ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 19 January 2015

భోగిపండుగ అంతరార్థం........భోగిపండుగ అంతరార్థం.............మన పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి, ఆధ్యాత్మిక చింతనకు మార్గ నిర్దేశికతను సూచి స్తాయి. మకర సంక్రాంతి మనకు సంప్రదాయ సిద్ధమైన గొప్ప పం డుగ. ఈ సంక్రాంతి పండుగను గ్రామీణ ప్రజలు, రైతులు ఆనందోత్సాహాలతో మూడు రోజులు గొప్పగా జరుపుకుంటారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపదకు భారతదేశం ఆలవాలము. భారతీయ సంప్రదాయము లన్నియూ సకల జనులకు ఆచరణ యోగ్యములు.

'భోగి' పండుగ అంటే అన్ని భోగాలనూ సమకూ రుస్తుందని శాస్త్ర వచనం. శీతాకాలం స్తబ్దతను పోగొ ట్టేందుకు తెల్లవారు జామునే భోగిమంటలు వేసుకొని చలిని పారద్రోలడానికి ప్రయత్నిస్తూ, దక్షిణాయమునకు వీడ్కోలు పలికి, ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే రోజు భోగి పండుగ. ఈ భోగి మంటల వల్ల హే మంత ఋతువులో చలితోపాటూ విజృంభించే క్రిములు, ప్రాణులకి అపకారాన్ని కలిగిస్తాయి కనుక మన ప్రాచీ నులు ఎక్కవ సంఖ్యలో క్రిములుండే తెల్ల వారు జామున పెద్ద మంటల వల్లవచ్చే దాహక శక్తికి, క్రిములన్నీ నశిస్తా యనే భావనతో భోగిమంటలను ఏర్పాటు చేశారు.
భోగి పండుగ రోజే ఐదు సంవత్సరాల పిల్లలకు భోగి పండ్లు పోయడం ఒక సంప్రదాయం. రేగు పండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర నాణలు, పూలు కలిపి భోగి పండ్లు పేరిట పేరంటానికి వచ్చిన ముత్తైదువులు పిల్లల తల చుట్టూ మూడు సార్లు చుట్టి పోస్తారు. ఇలా పోయ డం వల్ల పిల్లలకు సంవత్సరం పాటూ తగిలిన దృష్టి దోషం తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసం. సాయం వేళ పేరంటాలకు పసుపు, కుంకుమ, అరటి పండ్లు, నువ్వులు చెక్కర కలిపిన మిశ్రమాన్ని దక్షిణ తాంబూ లలతో వాయనాలు ఇవ్వడం ఆనవాయితి.
సంవత్సరమంతా రైతులు శ్రమపడి కష్టించి పం డించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి వచ్చిన సమయంలో జరుపుకునే పండుగ సంక్రాంతి. తమ కష్టఫలమైన పం టను చూసి పడిన శ్రమంతా మరచిపోయిన రైతు కొత్త ధాన్యంతో పాలను చెక్కర కలిపి 'పొంగలి' తయా రుచేసి మనకు ప్రత్యక్షదైవమైన సూర్యదేవునికి నైవేద్య ముగా సమర్పించి కుటుంబంలోని అందరూ స్వీకరిస్తారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML