీ భారతదేశంలో తమ వలస సామ్రాజ్యాలను సుస్థిరం చేసు కునేటందుకు, తమదైన మతాన్ని ఈ దేశంలో వ్యాపిం పచేసేందుకు మాత్రమే బ్రిటీష్ వారు మొదలుపెట్టారు. 150 సంవత్సరాలకు ముందు భారతీయులెవ్వరికీ వైదికసాహిత్యం, అది రచించబడిన సంస్కృతభాషలు, తమవి కాదని, అవి ఎక్కడ్నుంచో వచ్చాయన్న ఆలోచన ఊహామాత్రంగా కూడా తెలియదు.
ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు చారిత్రక విద్వాం సులుగాని, పురా తత్త్వ శాస్త్రవేత్తలు గాని కానే కారు. ఈ సిద్ధాంత ప్రారంభకుడైన మాక్స్‌ముల్లర్‌ను బ్రిటీష్ వారికి చెందిన ఈస్టిండియా కంపెనీ తమ వలసవాద సిద్ధాంత ప్రచారకుడుగా ఒకానొక ఉద్యోగిగా స్వీకరించింది.
గత 30 ఏండ్ల కాలంలో ఋగ్వేద కాలపు సరస్వతీ నదీ. అది ప్రవహించిన త్రోవలు కనుగొన బడ్డాయి. పంజాబులో మొహంజోదారో హరప్పా త్రవ్వకాలు గుజరాత్లో లోథాల్, ధోలావీరా త్రవ్వకాలు, హర్యానా ప్రాంతంలో కునాల్ త్రవ్వకాలలో ప్రాచీన వైదిక కాలం లోని యజ్ఞవేదికలు, యాపస్థంభాలు బయటపడ్డాయి. అలాగే ఆ త్రవ్వకాలలో బయటపడిన భాష వైదిక సం స్కృత కుటుంబానికి చెందినది. ఇవన్ని కూడా ఆర్యుల దండయాత్ర సిద్దంతం అబద్దము అని తెలియచేసేవే
ఇదేదో హిందుత్వవాదమో మరొకటో అని అపార్థం చేసుకోకండి. సరే విషయానికి వద్దాము. నిజానిజాలు ఎంత? తెలియలిసిన అవసరం ఉంది
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని "ఆర్యపుత్రా" అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.
2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" రహస్య సమావేశ తీర్మానం
"ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్‌వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు."
(వనరు:Proof of Vedic Culture's global Existence - by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్‌ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
"నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత "గొప్పగా" మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది."
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన "విలియం జోన్స్",మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ "ఆర్య" శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన "Who were the sudras?" అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో " పాశ్చాత్యులు సృష్టించిన "ఆర్యజాతి" సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది"
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో "ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు".
4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన "సింధు నాగరికత"తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్‌వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే "ఆర్య" శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది 'గుర్రాలపై దండెత్తి" ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.
1980లో ఉపగ్రహాల ద్వారా 'సరస్వతీ' నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్‌వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.
No comments:
Post a comment