పసుపుతో ఆరోగ్యం
* గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగాఉపయోగపడుతుంది.
* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.
* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.
No comments:
Post a comment