గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

అరటితొక్కఅరటితొక్క
=======
అసహజంగా అనిపిస్తుంది కదూ! కాని, అసహజమేమి కాదు. ఇది భారతదేశంలో దొరికే సాధారణ పండ్లలో ఒకటి మరియు దీనిని ఎందుకు మనం రుచిగా, ఇష్టంగా వాడమో తెలీదు. మీరు అరటి తొక్కను చెత్తబుట్టలో పడవేసే ముందు, అరటితొక్కవలన కలిగే లాభాలను తెలియచేసే ఈ వ్యాసాన్ని చదవండి. దీనివలన అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు.

అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో విటమిన్లు B-6, B-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అరటి తొక్క నల్లరంగులోకి ఉన్నప్పుడు చక్కెర కంటెంట్ అత్యధికంగా ఉన్నదన్నమాట. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన బహుమతి యొక్క గొప్ప ప్రయోజనాలు చూద్దాం: అరటితొక్క వలన ఉపయోగాలు:


దంతాలు: అరటితొక్కతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటంవలన మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి.

పులిపిర్లు: అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం.

అరటి తొక్కలను కూడా ఆహారంగా తీసుకోవొచ్చు. అద్భుతమైన ఇండియన్ వంటకాలలో వీటిని వాడుతుంటారు. లేత చికెన్ ను దీనిమీద ఉంచి ఉపయోగిస్తారు.

మొటిమలు: మొటిమలు తగ్గటానికి అరటితొక్కతో మీ ముఖాన్ని మరియు శరీరాన్ని ఐదు నిముషాలపాటు మర్దన చేయండి. మీకు వారంలోపల మంచి ఫలితం కనపడుతుంది. ఇలా మొటిమలు మాయమయ్యేవరకు చేయండి.

ముడతలు:- మీ శరీరం హైడ్రేట్ అవటానికి అరటితొక్క సహాయపడుతుంది. మెత్తగా చేసిన అరటితొక్కతో గ్రుడ్డు సొనను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి, ఐదు నిముషాలు అలానే వదిలేయండి. ఐదు నిముషాల తరువాత కడగండి. అరటితొక్క లోపలి భాగంతో కంటి చుట్టూ సున్నితంగా రుద్దితే ముడుతలు, కంటికింద ఉండే బ్యాగులు పోతాయి.

నొప్పి నివారిణి:- నొప్పిగా ఉన్న ప్రాంతంలో అరటితొక్కతో రాయండి. నొప్పినుండి ఉపశమనం వోచ్చేవరకు ముప్ఫై నిముషాల వరకు అలానే వదిలేయండి. అరటి తొక్కతో కూరగాయల నూనె మిశ్రమం కలిపి రాస్తే, నొప్పినుండి ఉపశమనం కలుగుతుంది.

సోరియాసిస్:-సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం అంతటా అరటితొక్కతో రాయండి. అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు.

దోమల కాట్లు:- దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి.

షూస్, లెదర్, సిల్వర్ పాలిష్: ఏవైనా బూట్లు, తోలు, మరియు రజతం; వీటిని వెంటనే ప్రకాశింప చేయడానికి అరటితొక్కతో రుద్దండి. అరటితొక్కలతో షూస్ రుద్దినా పాలిష్ వేసినట్టే మెరుస్తాయి.

ఎండిపోయిన అరటి తొక్కలు గార్డెనింగ్‌కి పనికొస్తాయి. వాటిని గులాబీ మొక్కల మొదళ్లలో వేస్తే పువ్వుల రంగు ముదురుగా వచ్చి మెరుస్తుంటాయి.

UV రక్షణ: అరటి తొక్క హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML