వాస్తవంగా భగవంతుడికి ఏ విధమైన విగ్రహం వస్తుతః లేదు. భగవంతుడు సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. కానీ భగవంతుణ్ణి అన్నిచోట్లా చూసేంత పరిపూర్ణత్వం మనకు లేదు. అటువంటి ఉత్తమమైన సంస్కారం ఎవడో ప్రహ్లాదుడి లాంటి భాగవతోత్తముడికి ఉంది కానీ మిగతా వారికి అటువంటి సంస్కారం అటువంటి పరిపాకం అనేది ఉండదు. అందువల్ల మనకి ఏం చేశారు అని అంటే ఒక మూర్తిలో భగవంతుని ఆవాహన చేసి అక్కడ భగవంతుని ఆరాధిస్తే భగవంతుడు సుప్రసన్నుడు అవుతాడు అని మనకు ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు ఉపదేశం చేశారు. మనం రాళ్ళు రప్ప అనే దృష్టితో పూజ చేయడం లేదు. రాళ్ళు రప్ప అనే దృష్టితో పూజ చేస్తే తప్పే. కానీ మన దృష్టి అలా కాదు. అది సాక్షాత్తూ పరమాత్మ అని అనుకుంటున్నాం. పరమాత్మ దృష్టితో చేసే పూజ ఫలాన్నిస్తుంది. వెనకటి వాళ్లకి ఇచ్చింది, ఈవాల్టికీ మాకు ఇస్తుంది. జీవం లేని దానికి పూజ చేస్తున్నారు అన్నారు. దాంట్లో మేము జీవకళ ఆవాహన చేసి పూజ చేస్తున్నాం. దానికి శాస్త్రంలో విధానాలున్నాయి. ఆ రాతిలో జీవకళను ఆవాహన చేసి ఆరాధన చేస్తే భగవత్ చైతన్యం అక్కడ సాక్షాత్తూ సానిధ్యాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తున్నది. అందువల్ల అది రాయీ రప్ప అని పూజ చేయడం లేదు. జీవం లేనిది అని పూజ చేయడం లేదు. ఎవరైతే విగ్రహారాధన ఖండిస్తున్నారో వాళ్ళు ఇవ్వాళ కొత్తగా వచ్చిన వారు కాదు. వెనకటి నుంచి ఉండనే ఉన్నారు. దేవతలు, రాక్షసులు సర్వ కాలాలలో ఉన్నారు. ఇవాళే రాక్షసులు బయలుదేరారు అని మీరు అనుకోవాల్సిన పని లేదు. అంత మాత్రం చేత దేవతలకు హాని ఏమీ కలుగదు. ఈ మూర్ఖులు, నాస్తికులు అనే వాళ్ళు వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ అనాదిసిద్ధంగా వచ్చినటువంటి ఏదైతే ఈ విగ్రహారాధన అనే పధ్ధతి ఉందో దీనికి ఏవిధమైనటువంటి భంగం లేదు. విగ్రహారాధన మనకు మహాఫలప్రదంగా దృష్టి ముఖ్యం మనకు. దీనివల్ల సమస్త ఆస్తికులకు శ్రేయస్సు కలుగుతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment